మేషం(Aries):(అశ్విని, భరణి, కృత్తిక 1) అర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం గురించి అం దోళన చెందనవసరం లేదు. పిల్లలు మిమ్మల్ని సంతోష పెడతారు. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఆధారపడతారు. (ప్రతీకాత్మకచిత్రం)
వృషభం(Taurus): (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. ఈ రోజంతా ఆధ్యాత్మికమైన కాలక్షేపాలతో ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో పలుకుబడి వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలకు కొద్దిగా డబ్బు వెచ్చిస్తారు.(ప్రతీకాత్మకచిత్రం)
మిథునం(Gemini):(మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) వృత్తి ఉద్యోగాల్డో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడం మీద దృష్టి పె డతారు. ఉద్యోగంలో మార్పులు జరగవచ్చు. ఆరోగ్యం పరవాలేదు. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. విద్యార్థులు పురోగతి చెందుతారు. విందులు వినోదాల్లో పాల్గొాంటారు. భార్యాపిల్లలతో మంచి కాలక్షేపం చేస్తారు. (ప్రతీకాత్మకచిత్రం)
కర్కాటక రాశి (Cancer):(పునర్వసు4,పుష్యమి, ఆశ్లేష) నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అదనపు పనులతో ఇబ్బంది పడతారు. వ్యాపారులకు, వృత్తులవారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది. ముఖ్యమైన పనుల మీద తిప్పట ఎక్కు వగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలలో పెద్దల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యు ల సహకారముంటుంది.(ప్రతీకాత్మకచిత్రం)
సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1) గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఎంతో నిగ్రహంతో వ్యవహరించాలి. అనుకోని సమస్య లు మీద పడతాయి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువవుతుంది. బాగా పరిచయస్తులు మోసగించే అవకాశం ఉంది. నిరుద్యోగులు చిన్న ఉద్యోగంలో చేరతారు. వివాహ ప్రయత్నాలు విసిగిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది.(ప్రతీకాత్మకచిత్రం)
కన్య (Virgo):(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) అదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలకు అవకాశం ఉంది. భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన షేర్లకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. కోపతాపాలకు ఇది సమయం కాదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు.(ప్రతీకాత్మకచిత్రం)
తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) వ్యాపారులు, స్వయం ఉపాధివారికి మాత్రమే కొద్దిగా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు బాగా ఒత్తి డి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరి కీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరో గ్యం పరవాలేదు.(ప్రతీకాత్మకచిత్రం)
వృశ్చికం (Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
అస్తుల కొనుగోలు, అమ్మకాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆశించిన సమాచారం అందుతుంది. (ప్రతీకాత్మకచిత్రం)
ధనుస్సు (Sagittarius):(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల మార్పుల చోటు చేసుకుంటాయి. వివా
హ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య
మధ్య అనారోగ్య బాధ తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఎవరికీ
హామీలు ఉండవద్దు.(ప్రతీకాత్మకచిత్రం)
మకరం (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
అకస్మిక ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తువులు కొంటారు. ఎక్కువగా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం అన్ని విధాలా అనుకూలిస్తుంది. మానసిక అందోళనలు తగ్గుముఖం పట్టేఅవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేరతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.(ప్రతీకాత్మకచిత్రం)
కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనజనకంగా ఉంటు౦ది. కొత్త పరిచయాలకు అవకాశం ఉంది. బంధువుల నుంచి ఆందోళనకరమైన కబుర్లు వింటారు. ని రుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన అఫర్ వచ్చే సూచనలున్నాయి. ఎవరితోనూ అర్థిక లావాదే వీలు పెట్టుకోవద్దు.(ప్రతీకాత్మకచిత్రం)
మీనం (Pisces):(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు పూర్తి కావడానికి తిప్పట తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక, కళా సాహిత్య రంగాలలో వారికి తప్ప, ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు, వృత్తులవారికి సమయం అనుకూలంగా లేదనే చె ప్పాలి. అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి నిలక డగా ఉంటుంది.(ప్రతీకాత్మకచిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)