(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం) : గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు వివిధ రాశుల వారికి ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 1వ తేదీ (చైత్ర శుక్ల ఏకాదశి) శనివారం నాడు ఏయే రాశులకు ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
మేష రాశి (Aries) : ఆఫీస్‌లో ఆర్థికపరమైన పనులను ముందుకు తీసుకువెళ్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆఫీస్‌లో పని వేగం మెరుగ్గా ఉంటుంది. వర్క్ బిజినెస్ సాధారణంగా ఉంటుంది. లాజికల్ యాక్టివిటీస్ పెరుగుతాయి. చర్చలు, వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తిపరమైన ప్రయత్నాలు ఊపందుకుంటాయి.
పరిహారం: భైరవుడి గుడిలో తీపి నైవేద్యం పెట్టండి.
వృషభ రాశి (Taurus) : సీనియర్లు, అధికారులతో సమావేశం ఉంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ముఖ్యమైన విషయాలపై పని చేస్తారు. క్రియేటివ్‌గా వర్క్ చేస్తారు. వ్యాపారంలో మితిమీరిన ఉత్సాహానికి చెక్ పెట్టండి. అప్పు తీసుకోవద్దు. పెద్దలతో పద్ధతిగా నడుచుకుంటారు. స్మార్ట్ వర్కింగ్ స్ట్రాటజీ కొనసాగించండి. పరిహారం: దుర్గామాత ఆలయంలో దుర్గా చాలీసా పఠించండి.
మిథున రాశి (Gemini) : ఆఫీస్‌లో విజయం ఉంటుంది. అందుబాటులో ఉన్న వనరులపై శ్రద్ధ వహించండి. సంపదలో పెరుగుదల ఉంటుంది. అప్పు తీసుకోవడం మానుకోండి లేకపోతే తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. మీ వెనుక జరుగుతున్న కుట్రకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మీరు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో శుభం ఉంటుంది. పరిహారం: గణేశుడికి దూర్వా సమర్పించండి. గణేశ మంత్రాన్ని 108 సార్లు జపించండి.
కర్కాటక రాశి (Cancer) : ఆర్థిక పరిస్థితికి ఆటంకం కలగడం వల్ల భౌతిక విషయాలపై ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాలసీ రూల్స్ పాటించండి. భవన, వాహన కొనుగోలుకు అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన విషయాలపై పెద్దగా ఆలోచిస్తూ ఉండండి. పరిహారం: శ్రీకృష్ణునికి పంచదార మిఠాయిని సమర్పించండి.
సింహ రాశి (Leo) : వ్యాపారవేత్తలు ఆర్థిక, వాణిజ్య రంగంలో ఉత్తమ ప్రయత్నాలు చేస్తారు. ప్రమాదకర కార్యకలాపాలపై ఆసక్తి చూపవద్దు. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్స్ నుంచి నష్టం ఉంటుంది. కళా నైపుణ్యాలు బలపడతాయి. ప్రొఫెషనల్స్ వేగంగా ముందుకెళ్లేలా ఆలోచించండి.
పరిహారం: ఆవాల నూనె రాసిన రొట్టెను నల్ల కుక్కకు ఇవ్వండి.
తుల రాశి (Libra) : ఆఫీస్‌లో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ద్వారా, మీ కెరీర్, వ్యాపారాన్ని మెరుగుపరచగలుగుతారు. ఆదాయ, వ్యయాల బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. వృత్తి నిపుణులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. వివిధ ప్రయత్నాలు ఊపందుకుంటాయి. యాక్టివ్‌గా ఉంటారు. సమర్థత పెరుగుతుంది.
పరిహారం: మర్రిచెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి.
మకర రాశి (Capricorn) : ఆర్థిక లాభం పెరుగుతుంది. వ్యాపారస్తులు ప్రబలంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వృద్ధి, పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మెరుగవుతాయి. కీర్తి, గౌరవం పెరుగుతాయి. అనుకూల వాతావరణం వల్ల ఉత్సాహంగా ఉంటారు. ప్రణాళికలు ఊపందుకుంటాయి.
పరిహారం: బందీలుగా ఉన్న పక్షులను విడిపించండి.
కుంభ రాశి (Aquarius) :ఉద్యోగ వ్యాపారంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఆటంకాలు ఆటోమెటిక్‌గా తొలగిపోతాయి. టీమ్ వర్క్ పెరుగుతుంది. పరిచయాల వల్ల ప్రయోజనం పొందుతారు. పని పరిస్థితులు మెరుగుపడతాయి. లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేగవంతం చేస్తారు. మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నిపుణుల మద్దతు లభిస్తుంది.
పరిహారం: బందీలుగా ఉన్న పక్షులను విడిపించండి.
మీన రాశి (Pisces) : వృత్తిపరమైన విషయాలను పెండింగ్‌లో ఉంచడం మానుకోండి. పని వేగం మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సలహాతో పని చేస్తారు. ఖర్చులు, బడ్జెట్‌పై శ్రద్ధ వహించండి. వాణిజ్య వ్యాపారాలలో అప్రమత్తంగా ఉంటారు. ప్రొఫెషనల్ అసిస్టెంట్‌గా పని చేస్తారు. తెలివితక్కువ వారి పట్ల జాగ్రత్త వహించండి. మేనేజ్మెంట్ను ధిక్కరించడం మానుకోండి.
పరిహారం: తల్లికి తీపి వస్తువులు అందించండి.