2021 సంవత్సరంలో ప్రపంచం మొత్తం వ్యాధుల బారిన పడుతుందని నోస్ట్రాడామస్ అప్పట్లో చెప్పాడు. అది ఓ రకంగా నిజం అయింది కూడా. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ అనే మహమ్మారి బారిన పడింది. ప్రపంచం మొత్తం రోగగ్రస్తం కూడా అయిందంటే వాస్తవం. ఓ రకంగా నోస్ట్రాడామస్ చెప్పింది నిజం అయింది. 2022లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Inflation Uncontrollable: నోస్ట్రాడామస్ చెప్పిన దాని ప్రకారం 2022లో భారీ ఎత్తున ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అమెరికన్ డాలర్ విలువ భారీగా పతనం అయిపోతుంది. 2022లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోతాయని నోస్ట్రాడామస్ అంచనా వేశాడు. ప్రస్తుతం క్రిప్టోకరెన్సీల కారణంగా బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Asteroid destroys the Earth: 2022లో ఓ భారీ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొడుతోందట. అది భూమిని భారీగా డ్యామేజ్ చేస్తుందని నోస్ట్రాడామస్ అంచనా వేశాడు. ఓ భారీ రాయి సముద్రంలో పడుతుందట. దాని వల్ల సముద్రంలో భారీ ఉప్పెన వచ్చినా రావొచ్చు. ఈ సముద్ర తరంగాలు భారీ డ్యామేజ్ చేస్తాయని నోస్ట్రాడామస్ చెప్పాడు. (ప్రతీకాత్మక చిత్రం)
Destructive nuclear bomb: నోస్ట్రాడామస్ అంచనా ప్రకారం 2022లో న్యూక్లియర్ బాంబు పేలనుంది. అది ఎక్కడ పేలుతుందనేది చెప్పకపోయినా ఆటంబాంబు మాత్రం భూమిని భారీగా డ్యామేజ్ చేయనుంది. ఇప్పటికే చాలా దేశా లు ఆటంబాంబులను తయారు చేస్తున్నాయి. దీంతో ఏ దేశం ఎప్పుడు ఎవరి మీద బాంబు వేస్తుందో . (ప్రతీకాత్మక చిత్రం)
For three days the world plunges into darkness: నోస్ట్రాడామస్ అంచనా ప్రకారం 2022లో భారీ ఎత్తున డ్యామేజీ జరగనుంది. అది ఏ స్థాయిలో ఉంటుందంటే, 72 గంటల పాటు మొత్తం చీకటి అయిపోతుందని నోస్ట్రాడామస్ తన పుస్తకంలో రాశాడు. పెద్ద పెద్ద కొండల మీద మంచు పడుతుందని నోస్ట్రాడామస్ అంచనా వేశాడు. (ప్రతీకాత్మక చిత్రం)
Artificial Intelligence Attack on Man: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మర మనుషులు మానవాళిని కంట్రోల్ చేస్తుంది. రోబోట్స్ రాజ్యం నడుస్తుంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు పెడుతున్నాయి. దీంతో ఇది ఏ ఉపద్రవానికి దారి తీస్తుందో చూడాలి. (ప్రతీకాత్మక చిత్రం) (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)