Karthika Pournami: కార్తీక మాసంలో మూడో సోమవారం, కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, రాస పౌర్ణమి, చంద్ర గ్రహణ దినం... ఇలా నేటి సోమవారానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పురాణాల్లో నేటి రోజును ఎంతో విశిష్టమైన రోజుగా చెప్పారు. పండితులు కూడా ఇవాళ గంగలో స్నానాలు చేసినా, శివ పూజలు చేసినా ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చెబుతున్నారు.