Nirjala Ekadashi: నేడే నిర్జల ఏకాదశి.. ఉపవాసం చేస్తున్నప్పుడు చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే..!
హిందూ మతంలో ఉపవాసాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి రోజున చేసే ఉపవాసాల వల్ల పుణ్యం చేకూరుతుందని హిందువులు భావిస్తుంటారు. ముఖ్యంగా జ్యేష్ఠ శుక్ల ఏకాదశి తిథి నాడు పాటించే ఏకాదశితో ఎంతో పుణ్యం లభిస్తుందని అంటారు.