* మేషం : మేష రాశి వారు చాలా మంది ఉద్యోగస్తులు కావడంతో ఆఫీసులకే పరిమితమవుతారు. కాబట్టి, ఇంట్లో తయారుచేసిన పదార్థాలనే ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపుతారు. మేషరాశి వ్యక్తులు స్ట్రీట్ ఫుడ్ చూసేటప్పుడు తెలివిగా వ్యవహరించి వాటికి దూరంగా ఉంటారు. కానీ, రోడ్డు పక్కన ఉన్న షాప్స్‌లో కూడా చక్కని స్వీట్స్ కనిపించాయంటే మాత్రం స్వీట్‌గా బిహేవ్ చేస్తారు. మనసుకు హాయిని, ఓదార్పును ఇచ్చే ఐటెమ్స్‌ను ఆస్వాదిస్తుంటారు. శరీరానికి చలువ చేసే లస్సీ ఫ్లేవర్డ్ స్వీట్‌తో పాటు లిక్విడ్ ఫామ్‌లో ఉన్న కోవాతో చేసిన ఫుడ్ ఐటెమ్స్ అంటే వీరికి చాలా ఇష్టం.
* మిథునం : ఈ రాశివారు కంటికి ఆకర్షణీయంగా, ఆహ్లాదంగా కనిపించే డెజర్ట్‌లను ఎక్కువగా ఇష్టపడతారు. కాంప్లెక్స్ ఫ్లేవర్ ప్రొఫైల్స్‌తో పాటు విభిన్నమైన పేస్ట్రీలను ఆస్వాదిస్తారు. అన్ని రకాల డెసర్ట్స్ పేర్చి ఉన్న ప్లేట్ చూస్తే.. వీరు టెమ్ట్ అవుతారు. విభిన్నమైన రంగులతో చేసిన ఫుడ్ ఐటెమ్స్ చూడగానే వీరు ఎగిరి గంతులు వేస్తారు. వాటిలో తమ కంటికి బాగా ఇంపుగా కనిపించే రంగుతో చేసిన స్వీటుని నోట్లో వేసుకుని మనసారా ఆస్వాదిస్తారు.
* వృషభం : ఈ రాశి వారు ఎప్పుడు భోజనం చేసినా కాస్త స్వీట్ ఉండేలా చూసుకుంటారు. భోజనానికి ముందు లేదా భోజనం పూర్తి చేసిన తరువాతైనా వీరికి స్వీట్ ఐటెమ్ ఉండాల్సిందే. జామ్స్ ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. అందుకే, బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు జామ్-బ్రెడ్‌ని ప్రిఫర్ చేస్తారు. అదీ లేకపోతే, చపాతీలో కూడా జామ్ వేసుకుని తినేస్తుంటారు. కొన్ని రాశుల్లో జన్మించిన వ్యక్తులు అనుకున్న దానికంటే ఎక్కువ తింటారని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. వాటిలో వృషభం కచ్చితంగా ఉంటుంది.
* సింహం : సింహరాశి వారు లావిష్, విలాసవంతమైన ఫుడ్ అంటే ఇష్టపడతారు. డిన్నర్ సమయంలో కొన్ని ఐటెమ్స్ కచ్చితంగా ఉండాలనుకుంటారు. అందుకే, వివిధ రకాల రుచులు, మల్టిపుల్ లేయర్స్ ఉన్న కేక్‌లను ఇష్టంగా తింటారు. వారు ఆరోగ్యకరమైన, షుగర్ లేని ఫుడ్స్ అంటే అసహ్యించుకుంటారు. కుకీలు, మిఠాయిలు, చాక్లెట్స్‌తో పాటు స్వీట్స్ తప్పకుండా తినాలని భావిస్తారు.