Numerology : (పూజా జైన్ - న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890) పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. పిల్లలకు పుట్టిన తేదీలోని అంకెల ఆధారంగా ఆల్ఫాబెట్ సెలక్ట్ చేసుకుని పేరు పెడితే మేలు జరుగుతుందని తెలిపారు. ఆ ప్రభావంతో ఉన్నత స్థానాలు అందుకుంటారని, కీర్తి, ప్రతిష్టలు దక్కుతాయని వివరించారు. ఇప్పుడు ఆల్ఫాబెట్ A, Bతో పేరు మొదలయ్యే వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఆల్ఫాబెట్స్ ప్రాముఖ్యం : భారతీయుల్లో చాలా మంది పుట్టిన బిడ్డకు లక్కీ ఆల్ఫాబెట్స్‌తో పేర్లు పెడతారు. పేరు ప్రభావం సంబంధిత వ్యక్తి జీవితం, ప్రవర్తన, విధిపై కూడా కనిపిస్తుందని నమ్ముతారు. అయితే న్యూమరాలజీ ఆధారంగా లక్కీ ఆల్ఫాబెట్స్‌ను సెలక్ట్ చేసుకుని పేరు పెడితే.. బంగారు భవిష్యత్తు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. న్యూమరాలజీ ద్వారా బిడ్డ పుట్టిన తేదీ ఆధారంగా సులువుగా లక్కీ ఆల్ఫాబెట్స్‌ను సెలక్ట్ చేసుకోవచ్చని తెలిపారు.
ఆల్ఫాబెట్ Aతో పేరు మొదలయ్యే వ్యక్తులు పుట్టుకతోనే నాయకులుగా ఉంటారు. సహజమైన వ్యక్తులు, ఒక ప్రత్యేకమైన మార్గంలో ముందంజ వేయగలరు. తమ జీవితంలోని సమస్యలను పరిష్కరించడానికి సమగ్ర విధానాన్ని వర్తింపజేస్తారు, వాటిని లాజికల్‌గా అమలు చేస్తారు. ఆత్మవిశ్వాసం కలవారు, హేతుబద్ధమైన ఆలోచనాపరులు. ఆవిష్కర్తలు, ప్రారంభకులు, నాయకులు వంటి అసాధారణమైన లక్షణాలు సొంతం చేసుకుంటారు. పరిహారం : సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. అదృష్ట రంగులు పసుపు, నీలం.
ఆల్ఫాబెట్ B : పేరు Bతో ప్రారంభమయ్యే వ్యక్తి అద్భుతమైన ఆలోచనలను కలిగి ఉంటారు. ఆలోచనలు కూడా చర్యలకు అనుగుణంగా ఉంటాయి. వీరు చర్చల్లో భాగమవుతారే కానీ వాదనలకు దూరంగా ఉంటారు. ఇంట్రావెర్ట్స్గా ఉంటారు, ఎప్పుడూ తమ ఆలోచనల్లో మునిగిపోయినట్లు కనిపిస్తారు. గొప్ప ఊహా శక్తిని కలిగి ఉంటారు. గొప్ప ఊహాత్మక ప్రపంచంలో జీవిస్తారు. ఇది కొన్నిసార్లు తక్కువ ఆచరణాత్మకంగా చేస్తుంది, అయినప్పటికీ హేతుబద్ధమైన విధానంతో సంక్లిష్టతలు నుంచి బయటపడటానికి మార్గాన్ని కనుగొంటారు.
ఆల్ఫాబెట్ Bతో పేరు మొదలయ్యే వాళ్లు ఆచితూచి స్నేహితులను ఎంపిక చేసుకుంటారు, ఇతరులను అంత సులువుగా నమ్మరు. వీరికి తమపైనే ఆసక్తి ఉంటుంది. స్వీయ జ్ఞానాన్ని పెంచుకుంటారు. దీనివల్ల వీరిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి జీవితం ఎదగకుండా వ్యతిరేక దిశలో తీసుకెళ్తుంది. పరిహారం : శివుడికి పాలతో అభిషేకం చేయాలి. చంద్ర గ్రహం మంత్రాన్ని జపించాలి. లక్కీ కలర్ స్కై బ్లూ.