మనందరం రకరకాల దేవుళ్లను, దేవతలను పూజిస్తాం. అందరూ చల్లగా ఉండాలనీ, సంతోషంగా బతకాలని కోరుకుంటాం. ఐతే... మనలో చాలా మంది తెలియక... ఇళ్లలో రకరకాల వస్తువుల్ని పూజ గదిలో పెడుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం అది చాలా ప్రమాదకరం. ఆ వస్తువుల నుంచి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. అది మొత్తం ఇంటికే సమస్యగా మారుతుంది. అందుకే పూజ గదిలో ఏం ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
పూజ గదిలో విగ్రహాలు, దేవుళ్ల పటాలను పూజ చెయ్యకుండా ఖాళీగా మాత్రం ఉంచకండి. అందరు దేవుళ్లూ ఉండాలని రకరకాల పటాలు పెట్టి... వాటికి పూజ చెయ్యకపోతే... సత్ఫలితాల కంటే నెగెటివ్ ఫలితాలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా దురదృష్టం వెంటాడుతుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఇంట్లో ఎవరో ఒకరికి కీడు జరుగుతూ... సమస్యలు పెరుగుతాయి. ఇదంతా జరగకుండా ఉండాలంటే... మీరు ఏ దైవానికి పూజ చేస్తారో... ఆ దైవాన్నే ఉంచి... ఆ దైవానికే పూజలు చేస్తే... సమస్యలు రావని చెబుతున్నారు. లేదంటే ఉన్న పటాలు, విగ్రహాలు అన్నింటికీ పూజలు చేయాలని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
చాలా మంది భక్తి కొద్దీ ఇళ్లలోని పూజ గదిలో శివలింగాన్ని ఉంచుతారు. నిజానికి శివలింగం ఉంటే... చాలా కఠిన నియమ నిష్టలు తప్పక పాఠించాలి. ఈ రోజుల్లో బిజీ లైఫ్లో అది జరగని పని. అందువల్ల శివలింగ పూజలు, రూల్స్ పాటించలేని పక్షంలో శివలింగాన్ని ఇంట్లో ఉంచకపోవడమే మేలు అంటున్నారు వాస్తు నిపుణులు. రూల్స్ అన్నీ పాటించేటట్లైతే ఉంచుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంట్లో రాధాకృష్ణుడు లేదా వినాయక స్వామి ఫొటోలు లేదా విగ్రహాలు ఉంచేటప్పుడు ఓ విషయం గుర్తుంచుకోవాలి. కృష్ణుడితో రాధ లేదా రుక్ష్మిణి... ఉండకుండా చూసుకోవాలి. అలాగే గణేశుడితో... ఆయన ఇద్దరు భార్యలూ లేకుండా చూసుకోవాలి. వాళ్లెవరైనా ఉంటే... ఆ ఇంట భార్యాభర్తల మధ్య అపార్థాలు, మనస్పర్థలు, గొడవలు, వివాదాలు, అనుమానాలు, సమస్యలూ పెరుగుతాయట. ఇవి ఎక్కడిదాకా వెళ్తాయంటే... చివరకు విడాకులు కూడా తీసుకునేందుకు సిద్ధపడతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
పూజ గదిలోనే కాదు ఇంట్లో ఎక్కడా కూడా ఎండిపోయిన పూలు, విరిగిన దీపాలు లేకుండా చూసుకోవాలి. ఇవి గనక ఉంటే... క్రమంగా ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. అంతెందుకు... ఆ ఇంటి కోటలోని తులసి మొక్క చనిపోతే... ఆ మొక్కను నీటిలో తేలేలా ఉంచాలి. లేదంటే... ఆ ఇంట్లో అశాంతి మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)