కర్కాటకం-వృశ్చికం
ఈ రెండు రాశులు జల తత్వాన్ని కలిగి ఉంటాయి. కర్కాటక రాశి వారు కుటుంబానికి అధిక ప్రాధాన్యమిస్తారు. అందుకే కుటుంబ బంధాలతో మిళితమై ఉంటారు. వృశ్చిక రాశి వారికి బయట ప్రపంచాన్ని, కుటుంబాన్ని రెండింటి ఎలా మేనేజ్ చేయాలో తెలుసు. ఈ రెండు రాశుల వారి ప్రేమ, సున్నితత్వం వీరి అవగాహనకు సంకేతాలు. భావాలు సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం-కన్య
ఈ రాశి వారు ఇద్దరూ చాలా ఆసక్తిగా ఉంటారు. మాట్లాడే స్వభావం, ఎదుటి వారిని అర్థం చేసుకునే తత్వం వీరిలో పుష్కలంగా ఉంటాయి. ఈ లక్షణాల కారణంగా ఈ జోడి ఉత్తమంగా భావిస్తారు. జీవితంలో జరిగే విషయాలపై వీరి వైఖరి చాలా కూల్‌గా ఉంటుంది. ఏ నిర్ణయాన్నైనా చాలా ఓపికగా తీసుకుంటారు. అయితే ఈ విషయంలో కన్యా రాశి వారు ముందు ఉంటారు. మిథున రాశి వారు శ్రమ రహితంగా ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం-మీనం..
ఈ రాశులవారు తమ మధ్య అవగాహన పెంచుకోవడానికి గొప్ప సామర్థ్యాలను కలిగి ఉంటారు. చాలా మంది వ్యక్తులు అంగీకరించడానికి నిరాకరించే విషయాలపై వారి నమ్మకం వారిని ఇతరుల నుంచి వేరు చేస్తుంది. హేతుబద్ధమైన దృక్పథాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. కుంభ రాశి వారు మాటలతో మాయచేయగలరు. మీన రాశి వారు వినడంలో నిష్ణాతులు. ఈ లక్షణాలు వీరి మధ్య గొప్పగా సమతుల్యాన్ని కలిగిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)