(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) ఆస్ట్రాలజీ ఎక్స్పర్ట్స్ నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలను అంచనా వేస్తుంటారు. అక్టోబర్ 9వ తేదీ (ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి) ఆదివారం నాడు వివిధ రాశుల వారికి ధన జ్యోతిష్యం లేదా మనీ ఆస్ట్రాలజీ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం (అశ్వని, భరణి, కృత్తిక-1) : ఆఫీసులో పని చేస్తున్న క్రమంలో ఓపికగా, అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల పనిలో అనవసరంగా తల దూర్చకూడదు. నిర్లక్ష్యం వహించకూడదు. లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయుల సలహాలను అనుసరించండి. పరిశోధనకు సంబంధించిన విషయాల్లో ఈ రోజు మీరు భాగస్వామి అవుతారు. పని సాధారణంగా ఉంటుంది. పరిహారం: ఓం నమ:శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) :ఈ రోజు ఆర్థిక విషయాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. కొత్త కాంట్రాక్టులతో ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఖర్చులపైన శ్రద్ధ వహించాలి. విజయానికి మార్గం తెరుచుకుంటుంది. ఉమ్మడి పనులపై శ్రద్ధ వహిస్తారు. భూమి, నిర్మాణాల వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. పరిహారం: రామ మందిరంలో కూర్చొని రామ్ రక్షా స్తోత్రాన్ని పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : లాభం పొందడానికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత ఉండాలి. ఆర్థిక కార్యకలాపాలపైన క్రియాశీలతను కనబర్చాలి. బడ్జెట్‌ను నియంత్రణలో ఉంచుకోవాలి. వ్యాపారం మెరుగవుతుంది. అనుభవం ఉన్న వారి సలహా తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో మోసం జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. సుఖంగా ఉండాలి. పరిహారం: ఆంజనేయుడికి నెయ్యి దీపం పెట్టండి, హనుమాన్ చాలీసా పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఆర్థిక విషయాలపై మీకు శ్రద్ధ ఉంటుంది. వ్యాపారంలో అవకాశాలు పెరుగుతాయి. విశ్వాసం కలిగి ఉంటారు. క్రమపద్ధతిలో, అవగాహనతో ముందుకెళ్తారు. మేనేజ్మెంట్ నైపుణ్యం మెరుగవుతుంది. ముందుకు వెళ్లడానికి సంకోచించకూడదు. స్మార్ట్ వర్కింగ్ అలవాటు చేసుకోవాలి. వాణిజ్య విషయాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటాయి. పరిహారం: భైరవ దేవాలయంలో స్వీట్లు సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : మొండి పట్టుదలతో కూడిన అహం, అభిరుచిని వదిలేయండి. ఖర్చు పెట్టే విషయంలో బడ్జెట్ విషయంలో శ్రద్ధ వహించండి. ప్రణాళిక రూపొందించుకుని పని చేయండి. వ్యాపారంలో మీకు అదృష్టం కలిసొస్తుంది. ఎన్విరాన్మెంట్కు తగ్గట్లు అనుసరణ ఉంటుంది. వ్యక్తిగత విషయాల్లో వేగం ఉంటుంది. వ్యక్తిగత విజయాలపైనే మీ శ్రద్ధ ఉంటుంది. పనిలో మీరు ఉత్తమంగా కొనసాగుతారు. పరిహారం: పంజరాల్లో బందించిన పక్షులను విడిపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : లాభాల విస్తరణ అలానే చక్కగా కొనసాగుతుంది. అనుకున్నంత లాభం వస్తుంది. ప్రణాళిక ప్రకారమే నడుచుకుంటారు. పనిలో మీకు కావాల్సిన సమయం ఇస్తారు. పని ప్రదేశంలో మీ ఉద్యోగ సంబంధాలు మెరుగవుతాయి. ప్రతి ఒక్కరితో కనెక్టెడ్‌గా ఉంటారు. వ్యాపారంలో మీరే చొరవ తీసుకుంటారు. ఈ రోజు మీరు ట్రావెలింగ్ చేయవచ్చు. మీరు చేసిన ప్రయత్నాలతో మీరు ఈ రోజు విజయం సాధించవచ్చు. మీపైన మీకు నమ్మకం పెరుగుతుంది. వాణిజ్య సంబంధిత విషయాల్లో ఈ రోజు ఊపు ఉంటుంది. పరిహారం: హనుమాన్ చాలీసా లేదా సుందరకాండను ఏడు సార్లు పఠించండి.(ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : వృత్తిపరమైన కాంటాక్ట్స్ పెరుగుతాయి. వ్యాపారం మెరుగవుతుంది. సీనియర్లను కలుస్తారు. సంపద సమృద్ధిగా ఉంటుంది. మీ జీవనం మెరుగవుతుంది. వాణిజ్య సంబంధిత విషయాల్లో మీకు ఆసక్తి పెరుగుతుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారు. వ్యాపారంలో ఈ రోజు పెరుగుదల ఉంటుంది. పరిహారం: మర్రి చెట్టు కింద నెయ్యి దీపం పెట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) :నిర్ణయాలు తీసుకోవడంలో కంఫర్టబుల్‌గా ఉంటారు. ఆర్థికపరంగా ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది. అనుకున్న దాని కంటే ఉత్తమంగా పనులు జరుగుతాయి. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తారు. వ్యాపారంలో మీరు ఆశించిన విధంగానే ఫలితాలు ఉంటాయి. పనిలో మీరు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారు. కెరీర్ ఎదుగుదల అలానే కొనసాగుతుంది. తెలివిగా వ్యవహరిస్తారు. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : వ్యాపారంలో అవనసర విషయాలను మర్చిపోవాలి. పుకార్లకు లొంగకూడదు. ఆఫీసులో పని చేయకుండా వ్యతిరేక కార్యచరణ కనబర్చవచ్చు. వ్యాపారంలో అంకితభావం పెరుగుతుంది. పనులలో అప్రమత్తత కొనసాగించాలి. బడ్జెట్‌పైన శ్రద్ధ పెరుగుతుంది. మోసం బారిన పడి బాధితులు కావద్దు. పరిహారం: నల్లకుక్కకు ఆవాల నూనె రాసిన రోటీలు పెట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) :ఈ రోజు పని మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తారు. వృత్తిపరమైన విషయాల్లో పురోగతి మార్గాన ముందుకెళ్తారు. ప్రతి ఒక్కరి నుంచి సహకారం పొందుతారు. వ్యవస్థను బలోపేతం చేస్తారు. వాణిజ్యపరమైన పనుల్లో వేగం పెంచుతారు. అనుకున్న టైమ్‌కు పని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. పరిహారం: శ్రీకృష్ణుడికి చక్కెరతో చేసిన తీపి పదార్థాలు సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) :ముఖ్యమైన ప్రతిపాదనలు ఈ రోజు మీ వద్దకు వస్తాయి. ప్రతి ఒక్కరి సహకారం ఈ రోజు మీకు ఉంటుంది. మీ కార్యాచరణ ప్రణాళికలు సజావుగా ముందుకు సాగుతాయి. పనిలో సామర్థ్యం పెరుగుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. ప్రత్యర్థులు తగ్గుతారు. ఆకర్షణీయమైన ఆఫర్లు మీ వద్దకు వస్తాయి. చర్చలతో ప్రయోజనం ఉంటుంది. విశ్వాసం పెరుగుతుంది. పరిహారం: విఘ్నేశ్వరుడికి దుర్వా సమర్పించండి, గణేశ్ మంత్రాన్ని 108 సార్లు జపించండి.(ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : పనిలో అడ్డంకులు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయి. ధైర్యం పెరుగుతుంది. చురుకుగా పని చేసి అన్ని రంగాలను ప్రభావితం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలు సృష్టించుకుంటారు. పదవి ప్రతిష్ట పెరగడంతో పాటు అవకాశాలు పెరుగుతాయి. వేగంగా ఉంటారు. అయితే తొందరపాటు వద్దు. ఏదైనా యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. పరిహారం: దుర్గామాత ఆలయంలో దుర్గా చాలీసా పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)