Today Horoscope: నేడు సోమవారం (నవంబర్ 15) .. ఇవాళ ఎలాంటి ఫలాలు ఉంటాయి. ఏదైనా ముఖ్య కార్యక్రమం చేపట్టడానికి సరైనా రోజా కాదా..? ఇలా ఏ రోజుకు ఆ రోజు తమ లక్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహం చాలామందిలో ఉంటుంది. అలాంటి వారి కోసం ధిన ఫలాలు అందిస్తోంది న్యూస్ 18 నెట్ వర్క్.. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఇవాళ ఎవరికి ఎలా ఉందో.. దిన ఫలాల ద్వారా తెలుసుకుందాం.
మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. తల పెట్టిన పనులు చాలా వరకు పూర్తి చేస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు కొంటారు. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో హాయిగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు తేలికగా లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇది సమయం కాదు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం పరవాలేదు.
మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో ఒత్తిడి, శ్రమ ఉన్నా అవి మున్ముందు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఇరుగు పొరుగు వారితో వివాదాలకు దిగవద్దు. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తలచిన పనులు నెరవేరుతాయి. చాలాకా లంగా చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. భార్యాపిల్లలతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ల వల్ల మేలు జరుగుతుంది.
కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. ఆర్థిక ప్రయోజనాలుంటాయి. శుభవార్త శ్రవణం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. చిన్ననాటి స్నేహితులు పలకరిస్తారు. శుభ కార్యం తలపెడతారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి.
తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇల్లు లేక స్థలం కొనే సూచనలున్నాయి. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదరవచ్చు. బంధువులకు సంబంధించిన ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.
వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఆర్థిక సమస్య ఒకటి బాగా ఇబ్బంది కలిగిస్తుంది. అనుకున్న పనులు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. బం ధువొకరు సమస్యలు సృష్టిస్తారు. వ్యాపారులకు కాస్తంత అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కు దిరే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల నష్టపోతారు. ప్రేమ వ్యవహారం పెళ్లి వైపు అడుగులు వేస్తుం ది. ఆరోగ్యం జాగ్రత్త.
ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వివాహ సంబంధం కుదరవచ్చు. సంతానం నుంచి శుభవార్త లు వింటారు. ఒక పాత ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు వెడతారు. వ్యాపారులు కష్టపడాల్సింది. ఆర్థిక లావాదేవీలు స త్ఫలితాలనిస్తాయి.
మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు కొద్దిగా కష్టపడినా మంచి ఫలితం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరికీ హామీలు ఉండొద్దు.
కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ అందుతుంది. ఆదాయం పెంచుకోవడం మీద దృష్టి పెడతారు. సన్నిహితుల సహాయంతో పనులు పూర్తవుతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవాలు మంచి ఫలితాలనిస్తాయి.
మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి ధోకా లేదు. సేవా కార్యక్రమాలతో బిజీ అవుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వ్యాపారులు తే లికగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి.