Monthly Horoscope : రాశిఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు కొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. మరి 2023 సంవత్సరంలో ఏప్రిల్ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి మన మాస రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) (Aries) : ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు మేష రాశిలో కలుసుకోబోతున్నాయి. అందువల్ల ఈ రాశివారికి కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇల్లు గానీ, స్థలం గానీ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువులు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది. ఐ.టి, సాంకేతిక విభాగ విద్యార్థులు అనాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు పురోగతి సాధించే అవకాశం ఉంది. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. అకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఐ.టి రంగంలోని వారికి, ప్రభుత్వోద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ మంచి ప్రయోజనాలిస్తాయి.
వృషభ రాశి (కృత్తిక 2,3,4 రోహిణి, మృగశిర 1,2) (Taurus) : ఈ రాశివారికి ఈ నెలలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో కలుస్తుండటం వల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. భార్యాపిల్లలతో కలిసి కొనుగోళ్లు చేస్తారు. కొద్దిగా తిప్పుట ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. సన్నిహితులొకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. ఆదాయం పెంచుకునేందుకు మార్గాలు వెతుకుతారు. చాలావరకు అప్పులు తీరుస్తారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం అందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. స్నేహితురాలితో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. వాగ్దానాలు చేయకపోవడం కూడా మంచిది.
మిథున రాశి (మృగశిర 3,4 ఆర్ర, పునర్వసు 1,2,3) (Gemini) : ఈ రాశివారికి ఈ నెల నాలుగు గ్రహాలు లాభస్థానంలో అంటే 11వ స్థానంలో చేరడం అనేచి ఆర్థికంగా శుభ సూచకం. ఉద్యోగ జీవితం శుభవార్తలతో ఉత్సాహంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులు చకచకా పూర్తవుతాయి. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆశించిన స్థాయిలో ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటారు. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వాద వివాదాలకు దిగవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గుళ్లు, గోపురాలు సందర్శిస్తారు. పేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తాయి.
కర్కాటక రాశి (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) (Cancer) : ఈ రాశివారికి దశమ స్థానంలో ఎక్కువ గ్రహాలు చేరుతుండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు తప్పనిసరిగా ఉంటాయని చెప్పవచ్చు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు, అవివాహితుల వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. మీ తల్లితండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. తీర్థయాత్రలకు ప్లాన్ వేస్తారు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు... ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఎక్కడా ఎవరికీ హామీ సంతకాలు పెట్టవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. స్పెక్యులేషన్ అంతగా లాభించదు.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1) (Leo) : ఈ రాశివారికి తొమ్మిదవ స్థానంలో అంటే భాగ్య స్థానంలో ప్రధాన గ్రహాలు ఎక్కువగా చేరుతున్నందువల్ల కొన్ని అదృష్టాలు పట్టే సూచనలున్నాయి. విదేశీ ప్రయాణానికి అవకాశాలున్నాయి. ఉద్యోగపరంగా ఈనెల అన్నివిధాలా అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. జీవితంలో పైకి రావాలనే తపన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందివస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. రహస్యాలను మనసులోనే ఉంచుకోండి. బయటపెట్టడానికి ఇది సమయం కాదు. విద్యార్ధులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వారాంతాలలో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఈ నెలంతా మీరు ఎంత పాజిటివ్‌గా వ్యవహరిస్తే అంత మంచిది. ఇక ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
కన్య రాశి (ఉత్తర 2,3,4, హస్తు చిత్త 1,2) (Virgo) : ఈ రాశివారికి అష్టమ స్థానంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు చేరడం వల్ల ఈ నెలంతా వీరికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. శ్రమ మీద కానీ పనులు పూర్తి కావు. అయితే, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు విందు ఇస్తారు. తోబుట్టువులు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. దూర ప్రయాణాలు గానీ, తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయమార్గం గురించి ఆలోచిస్తారు. ఎవరికీ డబ్బులివ్వవద్దు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. పేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోనివారికి, చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా అనుకూల సమయం. కోర్టు వ్యవహారాలలో గెలవచ్చు.
తుల రాశి (చిత్త 3,4 స్వాతి, విశాఖ 1,2,3) (Libra) : సప్తమ స్థానంలో నాలుగు అనుకూల గ్రహాలు చేరుతున్నందువల్ల ఈ రాశివారు ఉద్యోగానికి సంబంధి౦చి, ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వినడం జరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. తరచూ శివార్చన చేయించండి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సమహోద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సతీమణితో కలిసి షాపింగ్ చేసి, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్ధులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కామర్స్ విద్యార్ధులకు సమయం బాగుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కానీ, ప్రేమ వ్యవహారాల్లో మాత్రం ముందుకు పోవడం శ్రేయస్కరం కాదు. ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.
వృశ్చిక రాశి (విశాఖ & అనూరాధ, జ్యేష్ఠ) (Scorpio) : ఆరవ స్థానంలో నాలుగు గ్రహాలు చేరడం అనేది ఈ రాశివారికి కొన్ని ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగానికి సంబంధించినంతవరకు ఇది అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరించడం మంచిది. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. త్వరలో పెళ్లిబాజాలు మోగే అవకాశం ఉంది. అదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరతాయి. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. భార్య వైపు బంధువులు ఇంటికి వస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్తు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.
ధనస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) (Sagittarius) : ఈ రాశివారికి అయిదో స్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో కలుస్తుండడం వల్ల అనేక ముఖ్యమైన విషయాల్లో సమయం అనుకూలంగా మారుతుంది. ఉద్యోగంలో అర్థిక ప్రయోజనాలుంటాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే, వృత్తి వ్యాపారాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. సాహిత్యం మీద మోజు పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. బాగా సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఓ అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ల వల్ల ఆశించిన స్థాయిలో లాభముంటుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) (Capricorn) : ఈ రాశివారికి నాలుగో స్థానంలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల కొన్ని శుభ యోగాలు పట్టడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఏలిన్నాటి శని కారణంగా ప్రతి పనీ కొద్దిగా అలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. అయితే ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, వైద్య సహాయంతో కోలుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. నంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. సైన్స్, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు, న్యాయవాదులు అభివృద్ధి సాధిస్తారు.
కుంభ రాశి (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) (Aquarius) : ఈ రాశివారికి మూడో స్థానంలో గ్రహాలు ఎక్కువ సంఖ్యలో చేరుతున్నందువల్ల కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతారు. ఈ నెలంతా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘ౦లో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయరు. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల సందర్శన ఉంది. అనవసర, అక్రమ పరిచయాల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. హృద్రోగ నిపుణులకు ఉన్నత శిక్షణకు విదేశాల నుంచి అవకాశం వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. కోపతాపాలకు ఇది సమయం కాదు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. వృద్ధ తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి.
మీన రాశి (పూర్వాభాద్ర ఓ ఉత్తరాభాద్ర, రేవతి) (Pisces) : ఈ రాశివారికి ధన స్థానంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక ప్రయత్నాలన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. స్థలం కొనుగోలు కోసం అగ్రిమెంట్ రాసుకు౦టారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక అవసరాలు చాలావరకు తీరతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఇంటి నిర్వహణ విషయంలో జీవిత భాగస్వామితో విభేదించడం సమంజసం కాదు. సంతాన౦లో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. నష్టపోతారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్‌వారికి అన్ని విధాలా బాగుంటుంది. దూరపు బంధువులకు సంబంధించి దుర్వార్త వింటారు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. కోర్టు కేసులో నెగ్గుతారు. స్పెక్యులేషన్ లాభించకపోవచ్చు.