* పెళ్లి సమయంలో : భాగస్వామిని నిర్ణయించిన తర్వాత, ఈ వివాహాన్ని జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మార్చడానికి న్యూమరాలజీ దోహదపడుతుంది. అన్ని ప్రయత్నాలు, చర్యలు అనుకూలంగా మారుతాయి. జంటలిద్దరికీ సరిపోయే సరైన తేదీని (ముహూర్తం) ఎంచుకోవడానికి న్యూమరాలజీ సహాయం చేస్తుంది. పెళ్లి తేదీ న్యూమరాలజీ, పంచాంగం రెండింటికీ సరిపోవాలి. తేదీ వారి పేరు, పుట్టిన తేదీ ఆధారంగా జంటకు సరిపోవాలి.
పెళ్లి వేదికను సెలక్ట్ చేయడాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తారు. వివాహ వేదికలు ఇంటి నుంచి వెడ్డింగ్ లాన్లు, డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు మారడంతో ప్రాముఖ్యం పెరిగింది. జంట పేరు, పుట్టిన తేదీ, వివాహ వేదిక వాస్తుతో సరిపోవాలి. జీవితంలో సమృద్ధిగా ప్రేమను బహుమతిగా ఇవ్వడానికి అనువుగా ఉండాలి. వేదిక వాస్తుతో పాటు, అలంకరణ రంగు, థీమ్ కూడా జంటకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి.
* పెళ్లి తర్వాత.. : పెళ్లి జరిగిన అనంతరం దంపతులు ఎంచుకున్న గది వాస్తు ప్రకారం సరిపోయేలా ఉండాలి. ఇంటి వాస్తు, అలాగే సొసైటీ/అపార్ట్మెంట్ కూడా అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటీరియర్ డెకరేషన్ కలర్, వివిధ వస్తువుల ప్లేస్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవన్నీ జంట పేరు, పుట్టిన తేదీతో అనుకూలంగా ఉంటే.. జీవితంలో ప్రేమ సమృద్ధిగా ఉంటుంది.