రాశి చక్రంలోని 12 రాశులకూ కొన్ని మంచి గుణాలు, కొన్ని చెడు గుణాలూ ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం... ఆ రాశులతో... గ్రహాలు, నక్షత్రాలతో ఉన్న సంబంధాలే. ఈ 12 రాశుల్లో 4 రాశుల వారు ఇతరుల్ని ఆశ్చర్యపరుస్తారు. ఎందుకంటే... ఈ 4 రాశుల వారూ... ఇతరుల ఆలోచనలను... తమ ఆలోచనలుగా అమల్లోకి తెస్తారు. అది చూసి... ఇతరులు... అది నా ఐడియా... అని అనుకుంటారు. ఒకింత బాధపడతారు. ఇలా ఇతరుల ఐడియాలను చోరీ చేయడానికి కారణమేంటంటే... ఈ రాశుల వారు స్వయంగా లోతుగా ఆలోచించలేరు. వారి మేథో సంపత్తి కొంతే ఉంటుంది. కాబట్టి... పరాన్న జీవుల లాగా ఇతరుల ఆలోచనలపై ఆధారపడతారు. ఇందుకు వాళ్లను తప్పుపట్టలేం. ఎందుకంటే... వాళ్లకు అంత తెలివితేటలు ఉండవు. వారిపై జాలి పడటమే తప్ప... చేసే దేమీ ఉండదు.
మైండ్, తెలివితేటలు అందరికీ ఒకలా ఉండవు. కొందరు ఏదైనా క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. మిగతా వాళ్లకు భిన్నంగా ఆలోచిస్తారు. చాలా షార్ప్‌గా, ఇన్నోవేటివ్‌గా, ఇంటెలిజెంట్‌గా ఉంటారు. తమ తెలివితో మిగతా వాళ్లను ఇట్టే ఆకట్టుకుంటారు. సరిగ్గా అలాంటి వాళ్లపైనే ఆధారపడతారు ఈ పరాన్న జీవి టైపు రాశుల వారు. వీరు తమకు తాముగా ఆలోచించడం కంటే... ఇతరుల ఆలోచనలను తమవిగా ఇంప్లిమెంట్ చేసుకోవడం మేలనుకుంటారు. అందుకు ఏమాత్రం మొహమాటపడరు. పైగా... ఆ ఐడియా బాగుందని ఎవరైనా మెచ్చుకుంటే... థాంక్యూ అని నవ్వేస్తారు. అది తమది కాదని చెప్పరు. అది వారి వీక్నెస్ అని జ్యోతిష పండితులు చెబుతున్నారు.
మిథన రాశి వారిని కాపీక్యాట్స్ అంటారు. వీరికి ఏదీ స్వతంత్ర ఆలోచన ఉండదు. ప్రతీదీ ఇతరుల ఆలోచనలతోనే ఉంటుంది. వీరు వేసుకునే డ్రెస్, చేసే పని, వేసుకునే ప్లాన్లు, చేపట్టే పనులు... అన్నీ ఇతరులు చేసినవీ, పాటించినవే ఉంటాయి. కొత్తగా ఏదీ చెయ్యలేరు. వీరికి అన్నీ తెలుసు. కాపీ చేస్తే అవతలి వారు ఫీల్ అవుతారని కూడా తెలుసు. కానీ... నిస్సహాయతలో ఉంటారు. ఐతే... వీరిలో లోతైన పరిశీలనా దృష్టి ఉంటుంది. వీరు ఐడియాని కాపీ చేసినప్పుడు దాని పూర్తి వివరాలు తెలుసుకొని... అందర్నీ తమదే అని నమ్మించగలరు. తద్వారా అసలు ఐడియా వారు సైతం... అది తమ ఐడియా అని ఎవరికైనా చెప్పినా... అవతలి వారు నమ్మలేరు.
కర్కాటక రాశి
ఎమోషనల్ రాశి అయిన కర్కాటక రాశి వారు... తెలివైన వారే. కానీ ఆ తెలివి తేటల్ని కొత్త ఆలోచనల కోసం అంతగా ఉపయోగించరు. దానికి బదులుగా... ఇతరుల ఐడియాలను వాడేసుకుంటారు. ఆ విషయం బయటపడినప్పుడు ఎమోషనల్ డ్రామా మొదలుపెడతారు. వీరు ఇతరుల ఐడియాలను చోరీ చేయడానికి ఏమాత్రం సంకోచించరు. దొరికిపోయినప్పుడు అమాయకపు ఫేస్ పెడతారు. అవతలి వారు జాలి పడేలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. చివరకు... పోనీలే... ఏం కాదులే అని అసలు ఐడియాదారులు భావించేలా చేసుకుంటారు. ఇలా ఫీల్ గుడ్ కలిగించే గుణం వీరిలో ఉంటుంది.
సింహ రాశి
వారు... తాము దేవుడి బిడ్డలం అని బలంగా నమ్ముతారు. తాము ఏం చేసినా తప్పు కాదు అనుకుంటారు. వీరు చాలా మంది నుంచి చాలా ఐడియాలు లాగేసుకుంటారు. అవన్నీ తమ ఐడియాలుగా భావిస్తారు. తమ షార్ప్ మైండ్ లోంచీ ఆ ఐడియాలు వచ్చినట్లుగా తమను తాము నమ్మించుకుంటారు. ఫలితంగా ఎవరైనా ఫలానా ఐడియా నాది అని వాదనకు వచ్చినా... నీకు మాత్రమే ఐడియాలు వస్తాయా... మాకు రావా... మాకు తెలివితేటలు లేవా అని ప్రశ్నించగలరు. సమస్యేంటంటే... తాము ఐడియాలు చోరీ చేస్తున్నామని వీరు అనుకోరు. మనస్ఫూర్తిగా అవి తమ సొంత ఐడియాలే అని నమ్ముతారు. అందువల్లే వీరితో వాదించడం కష్టం.
తుల రాశి
ప్రతీదీ సరి సమానంగా ఉండేలా జాగ్రత్త పడే తుల రాశి వారు ఇతరుల ఐడియాలను తమవిగా భావించేందుకు ఇష్టపడతారు. తాము లోతుగా ఆలోచించలేమనీ, తమకు అన్ని ఐడియాలు రావు అని వీరు ఫీలవుతారు. అలా ఆలోచించి బుర్ర బద్ధలు కొట్టుకునే కంటే... ఇతరుల ఐడియాలను ఫాలో అయిపోవడం మేలు అని బలంగా నమ్ముతారు. వీరికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే... వీరు ఏ ఐడియా చోరీ చేసినా... దాని అసలు ఓనర్లు గుర్తించలేరు. తాము సరికొత్తగా ఆలోచించలేం అని బలంగా నమ్మే తుల రాశి వారు... ఇతరుల ఐడియాలను లాగేసుకోవడం తప్పేమీ కాదని భావిస్తారు.(Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not confirm these. Please contact the relevant expert before implementing them.)