నంబర్ 1 (1, 20, 19, 28 తేదీల్లో జన్మించిన వ్యక్తులు) : సేల్స్, పాలిటిక్స్‌లో విజయం సాధించడానికి మీకు మంచి ఆఫర్ వస్తుంది. ఈ విషయంలో మీ జ్ఞానం ఇంటర్వ్యూయర్‌ను ఆకట్టుకుంటుంది కాబట్టి ఈరోజు ప్రయత్నాలు చేయాలి. మీతో రిలేషన్షిప్లో ఉన్నవారు మీ పట్ల గొప్ప గౌరవాన్ని కలిగి ఉంటారు. ఇది మీ వ్యక్తిత్వంలోని రాజకీయ భాగాన్ని ప్రదర్శించే రోజు. కుటుంబ కార్యక్రమాలను ఆస్వాదించడం, సంగీత కచేరీలకు హాజరుకావడం, ఈవెంట్లు ఏర్పాటు చేయడం లేదా ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడం వంటి పనుల ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలుకు దూరంగా ఉండాలి.స్టేషనరీ, స్కూల్, రెస్టారెంట్లు, కౌన్సెలింగ్ పుస్తకాలు, డిజిటల్ మార్కెటింగ్, మెటల్స్, క్రియేటివ్ క్లాసులు, స్పోర్ట్స్ అకాడమీల వ్యాపారం అధిక లాభం పొందుతుంది. పిల్లలకు చదువుల భారం ఉంటుంది. మాస్టర్ కలర్స్: పసుపు, నారింజ,లక్కీ డే: గురువారం,లక్కీ నంబర్: 3
విరాళాలు: గుడికి చందనాన్ని దానం చేయండి.
నంబర్ 2 (2, 11, 20, 29వ తేదీలలో జన్మించినవారు) : మీ శ్రేయోభిలాషులు కాని వారు చేసే విమర్శలను వదిలేయండి. అందరితో సున్నితంగా ఉండే రిసీవింగ్ నేచర్‌ను మానుకోండి, ఎందుకంటే మీ మృదువైన స్వభావం మిమ్మల్ని బాధపెడుతుంది. మీరు చాలా బాధ్యతలను మోస్తున్నట్లు భావిస్తారు కాబట్టి ఇకపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. లవ్ రిలేషన్లో పార్ట్నర్ ఆధిపత్యం, నియంత్రణలో ఉన్నట్లు భావిస్తారు. ఆడవారు ఈరోజు తెల్లటి భోజనం వండాలి. బాధ్యతల కోసం డబ్బును ఉపయోగించాల్సిన రోజు ఇది. విద్యార్థులు, తయారీదారులు, రిటైలర్లు, బ్రోకర్లు, క్రీడాకారులు పనితీరులో అధిక రేటింగ్ కోసం ఒక రోజు వేచి ఉండాలి. మాస్టర్ కలర్: ఆక్వా,లక్కీ డే: సోమవారం,లక్కీ నంబర్: 2,దానాలు: అనాథాశ్రమాలకు పాలు దానం చేయాలి.
నంబర్ 3 (3, 12, 22, 30వ తేదీలలో జన్మించినవారు) : మీ సృజనాత్మకత, ఊహాత్మక శైలి.. రచయితలు, మ్యుజిషియన్స్కు అందమైన రోజుగా మారుతుంది. మీ ప్రసంగానికి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఈరోజు తీసుకునే అన్ని నిర్ణయాలూ సమీప భవిష్యత్తుకు అనుకూలంగా మారతాయి. కానీ ప్రస్తుత ఆర్థిక ప్రణాళికలను ఇతరులతో పంచుకోవడం మానేయండి. స్టాక్స్, ఇతర పెట్టుబడుల నుంచి ఈరోజు రాబడులు నెమ్మదిగా అందుతాయి. ప్రేమలో ఉన్నవారు ఆశీర్వాదం పొందుతారు. వీరు ఫీలింగ్స్‌ను మాటల ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ప్రభుత్వ అధికారులు కొత్తవారితో జాగ్రత్తగా ఉండాలి. మాస్టర్ కలర్: ఆరెంజ్,లక్కీ డే: గురువారం,లక్కీ నంబర్: 3, 1,విరాళాలు: ఆశ్రమాలకు పుస్తకాలు దానం చేయండి.
నంబర్ 4 (4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారు) : మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రోజు ఒత్తిడిని వదిలించుకోవడానికి ధ్యానం చేయాలి. డబ్బు వస్తుంది కానీ చాలా బాధ్యతలు, ఖర్చులు కూడా తప్పవు. నిర్మాణ వ్యాపారం, వైద్య రంగంలో మంచి మూవ్మెంట్ ఉంటుంది. అయితే స్టాక్ పెట్టుబడి నెమ్మదిగా పాజిటివ్ మార్పులను చూస్తుంది. విద్యార్థులు మెడిటేషన్ చేయాలి, ఎందుకంటే ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. మార్కెటింగ్ పర్సన్స్ ఎంత ఎక్కువ ప్రయాణం చేస్తే, విజయం అంత ఎక్కువగా ఉంటుంది. ఇలా నెలాఖరు లక్ష్యాలను చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. దయచేసి ఈరోజు నాన్ వెజ్, మద్యం తీసుకోకండి. మాస్టర్ కలర్: బ్లూ
లక్కీ డే: శనివారం,లక్కీ నంబర్: 9,విరాళాలు: వీధిలో ఉండే జంతువులకు ఉప్పగా ఉండే ఆహారాన్ని దానం చేయండి.
నంబర్ 5 (5, 14, 23 తేదీలలో పుట్టినవారు) : ఈరోజు మీపై తక్కువ బాధ్యతలు ఉంటాయి. లాభదాయకమైన ఆస్తులు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి లేదా సన్నిహిత మిత్రులతో ఇన్నర్ ఫీలింగ్స్ పంచుకునే రోజు. అప్పు వంటి బాధ్యతల ఉచ్చులో పడకండి. రోజు రెండవ భాగంలో అదృష్టం వరిస్తుంది, కాబట్టి ఆ సమయంలో పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. సేల్స్, క్రీడలలో ఉన్నవారికి ఫాస్ట్ మూమెంట్ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు విజయాలను ఆనందిస్తారు. ప్రేమలో ఉన్న వ్యక్తులు దారి మళ్లడానికి అనేక సందర్భాలు ఉంటాయి, కాబట్టి నిజాయితీగా ఉండండి. మాస్టర్ కలర్: సీ గ్రీన్,లక్కీ డే: బుధవారం,లక్కీ నంబర్: 5,విరాళాలు: గ్రీన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దానం చేయాలి.
నంబర్ 6 (6, 15, 24 తేదీల్లో పుట్టినవారు) : గ్రహ బలాన్ని మెరుగుపరచడానికి శుక్ర పూజను నిర్వహించండి. విద్యార్థులు, రాజకీయ నాయకులు కొత్త అవకాశాన్ని తెలివిగా ఎంచుకుంటే, అది అనుకూలంగా మారుతుంది. మీరు పర్సనల్ రిలేషన్స్‌లో అసురక్షితంగా, అసౌకర్యంగా భావిస్తారు. కొత్త ఫ్యాక్టరీని స్థాపించడానికి ఆస్తి కోసం చూస్తున్న వారు మంచి ఆప్షన్ ఎంచుకోగలుగుతారు. ప్రెజెంటేషన్లకు హాజరు కావడానికి లేదా క్రీడలు ఆడేందుకు బయటకు వెళ్లండి, ఎందుకంటే మీరు గతాన్ని వీడాలి. మాస్టర్ కలర్: బ్లూ,లక్కీ డే: శుక్రవారం,లక్కీ నంబర్: 6,విరాళాలు: ఆశ్రమాలకు తెల్లటి స్వీట్స్ దానం చేయాలి.
నంబర్ 7 (7, 16, 25వ తేదీల్లో జన్మించిన వ్యక్తులు) : ఈ రోజు కొత్త అసైన్‌మెంట్స్‌పై రిసెర్చ్, జ్ఞానం అవసరం. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఇంజనీర్లు, బిల్డర్లు, జ్యోతిష్కులు, మేకప్ ఆర్టిస్ట్, స్పోర్ట్స్‌మెన్స్ విజయం సాధిస్తారు. న్యాయపరమైన వివాదాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. లవ్ పార్ట్‌నర్స్‌తో వివాదాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే విడిపోయే అవకాశం ఉంది. వాదనలు లేకుంటే రిలేషన్షిప్ బాగుంటుంది. జ్ఞానాన్ని ఉన్నతంగా ఉంచుకోవడానికి గురు మంత్రాన్ని చదవాలి, పఠించాలి. క్రీడాకారులకు ప్రతిఫలం, గుర్తింపు లభిస్తుంది. మనీ లెండర్లు, బ్యాంకర్లు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.మాస్టర్ కలర్: టీల్,లక్కీ డే: సోమవారం,లక్కీ నంబర్: 7,విరాళాలు: ఏదైనా రూపంలో కాంస్య లేదా రాగి మెటల్ పీస్ దానం చేయండి.
నంబర్ 8 (8, 17, 26వ తేదీలలో జన్మించినవారు) : మోసపూరితంగా, తప్పుగా ప్రవర్తించే అవకాశం ఉన్నందున చుట్టుపక్కల వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. మీరు పనిని సమయానికి పూర్తి చేయగలరు, కాబట్టి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మీకు డబ్బు, కీర్తి, జ్ఞానం, గౌరవం, కుటుంబ సభ్యుల ఆప్యాయతలను ఇచ్చిన దేవునికి మీ కృతజ్ఞతలు తెలియజేయడానికి గుడికి వెళ్లాలి. విలాసవంతమైన ప్రయాణం కూడా సాధ్యమే. మీ జీవితం సందడిగా, సంక్లిష్టంగా నడుస్తుందని మీరు కనుగొంటారు. కానీ ఇది టెంపరరీ దశ. వైద్యులు, ఫైనాన్సర్లు ప్రశంసలు అందుకుంటారు. మీ రొమాంటిక్ ఫీలింగ్స్‌ను రియాలిటీగా మార్చే అందమైన రోజు ఇది. మాస్టర్ కలర్: సీ బ్లూ,లక్కీ డే: శుక్రవారం,లక్కీ నంబర్: 6,విరాళాలు: బిచ్చగాడికి పుచ్చకాయ దానం చేయండి.
నంబర్ 9 (9, 18, 27వ తేదీలలో జన్మించినవారు) : నటన, మీడియా, యాంకరింగ్, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వ్యక్తుల సామాజిక ఎదుగుదలకు ఇది అనువైన రోజు. టెండర్లు, ఆస్తి కోసం మధ్యవర్తిని సంప్రదించడానికి ఇది మంచి రోజు. క్రీడాకారులు, వ్యాపారవేత్త, ఉపాధ్యాయులు, బ్యాంకర్లు, మ్యుజిషియన్స్, నటులు, విద్యార్థులు డాక్యుమెంటేషన్‌లో ఒక అడుగు ముందుకు వేయాలి. మీరు స్టాక్ మార్కెట్లో ఉంటే, స్టాక్‌ను పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం మంచిది. ఎరుపు, ఊదా రంగు కలిసే దుస్తులు ధరించడం అదృష్టం, స్థిరత్వాన్ని పెంచుతుంది. దయచేసి ఈరోజు మీ కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ప్రయాణాలు మానుకోండి. ఈరోజు ఆన్లైన్లో పని చేయడానికి ప్రయత్నించండి. మాస్టర్ కలర్: ఊదా,లక్కీ డే: మంగళవారం,లక్కీ నంబర్: 3,విరాళాలు: ఇంటి పనిమనిషికి ఎరుపు రంగు మసూర్ దానం చేయండి.