మేషం (Aries):మేష రాశి వారు ఇవాళ నమ్మకంతో ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. మీకు క్రీడలపై ఆసక్తి ఉంటే.. దానిపై శ్రద్ద పెడితే బాగా రాణిస్తారు. మీరు మీ వ్యక్తిగత ఆసక్తులతో పాటు మీ పనిలో విజయం సాధించేందుకు ఇదే మంచి సమయం. మీ అవసరం చాలా మందికి ఉంటుంది. ఆఫీసులో బాస్ మీ పనితనం మెచ్చుకుంటారు.
లక్కీ సైన్: ముసుగు
వృషభం (Taurus):మీ సామర్థ్యం పట్ల నమ్మకంగా ఉండండి. తద్వారా మీరు నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ రంగంలో మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీ విజయాలకు మీ తల్లిదండ్రులు కూడా సహకారం అందిస్తారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి మీకు తగిన స్పాన్సర్ కూడా దొరుకుతారు. మీరు కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టి విజయం సాధిస్తారు.
లక్కీ సైన్: గొట్టపు బావి
కర్కాటకం (Cancer):మీ మనస్సు ఏది చెబితే దాన్ని అనుసరించండి. తద్వారా మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆలోచనలు రాబోయే రోజుల్లో విజయానికి దారి చూపిస్తాయి. కార్పొరేట్ ప్రపంచంలో మీకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. మీ ఆఫీసులో మంచి గుర్తింపు లభిస్తుంది. త్వరలోనే ఆహ్లాదకరమైన విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
లక్కీ సైన్: సిరామిక్ పాత్ర
సింహం (Leo):పబ్లిక్‌గా ప్రైవేట్ సంభాషణలు చేయడం మానుకోండి. మీకు తెలియకుండానే ఏదో ఒక విషయంలో మీరు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఇవాళ మీ పట్ల ఆకర్షితులైన ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. మీరు మానసికంగా కూడా బలహీనంగా ఉండవచ్చు. తొందరపాటు లేదా త్వరిత నిర్ణయాలు తీసుకోకండి. శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయండి.
లక్కీ సైన్: ఎరుపు రంగు
తుల (Libra):మీరు మీ వ్యవహారాల్లో స్పష్టంగా, పారదర్శకంగా ఉండాలి. మీ బందువులు లేదా దగ్గరి స్నేహితులు ఎవరైనా గుండెపోటుతో బాధపడవచ్చు. సలహా కోసం మీ వద్దకు వచ్చే అవకాశం ఉంది. మీకు కూడా ఆరోగ్యం పరంగా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అయితే, దాని గురించి ఆందోళన చెందకండి. ఇది తాత్కాలికమైనప్పటికీ, కాలక్రమేణా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
లక్కీ సైన్: నమూనా కుషన్
వృశ్చికం (Scorpio):మీరు చేపట్టే వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీ వ్యాపారానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయం చేస్తారు. సీనియర్లు లేదా పైస్థాయిలో ఉన్న అధికారులు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలా సహకారాన్ని అందిస్తారు. ఆస్తి విక్రయానికి ఆసక్తి ఉంటే ముందుకు వెళ్లడమే మంచిది.
లక్కీ సైన్: ఎంబ్రాయిడరీ వర్క్
కుంభం (Aquarius):ఎప్పుడైనా సంక్షోభం ఎదురైనప్పుడు ధైర్యంతో ముందుకు వెళ్లండి. మీరు త్వరగా సంక్షోభం నుంచి బయటపడగలరు. మీ గత తప్పిదాలు పునరావృతం కాకుండా చూసుకోండి. త్వరలోనే ఒక ఆధ్యాత్మిక యాత్ర చేపట్టే అవకాశం ఉంది. దీనికి ముందుగానే ప్రణాళిక సిద్దం చేసుకోండి. మీ స్నేహితులతో ఎక్కువ సేపు గడిపే అవకాశం ఉంది.
లక్కీ సైన్:- ఫాన్సీ కారు
మీనం (Pisces):మీ వివాహం గురించి శుభవార్త వింటారు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుకుంటారు. అయితే, కొందరు మీకు చేటు చేసే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే వారు మీపై అసూయను ప్రదర్శిస్తుంటారు. కొన్నిసార్లు ప్రతికూల మనస్తత్వం మీ జీవితాన్ని కొన్ని అడుగులు వెనక్కి వేసేలా చేస్తుంది.
లక్కీ సైన్: చెట్టు