మేష రాశి (Aries): గురు బలం ఉన్నందువల్ల ఆర్థికస్థితి క్రమంగా మెరుగవుతుంది. వృత్తిలో ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి.
మిథున రాశి (Gemini): ఉద్యోగానికి సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు అనుభవానికి వస్తాయి.
ధనస్సు రాశి (Sagittarius): ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఇంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇంటా బయటా బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.