Puri Rath Yatra 2021: ఈ సంవత్సరం జులై 12న పూరీ జగన్నాథ రథయాత్ర జరపాలని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (SJTA) నిర్ణయించడంకో... ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఒడిశా... పూరీ పట్టణంలో జరిగే ఈ రథయాత్రకు కరోనా ప్రోటోకాల్ పాటించనున్నారు. షెడ్యూల్ ఎలా ఉండాలి అనేది... ఆదివారం ఫైనలైజ్ చేస్తారు. రథయాత్రకు ఇంకా 2 వారాలే టైమ్ ఉండటంతో... రథాల తయారీ జోరుగా సాగుతోంది. (Image credit - twitter - ANI)
తాజా వివరాల ప్రకారం... ఈ కార్యక్రమంలో పాల్గొనేవారందరికీ... RT-PCR టెస్టులు చేస్తారు. లేదా వారు 2 వ్యాక్సిన్ డోసులు వేయించుకున్నవారై ఉండాలి. గతేడాది లాగే... ఈ సంవత్సరం కూడా భక్తులను ఈ కార్యక్రమానికి అనుమతించట్లేదు. ఆలయ పూజారులు, సిబ్బంది మాత్రమే పాల్గొంటారు. ఇండియాలో కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదు కాబట్టే భక్తుల్ని అనుమతించట్లేదని SJTA తెలిపింది. (Image credit - twitter - ANI)
జులై 12న ఉదయం 8-30కి రథయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 నుంచి రథాలను లాగే కార్యక్రమం మొదలవుతుంది. జులై 23న దేవతామూర్తులను తిరిగి ప్రధాన ఆలయానికి తీసుకొస్తారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఉంటుంది. ఆలయ అధికారుల ప్రకారం... జులై 25న నుంచి ఆలయానికి భక్తులను అనుమతిస్తారు. (Image credit - twitter - ANI)