# నంబర్ 1 (నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారు)సమస్యలు మరింత క్లిష్టంగా రూపుదిద్దుకుంటున్నాయి, కానీ ముగింపు దిశగా సాగుతున్నాయి. కొత్త స్థలం, స్థానం, స్నేహితుడు లేదా వ్యాపారంలో కొత్త పెట్టుబడి, కొత్త ఉద్యోగం, కొత్త ఇల్లు వంటి కొత్త విషయాల కోసం ప్రణాళిక వేస్తుంటే.. వీటి విషయంలో రాజీలు ఉంటాయి, చట్టపరమైన విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మెడికల్ ప్రాక్టీషనర్లకు ఈరోజు కొత్త ఆఫర్ ఉంది. వ్యవసాయం, విద్యా రంగం లాభసాటిగా కనిపిస్తోంది. మాస్టర్ కలర్: లేత గోధుమరంగు,లక్కీ డే: శుక్రవారం,లక్కీ నంబర్: 6,విరాళాలు: దయచేసి ఆశ్రమంలో ఆహారాన్ని దానం చేయండి.
# నంబర్ 2 (నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారు)వర్కింగ్ టేబుల్‌పై టూ స్టెప్ వెదురు మొక్కను ఉంచండి. ఈరోజు తెరిచిన పుస్తకంలా ప్రవర్తించకూడదని గుర్తుంచుకోండి. ప్రజలు మీ అమాయకత్వాన్ని, సహాయ వైఖరిని ఉపయోగించుకుంటారు. మీరు ఎప్పుడైనా వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి. ప్రజలు మీ అమాయకత్వాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి తెలివిగా వ్యవహరించాలి. ఎగుమతి దిగుమతి, వైద్యులు, ఇంజనీర్లు, బ్రోకర్లు, ట్రావెల్ ఏజెన్సీలు మరియు భాగస్వామ్య సంస్థలు విజయాన్ని అందుకుంటారు. భాగస్వామి లేదా తోటివారి ద్వారా మానసికంగా బాధపడతారు లేదా బాధపెడతారు. మాస్టర్ కలర్: బ్లూ,లక్కీ డే: సోమవారం,లక్కీ నంబర్: 2,విరాళాలు: దయచేసి ఆశ్రమాలకు చక్కెర దానం చేయండి.
# నంబర్ 3 (నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వ్యక్తులు)
ఈరోజు ప్రేమ సంబంధాల విషయానికి వస్తే, జ్ఞానం దాని పాత్రను పోషిస్తుంది. ఇంటి దక్షిణ గోడకు ఎరుపు రంగు బల్బును ఉంచండి. మీ సహోద్యోగుల ఉద్దేశాలను అంచనా వేయడానికి ఈ రోజు పనిలో నిర్ణయాత్మకంగా ఉండండి. సృజనాత్మక ఆలోచనలు, మాయా ప్రసంగం మీ యజమానిని, ఇంట్లో కుటుంబాన్ని ఆకర్షిస్తుంది. మనీ మేనేజ్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్పోర్ట్స్ కోచ్‌లు విజయం, డబ్బు బహుమతి అందుకుంటారు. నిర్మాణం, వ్యవసాయంలో పెట్టుబడికి మంచి సమయం. ఉదయం చందనాన్ని నుదుటిపై ధరించండి. మాస్టర్ కలర్: నారింజ, ఆకుపచ్చ,లక్కీ డే: గురువారం,లక్కీ నంబర్: 3, 9,విరాళాలు: గుడికి పొద్దుతిరుగుడు విత్తనాలను దానం చేయండి.
# నంబర్ 4 (నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించినవారు) ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు ఉప్పు వేసుకోండి. వ్యాపారంలో ప్రణాళిక, వ్యూహాలు.. ఈరోజు వృద్ధికి మార్గదర్శకంగా ఉంటాయి. ప్రభుత్వ , రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఈ రోజు లక్ష్యం కోసం నిరంతరం పని చేయాలి, ఎందుకంటే రోజులో సగం తర్వాత వారు మంచి ప్రతిఫలాలను పొందుతారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు మరింత ఉన్నతంగా ఎదగాలి. ఆకుకూరల దానం అదృష్టాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. క్రీడాకారులకు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి, పనితీరుకు కూడా ప్రశంసలు అందుకుంటారు. మీరు కుటుంబం, స్నేహితునితో సమయం గడపుతూ చాలా బిజీగా ఉంటారు, కాబట్టి వారు చెప్పేది వినండి. మాస్టర్ కలర్: బ్లూ, గ్రే,లక్కీ డే: శుక్రవారం,లక్కీ నంబర్: 6,విరాళాలు: జంతువులకు ఆకుపచ్చ, ఉప్పగా ఉండే ఆహారాన్ని దానం చేయండి.
# నంబర్ 5 (నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టినవారు)
త్వరితగతిన డబ్బు సంపాదించాలనే ఆలోచనలకు దూరంగా ఉండండి. రాజకీయాల్లో పని చేస్తే.. విజయం, సంతృప్తిని సాధించడానికి ఈ రోజు నిజాయితీగా పని చేయండి. మీ ఫీలింగ్స్‌ను పార్ట్నర్స్కు ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఇది అనువైన రోజు. యంత్రాలు కొనుగోలు చేయడానికి, ఆస్తిని విక్రయించడానికి, అధికారిక డాక్యుమెంట్స్‌పై సంతకం చేయడానికి అలాగే పర్యటనకు వెళ్లడానికి నేడు గొప్ప రోజు. న్యూస్ యాంకర్స్, యాక్టర్స్, హస్తకళా కళాకారుడు, ఇంజనీర్లు ప్రశంసలు అందుకుంటారు. మిమ్ములను శత్రువుల ద్వారా ట్రాప్ చేసే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ లీడర్షిప్ క్వాలిటీస్.. చుట్టుపక్కల చాలా మందికి ప్రయోజనం చేకూరుస్తాయి. స్పోర్ట్స్ కోచ్‌లు కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మాస్టర్ కలర్: టీల్,లక్కీ డే: బుధవారం,లక్కీ నంబర్: 5,విరాళాలు: బుధవారం గణేశుడికి పచ్చి గడ్డి (దూర్వా) సమర్పించండి.
# నంబర్ 6 (నెలలోని 6, 15, 24వ తేదీలలో పుట్టిన వ్యక్తులు)
మెడిసిన్, ఆహారం, మార్కెటింగ్, ట్రేడింగ్, పంపిణీ, రక్షణ, విమానయాన సంస్థలు, ఆభరణాలు, సౌందర్య సాధనాలు, గృహాలంకరణ రంగంలో ఉంటే.. ఇది మీకు మంచి ఫలితాలను అందించే రోజు. ఈ రోజు మీ కలలను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు మీ చర్యలను మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీరు అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ ఆప్యాయత మీకు మద్దతు శ్రేయస్సును తెస్తుంది. విలాసవంతంగా గడుపుతారు. డిజైనర్లు, లాయర్లు, టెక్కీలు, రాజకీయ నాయకులు, నటులు స్థిరత్వాన్ని, అప్రైజల్ను ఆస్వాదించే మంచి రోజు. మాస్టర్ కలర్: స్కై బ్లూ,లక్కీ డే: శుక్రవారం,లక్కీ నంబర్: 6, 9,విరాళాలు: పేదలకు పెరుగు దానం చేయండి.
# నంబర్ 7 (నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వ్యక్తులు)
రోజు ప్రారంభంలో కేతు పూజ చేసి గురు మంత్రాన్ని జపించండి. మీ బ్యాగ్‌లో ఎల్లప్పుడూ గుండ్రని రాగి నాణెం ఉంచుకోండి. ఈ రోజు పాత ఆస్తితో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మార్గాలు ఉన్నాయి. త్వరలో సంబంధాలు, పనితీరు, ఆర్థిక వృద్ధిని ఆస్వాదించే సమయం వస్తుంది. ఈరోజు వ్యాపారంలో బంధువులు, స్నేహితుల పట్ల జాగ్రత్త వహించండి. క్రీడాకారులు వివాదాలను నివారించడానికి పోటీదారుల నుంచి దూరంగా ఉండండి. భగవంతుని ఆశీర్వాదం కోసం శివుడు, కేతు పూజలు చేయాలి. మాస్టర్ కలర్: పసుపు,లక్కీ డే: సోమవారం,లక్కీ నంబర్: 7,విరాళాలు: అనాథ శరణాలయాలకు దుస్తులు విరాళంగా ఇవ్వండి.
# నంబర్ 8 (నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించినవారు)
ఈరోజు ట్రావెలింగ్కు దూరంగా ఉండండి, సొంత డ్రైవ్ చేసుకోండి. మీ మనసును రిలాక్స్ చేసుకోండి. అంతా బాగానే ఉంటుంది కాబట్టి అతిగా ఆలోచించడం మానేయండి. చుట్టూ ఉన్న ప్రజలందరూ మీకు నమ్మకమైన అనుచరులుగా ఉంటారు, కాబట్టి నాయకత్వాన్ని ఆస్వాదించే సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఛారిటీ మంచి పాత్ర పోషిస్తుంది. గ్రీన్ గార్డెన్ చుట్టూ కొంత సమయం గడపండి. ఈరోజు వీలైనంత ఎక్కువ మంది పబ్లిక్ ఈవెంట్లకు హాజరై మైక్ పట్టుకోవాలి. మాస్టర్ కలర్: ఊదా,లక్కీ డే: శుక్రవారం,లక్కీ నంబర్: 6,విరాళాలు: పేదలకు ఉప్పు కలిపిన ఆహారాన్ని దానం చేయండి.
# నంబర్ 9 (నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వ్యక్తులు)
ఫుడ్ ఇండస్ట్రీలో పనిచేసే స్త్రీలు ఈరోజు కొత్త మార్గాలు, అవకాశాలను ఉపయోగించుకోవాలి. ఈ రోజు చాటింగ్ చేయడం, చదవడం, ప్లాన్ చేయడం, కళను సాకారం చేయడం, వ్యాయామం చేయడం, ఇంటి పని చేయడం, ఇంటి బాధ్యతలను నెరవేర్చడం, పార్టీని నిర్వహించడం, సోషల్ వర్క్ చేయడం, స్టాక్స్‌లో వ్యాపారం చేయడం వంటివాటిలో ఎక్కువ సమయం గడుపుతారు. డెర్మటాలజిస్టులు, ఆడిటర్లు, సైంటిస్ట్‌లు సర్జన్, రాజకీయ నాయకులు, క్రీడాకారులు రివార్డులు, గుర్తింపును పొందుతారు. ఈ రోజు వినోదం, శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీ లక్ష్యం వైపు ఒక దిశలో వెళ్లడానికి వీటిని ఉపయోగించండి. ఆర్థిక ప్రణాళిక, ఆస్తి రిజిస్ట్రేషన్లు ఈరోజు జరిగే అవకాశం ఉంది. మాస్టర్ కలర్: బ్రౌన్,లక్కీ డే: మంగళవారం,లక్కీ నంబర్: 9,విరాళాలు: గుడికి పచ్చి పసుపును దానం చేయండి.