మిథునం (Gemini): ఈ రాశుల వారికి ధన లాభం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. తోబుట్టువుల నుండి సహాయం అందుతుంది. ధైర్య సాహసాలు పెరుగుతాయి. ప్రతిష్ట, పదవులు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం కోసం సమయం అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. కుటుంబం నుంచి ఆకస్మికంగా శుభవార్తలు రావచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (Cancer): ఉద్యోగ, వ్యాపారాలకు అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవం లభిస్తుంది. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి అనుకూల సమయం ఇది. విద్యారంగంతో అనుబంధం ఉన్న ప్రజలకు ఈ సమయం వరం లాంటిది. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (Sagittarius): మీ ఉద్యోగంలో పురోగతికి అవకాశాలను పొందుతారు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు. వ్యాపారులు లాభాలు పొందుతారు. మీరు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు. ధనలాభం కలుగుతుంది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (Pisces): మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో ప్రతిష్ట, పదవులు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో లాభసాటి అవకాశాలున్నాయి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు శుభ ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనిని అందరూ అభినందిస్తారు. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)