(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : ఆయా రాశుల వారికి ధనయోగం ప్రాప్తిస్తుంది. ఉద్యోగులకు ఆశించిన పదవులు దక్కే అవకాశం ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో ఉద్యోగులు ఆఫీసుల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. వ్యాపారంలో తగు జాగ్రత్తలు పాటించాలని ప్రఖ్యాత జ్యోతిష్య నిపుణులు భూమిక కలాం సూచిస్తున్నారు. జనవరి 17న (మంగళవారం) నాడు ఆయా రాశుల వారికి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
వృషభ రాశి (Taurus) : ప్రభుత్వ ఉద్యోగులు వృత్తిపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్లో మరింత లక్షణంగా పనిచేయండి. ఉద్యోగుల నుంచి మీకు చక్కని సహకారం లభించొచ్చు. పని ప్రదేశంలో మీ వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోండి. చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. పరిహారం: ఆంజనేయ స్వామి ఎదుట నెయ్యి దీపాన్ని వెలిగించండి.
మకర రాశి (Capricorn) : వ్యాపారంలో పోటీని తట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాలి. కోర్టు వివాదాలేమైనా ఉంటే మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోండి. పనిలో ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి. నిర్దిష్ట లక్ష్యాలను పూర్తి చేయడం వల్ల ఉద్యోగులు బోనస్ పొందే అవకాశం ఉంది. పరిహారం: భైరవ ఆలయంలో కొబ్బరికాయ కొట్టండి.
మీన రాశి (Pisces) : ఉద్యోగులు ఆఫీసులో ప్రశాంతతను కొనసాగించాలి. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలంగా స్పందించాలి. వ్యాపార కార్యకలాపాల్లో అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది. తాహత్తుకు మించి అప్పు చేయకండి. వాయిదా వేసుకున్న పనుల్ని ప్రారంభించండి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. పరిహారం: అనుగుణమైన పసుపు వస్తువులను దానం చేయండి.