ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు పంచకేదరాల్లో ఇది మొదటిది. పాండవులకు అందకుండా శివుడి మూపురభాగం ఉన్న చోటు. ఇక్కడి లింగం 8 గజముల పొడవు, నాలుగు గజముల ఎత్తు.. నాలుగు గజముల వెడల్పు ఉంటుంది. లింగం త్రిభుజాకారంలో ఉంటుంది. పాండవులు స్వర్గలోకానికి తమ అంతిమ దశను ఇక్కడి నుంచే ప్రారంభించారు. శంకరాచార్యులు మోక్షం పొందిన క్షేత్రం. ఈ ఆలయం కేవలం ఏడాదిలో 6 మాసాలు మాత్రమే తెరుస్తారు.అక్షయతృతీయనాడు తెరుస్తారు. కార్తీకమాసంలో వచ్చే యమద్వివిదియనాడు ఆలయం మూసేస్తారు.
పంచకేదరాలలో ఇది రెండోది. ఇక్కడ శివుని చేతులు లింగ రూపంలో వెలసిన క్షేత్రం. తుంగనాధుడంటే శిఖరాలకు అధిపతి. అందుకే ఇది కేదర్నా«ద్ కంటే ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. పాండవుల చిత్రాలు గోడపై చెక్కి ఉంటాయి. ఆలయానికి కుడివైపు పార్వతీ దేవి ఆలయం ఉంటుంది. ఈ పంచకేదర నామూనాలను అర్జునుడు నిర్మించారని స్థల పురాణం చెబుతుంది.
ఇక్కడ శివుని ముఖ భాగం వెలసిన చోట. ఈ శివుడిని నిలకంఠ మహదేవ్ అని పిలుస్తారు. తెల్లవారు జాము స్వామి వెండి తొడుగును తొలగిస్తారు. అందుకే భక్తులు ఎక్కువ స్వామి నిజరూప దర్శనానికి ప్రాధాన్యతనిస్తారు. ఈ ఆలయానికి వెనుక వైతరిణీ నది ప్రవహిస్తుంది. తమ పూర్వీకులకు మోక్షం కలిగించడానికి ఇక్కడికి భక్తులు వస్తారు.
ఆలయ మార్గం..
సమీప గ్రామమైన గోపేశ్వర్ నుంచి 24 మైళ్లు క్లిష్టమైన కొండదారిలో కాలి నడకన చేరాలి. అందుకే పంచకేదారాల్లో ఇది చాలా కష్టమైంది.