(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : ఓ రాశివారు కోపాన్ని, అతి విశ్వాసాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంకొందరు బిజినెస్ యాక్టివిటీలను సీక్రెట్‌గా ఉంచుకోవాలి, లేకపోతే నష్టపోతారు. మరో రాశికి చెందిన వారు పొరపాటుల వల్ల పెద్ద ఆర్డర్ కోల్పోయే అవకాశం ఉంది. నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. డిసెంబర్ 3వ తేదీ (మార్గశివర శుద్ద దశమి) శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
మేష రాశి (Aries) (అశ్వని, భరణి,కృత్తిక -1) : ఏదైనా పనికి సంబంధించిన ప్రయాణం మీ ఉజ్వల భవిష్యత్తుకు తలుపులు తెరుస్తుంది. కొన్ని కొత్త విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కానీ లాభాల బాట మాత్రం నిదానంగా సాగుతుంది. ఉద్యోగస్తులు తమ పని పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చూపకూడదు. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : వృత్తిపరంగా ఈ రోజు పర్ఫెక్ట్గా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తాయి, కానీ మీరు సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు భవిష్యత్తులో పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆఫీస్ పనులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.
పరిహారం: గణేశుడిని పూజించండి.(ప్రతీకాత్మక చిత్రం)
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : వ్యాపారాన్ని పెంచుకోవడానికి పబ్లిక్ రిలేషన్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మీడియా, ఫోన్ ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు పొందవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీ పని పట్ల అంకితభావంతో ఉండండి.
పరిహారం; సూర్య భగవానునికి నీరు సమర్పించండి.(ప్రతీకాత్మక చిత్రం)
సింహ రాశి (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) : బిజినెస్ యాక్టివిటీస్‌పై మరింత శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఏదో ఒక రకంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగుల కార్యకలాపాలను పర్యవేక్షించండి. ఆఫీస్‌లో మీ ఇమేజ్, కీర్తి పెరుగుతుంది. మీరు కొన్ని ముఖ్యమైన అధికారాలను కూడా పొందవచ్చు.
పరిహారం: అనాథాశ్రమానికి ఆహారం దానం చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
కన్య రాశి (Virgo) య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : వ్యాపారంలో పని పట్ల సహోద్యోగుల పూర్తి అంకితభావం ఉంటుంది, మీ ఆధిపత్యం కూడా అలాగే ఉంటుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఒడిదుడుకుల్లో స్తబ్ధత ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు మారడానికి సంబంధించి ఏదైనా అవకాశం లభిస్తే, వెంటనే అందుకు అంగీకరించాలి.
పరిహారం: ప్రవహిస్తున్న నీటిలో కొబ్బరికాయ వేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : పని ప్రాంతంలో పనులు నిదానంగా సాగుతాయి. పేమెంట్స్ వసూలు చేయడం, మార్కెటింగ్ పనులు చేయడంపై రోజంతా దృష్టి పెట్టండి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. ఉద్యోగస్తులు కొన్ని మార్పులకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.
పరిహారం: శ్రీయంత్రానికి పూజ చేసి దగ్గర ఉంచుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : వ్యాపార కార్యకలాపాలు సాధారణంగా ఉంటాయి. మీ పనిలో ఎక్కువ భాగం ఫోన్లోనే జరుగుతుంది. షేర్లు, స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి.
పరిహారం: పర్సులో వెండి నాణెం పెట్టుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభ రాశి (Aquarius) (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : పార్ట్నర్షిప్ బిజినెస్‌లో లాభాలు ఉంటాయి. అందుకే ఏ పనిలోనైనా మీ భాగస్వామి సహాయం తీసుకోండి, అది ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెటింగ్‌కు సంబంధించిన పనులను మీరు నిర్వహించడం సముచితంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీసు పాలసీల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి.
పరిహారం: చిన్నారులకు స్వీట్లు ఇవ్వండి. (ప్రతీకాత్మక చిత్రం)
మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రోజు మీ పూర్తి దృష్టిని మార్కెటింగ్, వర్క్ ప్రమోషన్‌పై పెట్టండి. కచ్చితమైన వ్యూహంతో పని చేయడం వల్ల మీ విజయావకాశాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను తీవ్రంగా పరిగణించండి. ఉద్యోగంలో చిన్నచిన్న సమస్యలు ఎదురవుతాయి, అయితే మీరు అవగాహనతో వాటికి పరిష్కారాన్ని కూడా కనుగొంటారు.
పరిహారం: కృష్ణుడి గుడికి వేణువును సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)