Munger Mystery Jal kund : రామాయణం ప్రకారం.. రావణాసురుడి వధ తర్వాత.. సీతాదేవిని లంక నుంచి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె అగ్నిపరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె బీహార్ లోని.. ముంగేర్ ప్రాంతంలో ఆమెకు అగ్నిపరీక్ష జరిగిందని చెబుతారు. ఆ తర్వాత.. ఆ అగ్ని కాస్తా.. వేడి నీరుగా మారిపోయిందని నమ్ముతున్నారు. దాన్ని సీతాకుండ్ అని పిలుస్తున్నారు. అదో వేడి నీటి బుగ్గ లాగా కనిపిస్తుంది. అక్కడ నీరు ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. అక్కడే ఉన్న ఇతర కోనేర్లలో మాత్రం నీరు చల్లగా ఉంటుంది.
పాప విమోచనం కోసం కుంభోదరుడనే మహర్షి.. రాముడికి సలహా ఇచ్చాడు. తీర్థ స్థలాలను సందర్శించడం ద్వారా మాత్రమే ఈ పాపం తొలగుతుందని తెలిపాడు. దాంతో రాముడు.. సీతతోపాటూ.. తన ముగ్గురు సోదరులు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడితో కలిసి.. తీర్థ యాత్రలకు వెళ్లాడు. అలా ముంగేర్‌లోని ముద్గల్ రుషి ఆశ్రమానికి చేరాడు.
ఈ ముద్గల్ రుషి ఆశ్రమం ప్రస్తుతం సీతా చరణ దేవాలయం, కష్టహరిణి ఘాట్‌గా ప్రసిద్ధి చెందింది. సీతా దేవి ఇక్కడ ఛత్ ఉపవాసం పాటించింది. ముద్గల్ ఆశ్రమంలో ఉన్న ఋషులు అందరి చేతుల నుంచి ప్రసాదం స్వీకరించారు. సీతాదేవి చేతుల నుంచి మాత్రం స్వీకరించలేదు. దాంతో ఆమె తన పవిత్రతను నిరూపించుకోవాల్సి వచ్చిందని పూజారి నాగేంద్ర కుమార్ మిశ్రా చెప్పారు.
ముంగేర్ మాఘి మేళా మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మీకు చౌక ధరలో ఫర్నిచర్ కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. దీని కోసం సీతాకుండ్ మాఘి మేళా కోసం ప్రజలు ఏడాది పొడవునా వేచి ఉంటారు. ఈ సంవత్సరం చెక్క ఫర్నిచర్ కొనుగోలు ప్రారంభమైంది. ఖాళీ మైదానంలో 10 నుంచి 15 మంది బడా కలప వ్యాపారులు మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు.