మేష రాశి (Aries): గురు, శని గ్రహాలు పూర్తి స్థాయిలోమ అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నెలంతా చాలావరకు ప్రశాంతంగానే గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ,వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఫ్లాట్ కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మికప్రయాణాలు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి అభివృద్ధి కనిపిస్తోంది. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు, తీసుకోవద్దు. నష్టపోతారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్వారికి అన్ని విధాలా బాగుంటుంది. దూరపు బంధువులకు సంబంధించి దుర్వార్త వింటారు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో పండుగవాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పరవాలేదు.
వృషభ రాశి (Taurus): అదృష్టానికి, శుభానికి కారకుడైన గురు గ్రహం బాగా అనుకూలంగా ఉంది. ఈ నెలంతా మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగం లో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయరు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అక్రమ పరిచయాలు పెంచుకోవద్దు. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. వ్యాపారులకు చాలా బాగుంటుంది. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. టెక్నాలజీ నిపుణులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. కోపతాపాలకు ఇది సమయం కాదు. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది.
మిథున రాశి (Gemini): గురు, శని గ్రహాల స్థానం మార్పు వల్ల శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం విషయ౦లో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. నవమ శని కారణంగా అకస్మిక ప్రయాణాలకు, దూరపు ప్రాంతాల్లో ఉద్యోగం బదిలీ వంటివి చోటు చేసుకుంటాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు ఎంతగానో లాభపడతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, పూర్తిగా పడక పెట్టెంత పరిస్థితి రాకపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగువేస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ది సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి (Cancer): ఈ నెలలో కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా సానుకూల పరిస్థితులుగా మారతాయి. అదృష్ట యోగంపడుతుంది. అనుకున్న పనులు చాలావరకు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజంలో పలుకుబడికలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. కొందరు మిత్రులు మోసం చేసే అవకాశం ఉంది. శుభకార్యాల గురించి అలోచిస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగు ఉ౦డదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చే సూచనలున్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగు౦టుంది. ప్రయాణాలు కష్టనష్టాలకు దారితీస్తాయి. కోర్టు కేసులో రాజీ కుదిరే సూచనలున్నాయి. దూరప్రయాణాలకు, తీర్థయాత్రలకు అవకాశం ఉంది.
సింహ రాశి (Leo): ప్రధాన గ్రహాలైన గురు, శని గ్రహాలు అంతగా అనుకూలంగా లేనందువల్ల ఎక్కువగా ప్రతికూల ఫలితాలే అనుభవానికి వస్తాయి. భవిష్యత్తు గురించి అలోచిస్తారు. ఆశించిన పనులన్నీ అతి కష్టం మీద పూర్తవుతాయి. ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. మిత్రుల వల్ల ఇబ్బందులు పడతారు. ఆశాభావంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇంట్లో శుభ కార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెల్లి బాజాలు మోగే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్నేహితులతో విహారానికి వెళతారు. వ్యాపారులు సునాయాసంగా అభివృద్ధి సాధిస్తారు. డాక్టర్డు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. భార్య వైపు బంధువులు ఇంటికి వస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్టు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్య సత్ఫలితాలు సాధిస్తారు. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
కన్య రాశి (Virgo): గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెల శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఏడింట గురుడున్న కారణంగా ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. అప్పులు తీర్చడం జరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల ను౦చి ఒత్తిడి అధికమవుతుంది. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సతీమణితో కలిసి షాపింగ్ చేసి, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోవడం ప్రస్తుతానికి అంత శ్రేయస్కరం కాదు. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. దూరప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబపరంగా ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులు మరి కొంత కాలం ఆగాల్సి ఉంటుంది.
తుల రాశి (Libra): ఈ నెల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్వాతి నక్షత్రం వాళ్లకు చాలా బాగుంటు౦ది. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. స్నేహితులకు విందు ఇస్తారు. తోబుట్టువులు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. దూర ప్రయాణాలు గానీ, తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఎవరికీ డబ్బులివ్వవద్దు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి. ప్రస్తుతానికి ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోనివారికి, చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. కోర్టు వ్యవహారాలలో గెలిచే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు ఇది ఏమాత్రం సమయం కాదు.
వృశ్చిక రాశి (Scorpio): గురు సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఈ నెల కొన్ని మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. అధికారులు మీ ప్రతిభను, శ్రమను గుర్తిస్తారు. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడడం మానుకోండి. ప్రతిదాన్నీ అపార్థం చేసుకోవడం మంచిది కాదు. ఎవరితోనూ వివాదాలకు, వాదాలకు దిగవద్దు. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి వ్యక్తులు పరిచయమవుతారు. అదనపు బాధ్యతలు మీద పడతాయి. రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. రహస్యాలను మనసులోనే ఉంచుకోండి. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూల౦గా ఉంది. వారాంతంలో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వ్యాపారులు బాగా రాణిస్తారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి.
ధనస్సు రాశి (Sagittarius): ఈ నెల ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏలిన్నాటి శని నుంచి బయటపడిన కారణంగా కొన్ని ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. మీ తల్లితండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. తీర్భయాత్రలకు ప్లాన్ వేస్తారు. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన విషయాల్లో తిప్పట ఎక్కువగా ఉ౦టుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలనిస్తాయి. పిల్లలకు సంబంధించి ఒక సమస్య అందోళన కలిగిస్తుంది.
మకర రాశి (Capricorn): ఈ నెల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు కొద్దిగా ఒత్తిడికి గురవుతుంటారు. ఏలినాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పట వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ట శ్రద్ద అవసరం. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అయితే, కొద్దిగామానసిక ఒత్తిడి ఉంటుంది. పెల్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సతీమణితో వివాదాలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. భారీయెత్తున షాపింగ్ చేస్తారు. పిల్లలు మిమ్మల్ని సంతోష పెడతారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండకపోవచ్చు.
కుంభ రాశి (Aquarius): ఈ నెల చాలావరకు మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. రోజులు బాగానే గడిచిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. భార్యాపిల్లలతో కలిసి కొనుగోళ్లు చేస్తారు. ఏలిన్నాటి శని కారణంగా తిప్పట ఎక్కువగా ఉన్నా తలచిన పనులు చాలావరకు పూర్తవుతాయి. సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. అప్పులు తీరుస్తారు. వివాహ సంబంధాల కోసం ప్రయతాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఎంతగానో ఆందోళన కలిగిస్తుంది. చెడు 'స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడ౦ మంచిది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నించినా [పేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.
మీన రాశి (Pisces): ఆర్థిక విషయాలకు ఈ నెల కాస్తంత అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు ఉద్యోగంలో ప్రవేశించే అవకాశం ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. అయితే, అనవసర ఖర్చులకు కళ్లెం వేయాల్సి ఉంటుంది. ఇల్లు గానీ, సలం గానీ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరపు బ౦ధువులు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది. వ్యాపారులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశముంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రవచన రంగాల్లో ఉన్నవారు, ఆలయ సిబ్బంది, యోగా, సంగీతం వంటి రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ
వివాదాలకు దిగవద్దు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.