దైనందిక జీవితంలో జ్యోతిష్య శాస్త్రం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. గ్రహాల కదలికలను బట్టి జ్యోతిష్యులు 12 రాశుల వారి జీవితం ఎలా ఉండనుందో అంచనా కూడా వేస్తారు. ఇక ఫిబ్రవరి నెల అంత సాఫీగా సాగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి చికాకులు తప్పేలా లేవని జ్యోతిష్యం చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలను కష్టసుఖాల సమ్మేళనం అని చెప్పవచ్చు. లాభనష్టాలను సమానంగా చూస్తారు. కొన్ని పనులు అతి కష్టం మీద తీరుతాయి. ఇందుకోసం చాలా టెన్షన్ పడతారు. ముఖ్యంగా గవర్నమెంట్ పనుల విషయంలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పని భారం.. అనవసర ప్రయాణాలతో ఈ నెల మొత్తం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఓపికగా ఉండండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకర రాశి వారు ఫిబ్రవరి నెలలో దూకుడుగా ఉండకుండా ఉండటమే మంచిది. ప్రతి విషయంలోనూ పంతానికి వెళ్లకండి. కొన్ని విషయాల్లో ఆరంభంలోనే వెనక్కి తగ్గడం చాలా ఉత్తమంగా ఉంటుంది. పంతానికి వెళ్లి మొండిగా ముందుకు వెళితే లేనిపోని సమస్యలు మధ్యలో తప్పుకోవాలన్నా తప్పుకోలేని స్థితికి చేరుకుంటారు. ప్రయాణాలు చేసే సమయంలో సీట్ బెల్ట్ వంటివి తప్పక ధరించండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. సంయమనంతో ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
కుంబ రాశి వారికి ఫిబ్రవరి నెల దిన దిన గండంగా ఉండనుంది. ఈ నెల మొత్తం సమస్యలతో సావాసం చేసే అవకాశం ఉంది. డబ్బు సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ఇబందులన్నీ తాత్కాలికమే అని గుర్తించుకోండి. ఫిబ్రవరి 15 తర్వాత సమస్యలు తీరుతూ వచ్చే అవకాశం ఉంది. నెలాఖరులో మానసిక ప్రశాంతత దక్క అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)