Numerology : (పూజా జైన్ - న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890) పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం జనవరి 17వ తేదీ మంగళవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి.
నంబర్ 1 : : (నెలలో 1, 10, 19, 28వ తేదీలలో జన్మించినవారు) మీకు చాలా సమస్యలు పెద్దగా మారుతున్నాయి. కానీ ఈ వారంలో దాదాపు అన్నీ ముగుస్తాయి. కొత్త స్థలం, స్థానం, స్నేహితుడు లేదా వ్యాపారంలో కొత్త పెట్టుబడి, కొత్త ఉద్యోగం, కొత్త ఇల్లు ఏదైనా కొత్త విషయం కోసం ప్లాన్ చేస్తే.. వాటిపై రాజీపడాల్సి ఉంటుంది. చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మెడికల్ ప్రాక్టీషనర్లకు ఈరోజు స్పెషల్ ఆఫర్ ఉంది. వ్యవసాయం, విద్యా రంగం లాభసాటిగా కనిపిస్తోంది. మాస్టర్ కలర్: బ్లూ, లక్కీ డే: శుక్రవారం, లక్కీ నంబర్: 6, విరాళాలు: ఆశ్రమాలకు ఆహారం దానం చేయండి.
నంబర్ 2 : (నెలలో 2, 11, 20, 29వ తేదీలలో జన్మించినవారు) రెండు గడుల వెదురు మొక్కను వర్కింగ్ టేబుల్‌పై పెట్టుకోండి. ఈరోజు తెరిచిన పుస్తకంలా ప్రవర్తించకూడదని గుర్తుంచుకోండి. ప్రజలు మీ అమాయకత్వాన్ని, సహాయం చేసే వైఖరిని ఉపయోగించుకుంటారు. కొన్నింటికి మీరు ‘వద్దు’ అని చెప్పడం నేర్చుకోవాలి. ప్రజలు మీ అమాయకత్వాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ విషయంలో తెలివిగా ఆలోచించాలి. ఎగుమతి దిగుమతి, వైద్యులు, ఇంజనీర్లు, బ్రోకర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, భాగస్వామ్య సంస్థలు సక్సెస్ అందుకుంటాయి. భాగస్వామి లేదా తోటివారి ద్వారా మానసికంగా బాధపడతారు లేదా బాధపెడతారు. మాస్టర్ కలర్: బ్లూ, అదృష్ట రోజు: సోమవారం, లక్కీ నంబర్: 2, విరాళాలు: ఆశ్రమాలకు చక్కెర దానం చేయండి.
నంబర్ 3 : (నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వ్యక్తులు) ఇంటి దక్షిణ గోడకు ఎరుపు రంగు బల్బు పెట్టండి. మీ సహోద్యోగుల ఉద్దేశాలను అంచనా వేయడానికి ఈ రోజు పని విషయంలో నిర్ణయాత్మకంగా, జడ్జిమెంటల్‌గా ఉండండి. మీ సృజనాత్మక ఆలోచనలు, మ్యాజికల్ స్పీచ్.. మీ యజమానిని, ఇంట్లో కుటుంబాన్ని ఆకర్షిస్తాయి. డబ్బు విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. క్రియేటివ్ పీపుల్, పబ్లిక్ ఫిగర్స్ కీర్తిని పొందుతారు. స్పోర్ట్స్ కోచ్‌లు విజయాలతో పాటు డబ్బు బహుమతిని అందుకుంటారు. నిర్మాణం, వ్యవసాయంలో పెట్టుబడికి మంచి సమయం. ఈరోజు ఉదయం నుదుటిపై చందనం పెట్టుకోండి. మాస్టర్ కలర్: ఆరెంజ్, బ్లూ,... లక్కీ డే: గురువారం... లక్కీ నంబర్: 3, 9... విరాళాలు: పేదలకు సన్‌ఫ్లవర్ ఆయిల్ దానం చేయండి.
నంబర్ 4 : (నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించినవారు) వ్యాపారంలో ప్రణాళికలు, వ్యూహాలు ఈరోజు వృద్ధికి మార్గదర్శకంగా ఉంటాయి. ప్రభుత్వ , రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఈ రోజు లక్ష్యం కోసం నిరంతరం పని చేయాలి. వీరు రోజులో సగం తర్వాత వారు మంచి ప్రతిఫలాలను పొందుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు మరింత ఉన్నతంగా ఎదగాలి. విద్యార్థులకు ఆసక్తి ఉంటే, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆకుకూరలు దానం చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది. క్రీడాకారులకు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. మీరు కుటుంబం, స్నేహితునితో సమయం గడపలేనంత బిజీగా ఉంటారు, కాబట్టి నిశ్శబ్దంగా వారి ఫిర్యాదులను వినండి. మాస్టర్ కలర్: బ్లూ, గ్రే,.. లక్కీ డే: శుక్రవారం.. లక్కీ నంబర్: 6... విరాళాలు: జంతువులకు ఉప్పగా ఉండే ఆహారాన్ని దానం చేయండి.
నంబర్ 5 : (నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టినవారు) రాజకీయాల్లో ఉన్నవారు విజయం, సంతృప్తిని సాధించడానికి షార్ట్‌కట్స్‌కు దూరంగా ఉండాలి. ఈ రోజు నిజాయితీగా పని చేయాలి. మీ ఫీలింగ్స్‌ను పార్ట్నర్కు వ్యక్తపరచడానికి అనువైన రోజు. యంత్రాలు కొనడానికి, ఆస్తిని అమ్మడానికి, అధికారిక పత్రాలపై సంతకం చేయడానికి, పర్యటనకు వెళ్లడానికి ఇది మంచి రోజు. న్యూస్ యాంకర్స్, యాక్టర్స్, హ్యాండిక్రాఫ్ట్ ఆర్టిస్ట్స్, ఇంజనీర్లు అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటారు. శత్రువుల ద్వారా మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది కాబట్టి, మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూసే వారికి దూరంగా ఉండండి. మీ లీడర్షిప్ స్కిల్స్.. మీ చుట్టుపక్కల చాలా మందికి ప్రయోజనం చేకూరుస్తాయి. కాబట్టి స్పోర్ట్స్ కోచ్‌లు కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మాస్టర్ కలర్: టీల్... లక్కీ డే: బుధవారం... లక్కీ నంబర్: 5... విరాళాలు: ఆశ్రమాలకు ఉప్పు దానం చేయండి
నంబర్ 6 : (నెలలోని 6, 15, 24వ తేదీలలో పుట్టినవారు) సేల్స్, ఫుడ్, మార్కెటింగ్, ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్, డిఫెన్స్, ఎయిర్‌లైన్స్, జ్యువెలరీ, కాస్మొటిక్స్, హోమ్ డెకర్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు సంతోషకరమైన ఫలితాలు ఉంటాయి. సమయం మీకు మద్దతుగా ఉంటుంది. ఈ రోజు మీ కలలను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు మీరు అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ ఆప్యాయత, మద్దతుతో సంతృప్తి చెందుతారు. రోజంతా విలాసవంతంగా గడుపుతారు. డిజైనర్లు, లాయర్లు, టెక్కీలు,. రాజకీయ నాయకులు, నటులు స్పెషల్ అప్రైజల్, స్టెబిలిటీని ఆస్వాదిస్తారు. మాస్టర్ కలర్: స్కై బ్లూ... లక్కీ డే: శుక్రవారం... లక్కీ నంబర్: 6, 9... విరాళాలు: పేదలకు పెరుగు దానం చేయండి.
నంబర్ 7 : (నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించినవారు) కేతు పూజ చేయండి. గుండ్రని రాగి నాణెం పర్స్‌లో ఉంచుకోండి. ఈరోజు పాత ఆస్తితో ఆర్థికంగా ఎదగడానికి మార్గాలు ఉన్నాయి. త్వరలో రిలేషన్స్, పనితీరు, ఆర్థిక వృద్ధిని ఆస్వాదించే సమయం వస్తుంది. ఈరోజు వ్యాపారంలో బంధువులు, స్నేహితుల పట్ల జాగ్రత్త వహించండి. క్రీడాకారులు వివాదాలకు పోవద్దు అనుకుంటే, పోటీదారుల నుంచి దూరంగా ఉండండి. భగవంతుని ఆశీర్వాదం పొందడానికి శివ, కేతు పూజలు చేయాలి. మాస్టర్ కలర్: పసుపు.. అదృష్ట రోజు: సోమవారం.. లక్కీ నంబర్: 7.. విరాళాలు: అనాథ శరణాలయాలకు దుస్తులు విరాళంగా ఇవ్వండి.
నంబర్ 8 : (నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులు) ఈరోజు దూకుడు తగ్గించుకోవాలి. సెల్ఫ్ డ్రైవ్ చేయకండి. మీ మనసును రిలాక్స్ చేయండి, అంతా బాగానే ఉంటుంది కాబట్టి అతిగా ఆలోచించడం మానేయండి. చుట్టూ ఉన్న ప్రజలందరూ మీకు నమ్మకమైన అనుచరులు, కాబట్టి నాయకత్వాన్ని ఆస్వాదించే సమయం ఇది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఛారిటీ ఈరోజు మ్యాజికల్ రోల్ పోషిస్తుంది. ఈరోజు పెరట్లో, గార్డెన్లో కొంత సమయం గడపండి. ఈరోజు వీలైనంత ఎక్కువ మంది పబ్లిక్ ఈవెంట్లకు హాజరై మైక్ పట్టుకొని మాట్లాడాలి. మాస్టర్ కలర్: ఊదా.. లక్కీ డే: శుక్రవారం.. లక్కీ నంబర్: 6.. విరాళాలు: పేదలకు ఉప్పు ఉండే ఆహారాన్ని దానం చేయండి.
నంబర్ 9 : (నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారు) మహిళలు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. చాటింగ్, రీడింగ్, ప్లానింగ్, హీలింగ్ ఆర్ట్, వ్యాయామం చేయడం, ఇంటిపని చేయడం, ఇంటి బాధ్యతలను నెరవేర్చడం, పార్టీని నిర్వహించడం, సామాజిక సేవ చేయడం, స్టాక్స్‌లో వ్యాపారం చేయడం వంటివాటిలో రోజు ఎక్కువగా గడుపుతారు. డెర్మటాలజిస్ట్‌లు, ఆడిటర్లు, సైంటిస్ట్‌లు, సర్జన్, రాజకీయ నాయకులు, క్రీడాకారులు ఈరోజు రివార్డ్‌లు, గుర్తింపును పొందుతారు. ఈ రోజు వినోదం, శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీ లక్ష్యం వైపు వెళ్లడానికి వీటిని ఉపయోగించండి. ఆర్థిక ప్రణాళిక, ఆస్తి రిజిస్ట్రేషన్లు ఈరోజు జరిగే అవకాశం ఉంది. మాస్టర్ కలర్: రెడ్, బ్లూ... లక్కీ డే: మంగళవారం... లక్కీ నంబర్: 9... విరాళాలు: గుడికి పచ్చి పసుపు దానం చేయండి.