మేషం: జ్యోతిషశాస్త్రంలో మేషరాశిని జన్మ కుండలి మొదటి రాశిగా పరిగణిస్తారు. మేష రాశికి అధిపతి అంగారక గ్రహం. నవగ్రహాల్లో కుజుడు... ధైర్యం, ప్రమాదం, అగ్ని కారకుడిగా భావిస్తారు. అందుకే మేష రాశి వారు సైన్యం, పోలీస్ ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. అంతేకాదు ఆ రంగంలో ఉన్నత పదవులను పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం: సింహ రాశికి అధిపతి సూర్య దేవుడు. సింహ రాశి వారి జాతకంలో సూర్యుడు బలమైన స్థానంలో ఉన్నప్పుడు, కుజుడు వంటి గ్రహాలు శుభ దృష్టి కలిగి ఉన్నప్పుడు.. వారు సైన్యం, పోలీసు ఉద్యోగాలలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. ఈ రాశి వారు తమ జీవితంలో ఉన్నత స్థానాలను పొందుతారు. సింహ రాశి వారు యుద్ధ వ్యూహాన్ని రచించడలో నిష్ణాతులు. సమయం వచ్చినప్పుడు తమ శత్రువులకు తగిన విధంగా బుద్ధి చెబుతారు. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అంగారకుడి ప్రభావం ఈ రాశిపైనా కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు తమ చర్యలను రహస్యంగా ఉంచడంలో ప్రావీణ్యులు. అందువల్ల వీరి వ్యూహం అర్థంకాక శత్రువులకు ముచ్చమటలు పడతాయి. ఈ రాశుల వారు శత్రువులను అలవోకగా ఓడించగలరు. వృశ్చిక రాశి ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోయారు. లక్ష్యం వైపే వారి గురి ఉంటుంది. అందుకే ఆర్మీ, పోలీస్ సేవల్లో వీరు విజయం సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)