Numerology : (పూజా జైన్ - న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890) పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. పిల్లలకు పుట్టిన తేదీలోని అంకెల ఆధారంగా ఆల్ఫాబెట్ సెలక్ట్ చేసుకుని పేరు పెడితే మేలు జరుగుతుందని తెలిపారు. ఆ ప్రభావంతో ఉన్నత స్థానాలు అందుకుంటారని, కీర్తి, ప్రతిష్టలు దక్కుతాయని వివరించారు. ఇప్పుడు ఆల్ఫాబెట్ C, Dతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఆల్ఫాబెట్స్ ప్రాముఖ్యం : భారతీయుల్లో చాలా మంది పుట్టిన బిడ్డకు లక్కీ ఆల్ఫాబెట్స్‌తో పేర్లు పెడతారు. పేరు ప్రభావం సంబంధిత వ్యక్తి జీవితం, ప్రవర్తన, విధిపై కూడా కనిపిస్తుందని నమ్ముతారు. అయితే న్యూమరాలజీ ఆధారంగా లక్కీ ఆల్ఫాబెట్స్‌ను సెలక్ట్ చేసుకుని పేరు పెడితే.. బంగారు భవిష్యత్తు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. న్యూమరాలజీ ద్వారా బిడ్డ పుట్టిన తేదీ ఆధారంగా సులువుగా లక్కీ ఆల్ఫాబెట్స్‌ను సెలక్ట్ చేసుకోవచ్చని తెలిపారు.
ఆల్ఫాబెట్ C : ఆల్ఫాబెట్ Cతో పేరు మొదలయ్యే వ్యక్తులు సులువుగా మారుతారు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. మొండితనం వీరికి దూరంగా ఉంటుంది. వారి కోరికలను నెరవేర్చుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తారు. కానీ వారి ఔదార్యం, విలువలను కొనసాగిస్తారు. Cతో పేరు మెదలయ్యే వారి ఫెర్టైల్ బ్రెయిన్ ఉంటుంది. ఇది వారికి భవిష్యత్తుపై దృష్టిని అందిస్తుంది. సంప్రదాయ ప్రక్రియ కంటే సృజనాత్మక పద్ధతిలో పనులు చేపట్టేందుకు ఇష్టపడతారు. అదే సమయంలో కళాత్మకంగా ఉండవచ్చు. మానసికంగా అప్రమత్తంగా ఉంటారు.
ఆల్ఫాబెట్ Cతో పేరు మొదలయ్యే వాళ్లను వాదనలలో ఓడించడం చాలా కష్టం. వారు పరిస్థితిని ఎలాగైనా గెలవ గలుగుతారు, దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రశాంతత, శ్రేయస్సు అందించే వరకు విజయం అంత సంతృప్తికరంగా ఉండదనే వాస్తవాన్ని నేర్చుకోవాలి. పేర్లు ఉదాహరణ: చందు, చరణ్, చరిత,.. లక్కీ కలర్స్: ఆరెంజ్, వైలెట్.. పరిహారం : ఉదయాన్నే నుదుటిపై చందనం పెట్టుకోవాలి.
ఆల్ఫాబెట్ D : ఆల్ఫాబెట్ Dతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కంట్రోల్‌గా వ్యవహరిస్తారు. ఇది వారికి అపారమైన విజయాలను అందిస్తుంది. ఎంత ఎత్తుకైనా వెళ్లగల లక్కీ ఆల్ఫాబెట్ D. ఈ వ్యక్తులు చాలా క్రియేటివ్‌గా ఉంటారు. వారి ఆలోచనలను రియాలిటీగా మార్చుకోగల సామర్థ్యం ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. అంతటా శ్రేయస్సును పొందుతారు. వారు పదాలతో చాలా పొదుపుగా ఉంటారు, కానీ చాలా విషయాలను తెలియజేయగలుగుతారు, ఇది వారిని అద్భుతమైన నాయకులు, సేల్స్‌మెన్‌గా చేస్తుంది.
ఆల్ఫాబెట్ Dతో పేరు మొదలయ్యే వాళ్లు సత్యం పట్ల స్పృహ కలిగి ఉంటారు. సత్య మార్గంలో ఉండటానికి ఇతరులను సున్నితంగా ఒప్పిస్తారు. ఇతరులను గౌరవిస్తారు, తమను కూడా అదే విధంగా చూడాలని కోరుకుంటారు. సమాజంలో అత్యున్నత స్థానాన్ని, ఆఫీస్‌లో గౌరవప్రదమైన స్థానాన్ని కలిగి ఉంటారు. D ఆల్ఫాబెట్‌తో పేరు ఉండేవారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గొప్పగా ఉంటుంది. హాస్యం ఫుల్ ఆఫ్ లైఫ్‌తో ఉంటుంది. ప్రజలను సులువుగా ఆకర్షిస్తారు. పేర్లు ఉదాహరణ ఉదా: దీపక్, దేవి, దివ్య.. లక్కీ కలర్స్: బ్లూ, గ్రే.. పరిహారం : పరిసరాలను చక్కగా, శుభ్రంగా ఉంచండి