కన్యా రాశి వారు అదృష్టవంతులు అని జ్యోతిష పండితులు చెబుతుంటారు. వారిని పుట్టుకతోనే పరిపూర్ణులు అంటుంటారు. ఎందుకంటే వారికి జీవితంలో ఆర్థిక సమస్యలు పెద్దగా రావు. పైగా... చాలా సందర్భాల్లో వారికి డబ్బు అనుకోకుండా వస్తూ ఉంటుంది. చుట్టుపక్కల వారు... వీళ్లను చూసి... భలే డబ్బు వస్తోందే... వీళ్ల పనే బాగుందే అనుకుంటూ ఉంటారు. నిజానికి కన్యా రాశి వారు బాగా కష్టపడతారు. ఏ పని చేసినా జాగ్రత్తగా చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి స్పందిస్తారు. అందువల్లే వీరికి డబ్బు రాక అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
సింహ రాశి వారి థాట్ ప్రాసెస్ హై రేంజ్లో ఉంటుంది. ఏం చేసినా తెలివిగా చేస్తారు. తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి. సింపుల్‌గా సరిపెట్టేసుకోవడం ఈ రాశి వారికి నచ్చదు. ఓ రేంజ్లో లైఫ్ స్టైల్ ఉండాలని కోరుకుంటారు. అందువల్ల వీరు చేసే ప్రతీ పనిలో ఆ హై నెస్ కనిపిస్తుంది. తెలివితేటల్ని కరెక్టుగా ఉపయోగిస్తూ అనుకున్నది సాధించుకుంటారు. అందువల్ల డబ్బు వీరికి కావాల్సినంత వస్తూనే ఉంటుంది. ఇందుకోసం వీరు హార్డ్ వర్క్ చేయరు. తెలివితేటల్నే ప్రయోగిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
మకర రాశి వారు ఎప్పుడు శాంతంగా, సైలెంట్‌గా ఉండటానికి ఇష్టపడతారు. ఏ పని చేసినా కంగారు, గాబరా అన్నవి ఉండవు. అలాగని పనిని నెమ్మదిగా చేసే రకమూ కాదు. పనిలో విజయం సాధించడం అనేది ఈ రాశి వారికి చాలా ఈజీ. అందువల్లే వీరు చేపట్టిన ప్రతీదీ సక్సెస్ అయ్యేలా చేసుకుంటూ కావాల్సినంత మనీ రాబట్టుకోగరు. తమ జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకోవడంలో ఈ రాశి వారు విజయం సాధిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చిక రాశి వారికి ఓ టాలెంట్ ఉంటుంది. వీరు ఎదుటి వారు మనసులో ఏమనుకుంటున్నారో గ్రహిస్తారు. ముఖ్యంగా పని లేదా ఉద్యోగం చేసే చోట తమ పై అధికారులను మెప్పించడంలో, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఈ రాశి వారు దిట్టలు. అందువల్ల వీరు చాలా త్వరగా ప్రమోషన్లు, ప్రశంసల వంటివి పొందుతారు. 30 ఏళ్ల వయసు దాటాక వీరికి ఆర్థిక సమస్యలు దాదాపు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభ రాశివారికి ఏదైనా నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే చాలా వేగంగా నేర్చేసుకుంటారు. దానికి తోడు వీళ్లకు ఏకాగ్రత, మనో నిశ్చయం ఎక్కువ. దేనిపైనైనా దృష్టి పెడితే... ఇక దానిపైనే ఫోకస్ ఉంచుతారు. ఇతరత్రా ఏవీ పట్టించుకోరు. అందువల్ల చేసిన పనిలో తిరుగులేని ట్రాక్ రికార్డ్ వీళ్ల సొంతమవుతుంది. అందువల్ల ఆటోమేటిక్‌గా పనికి గుర్తింపు, డబ్బు, సమాజంలో ఉన్నత స్థితి వంటివి వీరికి లభిస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)