Numerology : (పూజా జైన్ - న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890) పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం జనవరి 13వ తేదీ శుక్రవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి.
నంబర్ 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 1 వస్తుంది. పసుపు రంగు దుస్తులు ధరించండి. మీ ఆఫీస్‌లోని ఉత్తరభాగంలో పసుపు వస్తువులు, పువ్వులను ఉంచండి. మీ అదృష్టానికి అనుకూలంగా మూవ్మెంట్ ఉంటుంది. మెషీన్లు కొనడానికి కానీ ఇతర ఆస్తులను విక్రయించడానికి కానీ అనుకూల సమయం. క్రీడాకారులు సెలక్షన్, విజయాల కోసం వేచి ఉండాలి. టూల్స్, మెషీన్లు, ట్రావెల్ ఏజెన్సీలు, ఫర్నిచర్, పుస్తకాలు, మందులు, గ్లామర్, వస్త్రాల వ్యాపారం సాఫీగా రాబడిని పొందుతుంది. రాజకీయ నాయకులు, పైలట్లు ఉత్తమ ఫలితాలతో నాయకత్వాన్ని సంపాదిస్తారు. పిల్లలు టైమ్ టేబుల్‌ను జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మాస్టర్ కలర్ : ఎల్లో, ఆరెంజ్, లక్కీ డే : ఆదివారం, లక్కీ నంబర్ : 1, దానాలు : యాచకులకు కుంకుమ పువ్వు మిఠాయిలు దానం చేయాలి.
నంబర్ 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్ 2 ప్రభావం ఉంటుంది. సొంత అవసరాల గురించి మరింత ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. మీ ఎంపిక కాకపోయినా.. మీరు లాభాన్ని తిరిగి పొందే ప్రాంతాలను కనుగొనాలని గుర్తించుకోండి. ఇతరులు మీ భావాలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తారు. న్యాయవాదులు, వైద్యులు ప్రమోషన్ పొందుతారు. స్త్రీలు, భాగస్వాముల కచ్చితమైన స్వభావాన్ని విస్మరించాలి. ప్రభుత్వ ఒప్పందాలను ఛేదించడానికి మీ గత సంబంధాలను ఉపయోగించుకునే రోజు ఇది. ఎగుమతి దిగుమతి వ్యాపారులు, రాజకీయ నాయకులు కొత్త అవకాశాలను అందుకుంటారు. మాస్టర్ కలర్ : స్కై బ్లూ, లక్కీ డే: సోమవారం, లక్కీ నంబర్: 6, దానాలు : ఆలయంలో వైట్ స్వీట్స్ దానం చేయాలి.
నంబర్ 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 3 పని చేస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మీ అంతర్ దృష్టి ఈ రోజు ప్రత్యేకంగా పనిచేస్తుంది. మీ నటనా ప్రతిభను ప్రదర్శించడానికి ఉత్తమ రోజు. ఆఫీస్‌లో రిక్రూట్మెంట్ మీకు స్వాగతం పలుకుతుంది. ప్రజాప్రతినిధులు ప్రసంగం ద్వారా మెప్పించగలరు. ఈరోజు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రత్యేకంగా సంగీతకారులు లేదా రచయితలకు అనుకూలంగా మారతాయి. ఈ రోజు పెట్టిన పెట్టుబడులకు అధిక రాబడి ఉంటుంది. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను విశాల హృదయంతో పంచుకోవాలి. ప్రభుత్వ అధికారులు పరిసరాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ రోజు ప్రారంభించే ముందు గురువు నామాన్ని జపించడం, నుదిటిపై చందనాన్ని పెట్టుకోవడం మర్చిపోవద్దు. మాస్టర్ కలర్ : ఆరెంజ్, బ్రౌన్, లక్కీ డే : గురువారం, లక్కీ నంబర్ : 3, 1, దానాలు : పనిచేసే మహిళకు తులసి మొక్క అందజేయాలి.
నంబర్ 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్ 4 ప్రభావం ఉంటుంది. మీ ఆహారంలో ఆకుపచ్చ రంగులోని పుల్లని పదార్థాలను చేర్చుకోండి. ఈ రోజు మీ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒకే దిశలో దృష్టి కేంద్రీకరించడం వల్ల ఉత్తమ ఫలితం అందుకుంటారు. తయారీదారులు, రైతులు ఆస్తిని కొనుగోలు చేసే నిర్ణయాన్ని కలిగి ఉండాలి. ముఖ్యంగా రాజకీయాలు, ఎంటర్ట్రైన్మెంట్ రంగాల వారు ప్రయాణాలు చేపట్టేందుకు అనుకూల సమయం. వైద్యం, సాఫ్ట్వేర్, హస్తకళలు, మెటల్ రంగాలలో అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. మార్కెటింగ్ యువకులు వారి నెలాఖరు లక్ష్యాలను చేధించే అవకాశం ఉంది. శాఖాహారం తీసుకోండి, ధ్యానం చేయండి. మాస్టర్ కలర్ : బ్లూ, లక్కీ డే: శనివారం, లక్కీ నంబర్: 9, దానాలు : ఇంట్లో పనిచేసే వారికి చీపురు అందజేయాలి.
నంబర్ 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 5 పనిచేస్తుంది. అపజయాన్ని నివారించడానికి మీరు ఈరోజు మీ ప్రసంగం, చర్యలను బ్యాలెన్స్ చేసుకోవాలి. వ్యక్తిగత జీవితం రొమాన్స్, కమిట్మెంట్స్తో వికసిస్తుంది. ఈ రోజు గతంలో చేసిన పనులకు సంబంధించి గుర్తింపు, ప్రయోజనాలను పొందుతారు. సేల్స్, ముఖ్యంగా క్రీడలలో ఉన్నవారికి ఫాస్ట్ మూమెంట్ అనుకూలంగా ఉంటుంది. అకడెమిక్స్‌లో విద్యార్థుల పనితీరు బావుంటుంది. మాస్టర్ కలర్: సీ గ్రీన్, లక్కీ డే : బుధవారం, లక్కీ నంబర్ : 5, దానాలు : పేదవారికి పెరుగు దానం చేయాలి.
నంబర్ 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్ 6 ప్రభావం కనిపిస్తుంది. ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకుండా, తప్పుగా గైడ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి మీ వివేకాన్ని ఉపయోగించండి, ఈ రోజు ఇతరులు అందిస్తున్న వాటిని విస్మరించడం నేర్చుకోండి. పిల్లలతో గడపడానికి మంచి రోజు. వీసా కోసం వేచి ఉంటే, ఇంకొంత కాలం నిరీక్షణ తప్పదు. కొత్త ఇల్లు లేదా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు మంచి ఆప్షన్ సెలక్ట్ చేసుకుంటారు. యాక్టర్లు, మీడియా యువకులు విజయాన్ని ఆస్వాదిస్తారు. రెండో భాగంలో మీరు మరింత రిలాక్స్‌గా, సంతృప్తిగా ఉంటారు. ఎందుకంటే అప్పటికి జీవితం పట్ల మీకున్న సందేహాలన్నీ తీరిపోతాయి. మాస్టర్ కలర్ : టేల్, లక్కీ డే : శుక్రవారం, లక్కీ నంబర్ : 6, దానాలు : మహిళకు కాస్మొటిక్స్ దానం చేయాలి.
నంబర్ 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్ ప్రభావం ఉంటుంది. యువ రాజకీయ నాయకులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, డిఫెన్స్, లాయర్లు, శాస్త్రవేత్తలు, రైతులు, పంపిణీదారులు, CAలు కెరీర్లో దూసుకుపోతారు. క్రీడలు, విద్యారంగంలో మీ పెద్దల ఆశీర్వాదంతో విజయాలు సాధ్యమవుతాయి. రిలేషన్ వికసిస్తుంది. ఆపోజిట్ జెండర్‌కు చెందిన వ్యక్తులు ఈ రోజు మీ అదృష్టాన్ని పెంచుతారు. గురుమంత్రాన్ని తప్పక చదివి పఠించాలి. ఈరోజు అన్ని అంశాలలో నెగ్గాలంటే మృదువుగా మాట్లాడటం కీలకం. రాజకీయ నాయకులకు బహిరంగ సభలకు హాజరయ్యేందుకు, పార్టీ సీనియర్లను ఆకట్టుకోవడానికి ఒక అందమైన రోజు. మహిళలు స్టాక్ మార్కెట్లో అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. మాస్టర్ కలర్ : ఆరెంజ్, లక్కీ డే : సోమవారం, లక్కీ నంబర్: 7, దానాలు : ఆలయంలో పచ్చి పసుసు దానం చేయాలి.
నంబర్ 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్ ప్రభావం కనిపిస్తుంది. వ్యాపార ఒప్పందాలలో జాప్యం సాధ్యమే కానీ త్వరలో లాభం కచ్చితంగా పొందుతారు. మీరు గతంలో చేసిన పనులే ఇప్పుడు గుడ్‌విల్‌ను పొందడంలో సహాయపడుతున్నాయి. విస్తృత సోషల్ నెట్వర్క్ సహాయంతో, రోజు చివరి నాటికి మీరు విజయం అందుకుంటారు. మీరు ఉన్నత స్థాయి జ్ఞానాన్ని పొందేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తారు. సెమినార్లు నిర్వహించేటప్పుడు వైద్యులు ప్రశంసలు అందుకుంటారు. సాయంత్రం నాటికి ప్రజాప్రతినిధులకు మరింత పాపులారిటీ లభిస్తుంది. మాస్టర్ కలర్ : సీ బ్లూ, లక్కీ డే : శుక్రవారం, లక్కీ నంబర్ : 6, దానాలు : యాచకులకు ఎర్రని పండ్లు దానం చేయాలి.
నంబర్ 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్యులు, శాస్త్రవేత్తలు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, క్రికెట్ క్రీడాకారులు, క్రీడాకారులు, స్వర్ణకారులు, విద్యావేత్తలు, యాక్టర్లు, సింగర్లు, డ్యాన్సర్లు, పెయింటర్లు, రైటర్లు, ప్రాపర్టీ డీలర్లు, వైద్యులు ప్రత్యేక గుర్తింపు లేదా అప్రైజల్ పొందుతారు. ప్రేమలో ఉన్న వ్యక్తులు మధ్యవర్తులు, వారి ఉద్దేశాలను జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజు ప్రశంసలు, అభివృద్ధితో నిండి ఉంటుంది. అలాగే ఆకస్మిక డబ్బు కూడా ఎదురుచూస్తుంది. పదోన్నతుల కోసం, ఇంటర్వ్యూలు లేదా ఆడిషన్లు, ప్రభుత్వ ఉత్తర్వుల కోసం అప్లై చేయడానికి ఒక అందమైన రోజు. నటులు, CA, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, హోటల్ వ్యాపారులు భారీ అదృష్టాన్ని ఆస్వాదిస్తారు. మాస్టర్ కలర్ : రెడ్, ఆరెంజ్, లక్కీ డే : మంగళవారం, లక్కీ నంబర్ : 3, 9, దానాలు : పేదవారికి వస్త్రాలు దానం చేయాలి.