ఈ సంవత్సరం నవంబర్ 14న దీపావళి వస్తుండగా... ముందు రోజైన శుక్రవారం నవంబర్ 13 ధంతేరస్ వస్తోంది. ఇప్పటికే ఆ రోజున బంగారం కొనుక్కోవాలని చాలా మంది మనీ దాచుకుంటున్నారు. ఐతే... పండితుల ప్రకారం... ధంతేరస్ నాడు ఏది కొనుక్కున్నా... అదృష్టమేనట. అంతేకాదు... ఇంట్లో సంపద కూడా పెరుగుతుందట. మిగతా వస్తువుల కంటే ఎక్కువగా బంగారం కొనుక్కున్న వారికి ఎక్కువ అదృష్టం దక్కుతుందట. అసలు ఆ రోజు ఏమేం కొనుక్కోవచ్చో తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం... ధంతేరస్ నాడు మనం ఖర్చు పెట్టే ప్రతీదీ... తిరిగి మనకు లాభాలు తెస్తుందట. ఉదాహరణకు మీరు ఓ పనిపై ధంతేరస్ నాడు కంప్యూటర్ కొంటే... మీకు ఆ పనిలో లాభాలు వస్తాయన్నమాట. అలాగే బంగారం కొంటే... అది అదృష్ట దేవతను ఆహ్వానించినట్లే. బంగారం కొన్న తర్వాత... ఇంట్లో లక్ష్మీ దేవికి పూజ చేసి.. ఆ తర్వాత పసిడిని లాకర్లో దాచుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
మీకు తెలిసే ఉంటుంది... మన పురాణాల్లో... దేవతలు, రాక్షసులూ కలిసి... పాల సముద్రాన్ని చిలికినప్పుడు... లక్ష్మీ దేవి ఆవిర్భవించింది. ఆ రోజును ధన త్రయోదశి అంటారు... మనం దాన్నే ధంతేరస్ అంటున్నాం. అంటే ధంతేరస్ నాడు బంగారం కొన్నా... ఏది కొన్నా... మనం లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లే. లక్ష్మీదేవి అంటూ... సంపద కింద లెక్క. అందువల్లే ఆ రోజు కొనుక్కోమని సూచిస్తున్నారు.