Numerology : (పూజా జైన్ - న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890) పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. ఆ సంఖ్యల ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. కొన్ని అంకెలు ఇతర అంకెలతో కలిసినప్పుడు అనుకూల ఫలితాలు ఇస్తాయి. మరికొన్ని నంబర్ల కలయిక చెడు సూచిస్తుంది. 6 సంఖ్యతో 8 కలిస్తే ఏమవుతుందో, 9 కలిస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
నంబర్ 6, 8 కంపాటబిలిటీ : సంఖ్యా శాస్త్రం ప్రకారం 6, 8 నంబర్లు బలమైన బంధాన్ని కలిగి ఉంటాయి. నంబర్ 8 జీవితంలో సవాళ్లు, అడ్డంకులు, కఠినమైన పరిస్థితులు నిండి ఉంటాయి. ఇలాంటి జీవితం గడిపే నంబర్ 8కి నంబర్ 6 మద్దతు, విలాసాన్ని అందిస్తుంది. ఈ రెండు నంబర్లు కలిసి విశ్వసనీయమైన ఆదర్శ భాగస్వాములు అవుతాయి. ఈ నంబర్ల ప్రభావం ఉన్న వ్యక్తులు పర్ఫెక్ట్ కపుల్ అవుతారు. అలాగే వీరు నిబద్ధత, సహాయ గుణం, దయా గుణాలతో సమాజంలో మంచి గౌరవాన్ని, ఇతరుల నుంచి ఆశీర్వాదాలను పొందుతారు.
న్యూమరాలజీ ప్రకారం, ఈ నంబర్ల ప్రభావం ఉన్న వ్యక్తులు లోహాలు, వజ్రాల తయారీ, రక్షణ సేవలు, పైలటింగ్, డిజైనింగ్, రెస్టారెంట్లు నడపడం, బ్రోకింగ్, అడ్వర్టైజింగ్, మెడిసిన్ లేదా స్పోర్ట్స్ వంటి రంగాలలో విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు ఒకరికొకరు భాగస్వామ్యాలను కుదుర్చుకున్నప్పుడు, వారు రెండు చక్రాల లాగా.. ఒకరికొకరు మద్దతు ఇచ్చిపుచ్చుకుంటారు. ఒకరికొకరు జీవితాంతం కట్టుబడి ఉంటారు. అయితే, నంబర్ 6 అధిక ప్రభావం... సంతోషకరమైన వివాహానికి చేటు చేస్తుందని గమనించడం ముఖ్యం. లక్కీ కలర్స్: బ్లూ... లక్కీ డే: శుక్రవారం... లక్కీ నంబర్స్: 5, 6... విరాళాలు: యాచకులకు స్వీట్లు దానం చేస్తే మంచిది.
నంబర్ 6, 9 కంపాటబిలిటీ : న్యూమరాలజీలో, అంగారక గ్రహం నంబర్ 9తో సంబంధం కలిగి ఉంటుంది. ఇది 6 సంఖ్యతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటుంది. 9, 6 రెండూ అత్యంత సృజనాత్మకంగా (Creative), కళాత్మకం (Artistic)గా ఉంటాయి. ఈ సంఖ్యల ప్రభావం ఉన్న వ్యక్తులు సృజనాత్మక రంగాలలో విజయవంతమవుతారు. కీర్తి, గుర్తింపును సాధిస్తారు. అంతేకాకుండా, నంబర్ 9 ప్రభావంతో జన్మించిన చాలా మంది వ్యక్తులు వాహనాలు, కంపెనీ పేర్ల మొత్తం న్యూమరాలజీ 6 ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే ఈ రెండు సంఖ్యలు కలిస్తే విజయం, అదృష్టం వరిస్తుందని నమ్ముతారు.
నంబర్ 9, 6 సంఖ్యల కలయిక ఉన్న జంటలు సంగీతాన్ని వారి దినచర్యలో ఒక భాగం చేసుకోవాలి. అంగారక గ్రహానికి సంబంధించిన ఆచారాలను అనుసరించాలి. వీరు జీవితంలో మొదటి 20 సంవత్సరాల తర్వాత ఉత్తమ రోజులను పొందుతారు. దీనర్థం వారు పరిపక్వత, అనుభవాన్ని పొంది వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలలో మరింత విజయాన్ని, ఆనందాన్ని పొందే అవకాశం ఉంది. లక్కీ కలర్స్: బ్రౌన్, పర్పుల్... లక్కీ డే: మంగళవారం, శుక్రవారం... లక్కీ నంబర్స్ : 9, 6... విరాళాలు: ఆశ్రమాలలో గోధుమలు, స్టేషనరీ సామగ్రిని విరాళంగా ఇవ్వాలి.