జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు ఓ విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు. వాస్తు ప్రకారం లక్ష్మీదేవి ఉండే ఇల్లు, చోటు అన్నీ అత్యంత అందంగా, క్లీన్గా ఉండాలి. అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం... లక్ష్మీదేవి చాలా సుకుమారమైన తల్లి. అమ్మ ప్రతీదీ చక్కగా ఉండాలని కోరుకుంటుంది. ఆ తల్లికి కోపం వస్తే, పరిసరాలు నచ్చకపోతే... ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
ఈ రోజుల్లో బీరువా వాడే వారి సంఖ్య తగ్గిపోతుంది. డబ్బు, నగలు బాగా ఉన్నవారు బ్యాంకులోని లాకర్లలో వాటిని దాచుకుంటున్నారు. అవి కాస్తో కూస్తో ఉన్న వారు... ఇంట్లోని ఏదో మూల దాచుకుంటున్నారు. అలాంటప్పుడు దక్షిణం, పశ్చిమం మధ్యలో ఉండే నైరుతి మూలలో వాటిని ఏ షెల్ఫ్లోనో ఉంచవచ్చని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)