(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వివిధ రాశుల వారి వ్యాపారం, ఉద్యోగంతో పాటు ఆర్థిక పరిస్థితులను జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తుంటారు. నవంబర్ 30వ తేదీ (మార్గశివర శుద్ధ సప్తమి) బుధవారం నాడు వివిధ రాశుల వారికి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
మేష రాశి (Aries) (అశ్వని, భరణి,కృత్తిక -1) : వ్యాపార విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఏ పని చేపట్టినా సానుకూల దృక్పథం తో పని చేయాలి. ఇది వ్యాపారానికి అనుకూలమైన సమయం. టీమ్‌వర్క్ మీకు కలిసి వస్తుంది. బృందంతో కలిసి పనిచేయడం వల్ల మీరు మంచి లాభాలు ఆర్జిస్తారు. పరిహారం:- శ్రీరామ నామాన్ని జపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఈరోజు, మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతారు. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. తద్వారా ఇది మీ వ్యాపారానికి హాని కలిగిస్తుంది. చాడీలు చెప్పే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు ఈ రోజు వారి పనితో సంతృప్తి చెందుతారు.
పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : ఈరోజు కొత్త పెట్టుబడులను పెట్టడం మానుకోండి. మీరు మీ ఆర్థిక పరిస్థితి గురించి లోతుగా అధ్యయనం చేసి.. భవిష్యత్తు అవసరాల కోసం కొంత డబ్బును ఆదా చేయండి. బంగారం లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడం కలిసొస్తుంది.
పరిహారం:- పీపాల్ చెట్టుకు నీరు పోయండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటక రాశి (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : ఉద్యోగస్థులు తమ సహోద్యోగులతో కలిసి పనిచేయవలసి ఉంటుంది. మీ సమన్వయం, టీమ్ వర్క్ మంచి ఫలితాలనిస్తుంది. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు ఊహించని విధంగా లాభాలు పొందవచ్చు.
పరిహారం: బార్లీని ఆవుకి తినిపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహ రాశి (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) : మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వృత్తిపరమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. మీపై, మీ పని శైలిపై ప్రశంసలు దక్కుతాయి. ఆర్థికంగా, ఈ రోజు మీకు బాగా కలిసొస్తుంది.
పరిహారం:- రాత్రి పడుకునేటప్పుడు రాగి పాత్రలో నీటిని నింపి, ఉదయాన్నే ఇంటి ముందు చెట్టుపై పోయండి.(ప్రతీకాత్మక చిత్రం)
కన్య రాశి (Virgo) య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగాలు ఒత్తిడిని కలిగిస్తాయి. కానీ మీ పని పట్ల అంకితభావంతో ఒత్తిడిని అధిగమిస్తారు.
పరిహారం: ఒక గిన్నెలో పాలు పోసి కుక్కకు తాగించండి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఆఫీసులో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సామాజిక సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇది మంచి పరిచయాలకు దారి తీస్తుంది. పాజిటివ్ ఆలోచనలతో కొత్త పనులను ప్రారంభించండి.
పరిహారం:- పాఠశాల, హాస్టల్ లేదా అనాథాశ్రమంలో ఆర్థిక సహాయం, పుస్తకాలు లేదా ఉపయోగకరమైన వస్తువులు విరాళంగా ఇవ్వండి.(ప్రతీకాత్మక చిత్రం)
ధనస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) :వ్యాపారం చేసేవారు అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టవద్దు. పుకార్లను అసలు నమ్మకండి. మీ కంపెనీ లాభాల పెరుగుదల కోసం అంకితభావంతో పని చేయండి. కార్యకలాపాల్లో అప్రమత్తత పాటించండి. బడ్జెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టండి.
పరిహారం: ఓం నమః శివాయ శ్లోకాన్ని 108 సార్లు జపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : ఈ రోజు ఏ పని చేపట్టినా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. వృత్తిపరమైన పురోగతిని కొనసాగిస్తారు. వ్యాపార కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి.
పరిహారం: రామ మందిరం లో కూర్చుని రామరక్షా స్తోత్రాన్ని పఠించండి.(ప్రతీకాత్మక చిత్రం)
కుంభ రాశి (Aquarius) (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ఈ రోజు మీకు, మీ ఆలోచనలకు మద్దతు లభిస్తుంది.మీ ప్రణాళికలు సజావుగా ముందుకు సాగుతాయి. పని సామర్థ్యం పెరుగుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. ప్రత్యర్థులు మీతో సంధి చేసుకుంటారు. ఆకర్షణీయమైన ఆఫర్లు, అవకాశాలు లభిస్తాయి.
పరిహారం: లక్ష్మీ స్తోత్రం జపించండి.(ప్రతీకాత్మక చిత్రం)
మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రోజు మీరు మరింత ధైర్యాన్ని క్రోడీకరించుకొని చురుకుగా పని చేస్తారు. అన్ని రంగాల్లో ప్రభావం చూపుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. అయితే, తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టం కలుగజేస్తాయి. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
పరిహారం: శ్రీ కృష్ణుడికి పంచదార మిఠాయి సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)