Numerology : (పూజా జైన్ - న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890) పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య, అక్షరం ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం మీ పేరు Vతో మొదలైతే.. మీకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కలిసొచ్చే అంశాలేంటి, ఎలాంటి సవాళ్లుంటాయి అనే విషయాలను... న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి.
Alphabets V : ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో V అక్షరంతో తమ పేరు మొదలయ్యేవారు గౌరవప్రదంగా జీవిస్తారు. ఇతరుల నుంచి కూడా వారు గౌరవం కోరుకుంటారు. వీరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నట్లు.. ఇతరులకు తప్పుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వీరు ఎక్కడి నుంచైనా మంచితనాన్ని గ్రహించగలరు. జీవితంలో ఎదగగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
తెలివి : వీరు చాలా నిశితమైన తెలివిని కలిగి ఉంటారు. తమ అభిప్రాయాన్ని ఇతరులు అంగీకరించేలా చేయగలరు. ఇతరులపై ఆధిపత్య వ్యక్తిత్వ ఇమేజ్‌ని సృష్టించినట్లు కనపించడం ద్వారా... ఇతరుల్ని తమవైపు తిప్పుకుంటారు. చాలా నమ్మకంగా ఉంటారు. తమ కుటుంబానికి శ్రేయోభిలాషులు. నిస్వార్థ ఆసక్తితో తమ స్నేహితులను జాగ్రత్తగా చూసుకుంటారు.
చెయ్యాల్సినవి : ఆకుకూరలను పేదవారికీ, పశువులకూ దానం ఇవ్వాలి. ప్రత్యేక రోజుల్లో అడుక్కునేవారికి దుప్పట్లు పంచాలి. వీరి లక్కీ కలర్స్ బ్లూ, గ్రే (బూడిదరంగు), వీరికి లక్కీ రోజులు మంగళవారం, శుక్రవారం,... వీరి లక్కీ నంబర్ 6. ఆల్ఫాబెట్ Vతో పేర్లు మొదలయ్యే సెలబ్రిటీలు విక్టరీ వెంకటేష్, వరుణ్ ధావన్, విరాట్ కోహ్లీ.