(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : ఓ రాశివారు ఆఫీసు పనులు వేగవంతం చేయాలి. మరో రాశివారు వ్యాపార లక్ష్యాలను అందుకుంటారు. నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. నవంబర్ 29వ తేదీ (మార్గశిర శుద్ధ షష్ఠి) మంగళవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం (అశ్వని, భరణి,కృత్తిక -1) :మీరు ఆఫీస్ పనులను వేగవంతం చేయాలి. క్రియేటివ్ వర్క్ లాభం చేకూరుస్తుంది. పనిలో అనుకూలత ఉంటుంది. సహోద్యోగులతో సమన్వయం పెరుగుతుంది. అది మీ కెరీర్‌కు ప్రయోజనకరంగా మారుతుంది. మీరు వ్యాపార పనులపై దృష్టి సారిస్తారు. ఎంతో ఆసక్తితో వ్యాపార పనులు చేస్తారు. పరిహారం: శివుడికి నీరు సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : ఆకర్షణీయమైన ఆఫర్లను అందుకుంటారు. ఈ రోజు మీ ప్రణాళికలు బలపడతాయి. వ్యాపారంలో రిస్క్ తీసుకునే ధైర్యం పెరుగుతుంది. కమర్షియల్ సెక్టార్లో మీదైన ప్రత్యేక ఆలోచనతో పనులు చేయాలని ఉత్సాహపడతారు. ఫలితాలు ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉంటాయి. పరిహారం: సరస్వతి మాతకు తెల్ల పూల మాల సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగ వ్యాపారాల్లో దృష్టి సారిస్తారు. తొందరపడకండి, రిస్కీ పనులకు దూరంగా ఉండండి. ప్రణాళికల అమలుకు ఆసక్తి చూపుతారు. ఓర్పు, నమ్మకంతో ముందుకు సాగుతారు. పనిలో అత్యాశ, ప్రలోభాలకు గురికావద్దు. ఆర్థిక ప్రయత్నాలలో జాగ్రత్త పెరుగుతుంది. పరిహారం: కపిల గోవుకి బెల్లం తినిపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : మీ ఆఫీస్‌లో ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు మెరుగుపడతాయి. ఈ రోజు మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగుతుంది. సంపద పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు అందుకుంటారు. పరిహారం: సాయంత్రం రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించండి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) :మీరు చేస్తున్న పనులన్నింటిలోనూ విజయాన్ని పొందుతారు. చాలా వరకూ మీకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ప్రణాళికలు రూపు దిద్దుకుంటాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారం మెరుగవుతుంది, వేగంతో ముందుకు సాగుతుంది. పరిహారం: చీమలకు పిండి పెట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : మీ కంపెనీ కోసం నిపుణుల ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తారు. అడ్వైజర్లతో టచ్‌లో ఉండటం మంచిది. ఆఫీస్‌లో అవగాహన, వినయంతో పనిని పూర్తి చేస్తారు. పరిస్థితులు నియంత్రణలో ఉంటాయి. వ్యాపారంలో పనులు సాధారణంగా ఉంటాయి. విస్తరణ ప్రణాళికలపై దృష్టి సారిస్తారు. పరిశోధనలపై ఆసక్తి చూపుతారు. పరిహారం: నల్ల కుక్కకి స్వీట్ పెట్టండి.(ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : వ్యాపార పనుల్లో అవగాహన పెరుగుతుంది. పని విషయాలలో సహనం ప్రదర్శిస్తారు. అపరిచితులను సులభంగా నమ్మకండి. అప్రమత్తంగా ఉండండి. ప్రణాళికలు కార్యాచరణ దిశగా ముందుకు వెళతాయి. సమయ పాలనపై దృష్టి సారిస్తారు. ప్రలోభాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలపై నియంత్రణ పెరుగుతుంది. పరిహారం: పేదవారికి తెల్లని వస్తువులు దానం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : వ్యాపార పనుల్లో మెరుగ్గా రాణిస్తారు. ఇవాళ మీ వ్యాపారంలో గొప్ప డీల్స్ పొందుతారు. ఇది మీ కెరీర్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆఫీస్‌లో చేయాల్సిన వాటిని వేగంగా పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు కొత్త కెరీర్ అవకాశాలు లభిస్తాయి. మున్ముందు అవి కలిసి వస్తాయి. విజయం కలిగే సూచనలున్నాయి. పరిహారం: దుర్గ గుడిలో నేతితో దీపం వెలిగించండి. (ప్రతీకాత్మక చిత్రం)