(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : కొంతమందికి ఆర్థికంగా కలిసొస్తుంది. మరికొందరికి ఉద్యోగాల్లో కలిసొస్తుంది. ఇంకొందరికి వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఇలా నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్య నిపుణులు ధన జ్యోతిష్యాన్ని అంచనా వేశారు. జనవరి 18 (బుధవారం) నాడు ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
సింహ రాశి (Leo) : ఈ సమయంలో వ్యాపార కార్యకలాపాలపై మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో ఒక రకంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగుల కార్యకలాపాలను పర్యవేక్షించండి. ఆఫీస్‌లో మీ ఇమేజ్, రెప్యుటేషన్ పెరుగుతుంది, మీరు కొన్ని ముఖ్యమైన అధికారాలను కూడా పొందవచ్చు. పరిహారం : సూర్య భగవానునికి నీరు సమర్పించండి.
కన్య రాశి (Virgo) : వ్యాపారంలో చాలా బాధ్యతలు, పనిభారం ఉంటాయి. ఈ సమయంలో ఇల్లు, కుటుంబ సమస్యల నుంచి దృష్టిని మళ్లించి, మీ వ్యాపారంపై దృష్టి పెట్టండి. ఉద్యోగ వృత్తిలో ఉన్న వ్యక్తులు వారి కోరిక మేరకు లొకేషన్‌ను మార్చుకోవచ్చు. కాబట్టి మీ లక్ష్యాన్ని గుర్తించి, కష్టపడండి. పరిహారం : వినాయకుడికి లడ్డూలు సమర్పించండి.
తుల రాశి (Libra) : ప్రస్తుతం వ్యాపారంలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదు. అయితే పార్ట్నర్షిప్ బిజినెస్‌లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు భరించగలిగే దానికంటే ఎక్కువ డబ్బును ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేయవద్దు. బడ్జెట్ విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో బాస్, సహోద్యోగులతో మీ రిలేషన్ మెరుగుపడుతుంది. పరిహారం : విష్ణువును పూజించండి.
మకర రాశి (Capricorn) : మీలాంటి వ్యాపారుల నుంచి కొనసాగుతున్న పోటీ కారణంగా మీ డైలీ రొటీన్ కొంత గందరగోళంగా ఉంటుంది. అయితే మీ గెలుపు ఖాయం. దీని వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎక్కువ శ్రమతో మీరు మీ పనిపై శ్రద్ధ చూపగలుగుతారు. లాభాల మూలాలు కూడా పెరుగుతాయి. పరిహారం : పసుపు వస్తువులను దానం చేయండి.
కుంభ రాశి (Aquarius) : వ్యాపార కార్యకలాపాలు సక్రమంగా సాగుతాయి. మీ సామర్థ్యంతో మీరు కొన్ని స్పెషల్ కాంట్రాక్ట్స్ పొందుతారు. స్టేట్ వర్క్స్‌లో అడ్డంకులు ఏర్పడిన తర్వాతే సమస్య పరిష్కారమవుతుంది. అందుకే కొంత మంది అధికారుల సాయం తీసుకోండి. ఆఫీస్‌లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. పరిహారం : శివలింగానికి నీటితో అభిషేకం చేయండి.