మేషం(Aries):(అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుం ది. స్నేహితులు మీ సలహా తీసుకుని పాటిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులు అభి వృద్ధి చెందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. (పేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. ఎవరికీ హా మీలు ఉండొద్దు.
వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఆర్థిక, అరోగ్య సమస్యల నుంచి గట్టెక్కే రోజులు ప్రారంభమయ్యాయి. తలచిన పనులు నెరవేరుతా యి. దూర ప్రాంతం నుంచి వివాహ సంబంధం వస్తుంది. ప్రయాణాలకు అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు హాజరవుతారు. అనుకూలమైన స్నేహితురాలు పరిచయం అవుతుంది.
మిథునం(Gemini):(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంది. బాగా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్సా లు ప్రారంభిస్తారు. మీ సంతానంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం ఆఫర్ వస్తుంది. మంచి ఉద్యోగ అవకాశం ఉంది. వ్యాపారులు, వృత్తి నిపుణులు లాభాలు ఆర్జిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూ చి అడుగేయండి.
కర్కాటక రాశి (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొ న్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తుల కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి. వ్యాపారులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి.
సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1) మీ సంతానంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. అర్థిక లావాదేవీలకు అవకాశం ఉంది. ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తవచ్చు. (ప్రేమ వ్యవహారాలు నల్లే రు మీది బండిలా సాగిపోతాయి. వ్యాపారులకు ఆర్థికంగా బాగుంది. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.
కన్య (Virgo):(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) సంతానానికి సంబంధించి శుభ వార్త వింటారు. మంచి వివాహ సంబంధం కుదురుతుంది. పనులు కొద్దిగా ఆలస్యమైనా మీకు అనుకూలంగానే పూర్తవుతాయి. బంధుమిత్రుల ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. (పేమ వ్యవహారాలు ప్రోత్సాహకరంగానే ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండొద్దు.
తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) చిన్న వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది. మీ అబ్బాయిని మంచి ఉద్యోగంలో చేర్చే ప్రయత్నం చేస్తారు. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. స్నేహితులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త, వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.
వృశ్చికం (Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) అరోగ్యానికి, ఆదాయానికి ఢోకా లేదు. ఖర్చులకు కళ్లెం వేయాలి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవ చ్చు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. గృహ రుణానికి మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది. వ్యా పారులకు సమయం అనుకూలంగా ఉంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రాకపోవచ్చు.
ధనుస్సు (Sagittarius):(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. అర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. మీరు ఆశించి న విధంగా మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు బంధువుల సహకారంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు బాగా శ్రమపడాల్సి వస్తుంది.
మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) అదాయం నిలకడగా ఉంటుంది. అనుకోకుండా డబ్బు చేతికి అంది, కొంత రుణ బాధ తగ్గుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటు ౦ది. విదేశాల నుంచి పెళ్లి సంబంధం వస్తుంది. (పేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయండి. హామీలు ఉండొద్దు.
కుంభం (Aquarius):(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో బదిలీకి అవకాశం ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. చాలావరకు అ ప్పులు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వి ద్యార్భులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో సమస్య లు ఎదురవుతాయి.
మీనం (Pisces):(పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ అమ్మాయికి పెళ్లి స ౦బంధం కుదురుతుంది. వృత్తి నిపుణులు రాణిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతారు. వ్యా పాఠ రంగంలోని వారు విస్తరణ కార్యక్రమం చేపడతారు. (పేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్ధిక లావా దేవీలు లాభించవు.