(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) జ్యోతిష్య నిపుణులు నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారికి సంబంధించిన పలు విషయాలు అంచనా వేస్తుంటారు. అందులో వారి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, డబ్బుకు సంబంధించిన విషయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. సెప్టెంబర్ 14వ తేదీ బుధవారం నాడు మనీ ఆస్ట్రాలజీ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రోజు మీరు అంకిత భావంతో మీ పనులు చేయాలి. మీ సహోద్యోగితో మీకు గొడవలు జరిగి మానసిక ఆందోళన అలానే ఉండిపోవచ్చు. మీకు గొంతు నొప్పి రావచ్చు. స్నేహితులు మీకు మంచి సలహాలు ఇవ్వొచ్చు. వాటి ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదృష్ట రంగు: ఆకు పచ్చ అదృష్ట సంఖ్య: 8 పరిహారం: ఆవుకు పచ్చిగడ్డి వేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : అనుకోని మార్పుల వల్ల మీకు ఈ రోజు అంతా అయిపోయిందని అనిపిస్తుంది. ఈ రోజు మీ అదృష్టాన్ని పరీక్షించుకోకపోవడమే ఉత్తమం. మీరు అతిముఖ్యమైనదిగా భావించే విషయాన్ని మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది. మీ తప్పులను ఒకసారి పరిశీలించుకోండి. అదృష్ట రంగు: తెలుపు అదృష్ట సంఖ్య: 3 పరిహారం: దుర్గాదేవి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : ఈ రోజు మీరు చాలా మందితో కలిసి, కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. నూతన ప్రయోగాల ద్వారా మీకు ఈ రోజు విజయం లభిస్తుంది. కానీ, ఇతరుల అభిప్రాయాలను మీరు గమనించాల్సి ఉంటుంది. మీ శ్రమతో మీరు అనుకున్న మార్పును తీసుకురాగలుగుతారు. మీరు పడే కష్టంతో మీకు న్యాయం లభిస్తుంది. అదృష్ట రంగు: నీలి రంగు అదృష్ట సంఖ్య: 8 పరిహారం: పేదవాడికి ఏదైనా వస్తువు దానం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) మీరు ఈ రోజు మీతో ఉన్న బంధుత్వాలు విడదీయరానివని భావిస్తారు. అభద్రతా భావంతో మీలో కొంత నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. జీవితంలో మరింత ముందుకు సాగాలని భావన కలుగుతుంది. ఈ విషయమై కొంత స్ట్రెస్ ఫీలవుతారు. అదృష్ట రంగు: గ్రే అదృష్ట సంఖ్య: 8 పరిహారం: పక్షికి ధాన్యం పెట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : మీ చుట్టు పక్క ఉన్న వ్యక్తులకు కోపం వస్తుంది. తద్వారా మీరు కూడా కోపోద్రిక్తులవుతారు. మీ మైండ్‌ను ప్రశాంతంగా ఉంచుకోవాలి. అత్యవసర పనులును ఈ రోజు నుంచి వాయిదా వేసుకోండి. అలా చేయడం ద్వారా మీ మూడ్ చేంజ్ అవుతుంది. ఈ రోజు మీరు చిన్న సమస్యను పక్కనబెట్టి పెద్ద సమస్యను చూస్తుంటారు. అదృష్ట రంగు: లైట్ గ్రీన్ అదృష్ట సంఖ్య: 3 పరిహారం: నల్ల కుక్కకు ఏదైనా తీపి తినుబండారం ఇవ్వండి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : ఈ రోజు మీకు ఫేవర్‌గా ఉంటుంది. మీలో ఆధ్యాత్మిక పనులు చేయాలనే తపన కలుగుతుంది. సమాజంతో పాటు కుటుంబంలో మీకు ఈ రోజు గౌరవం లభిస్తుంది. జీవితంలోని అన్ని విషయాలను మీరు బ్యాలెన్స్ చేయగలరని అనిపిస్తుంది. పాజిటివ్ వేలో రోజంతా గడుస్తుంది. అదృష్ట రంగు: బ్లూ అదృష్ట సంఖ్య: 2 పరిహారం: దివ్యాంగుడికి అన్నదానం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఈ రోజు మిమ్మల్ని భావోద్వేగ ఆలోచనలు చుట్టుముడతాయి. తద్వారా మీకు అశాంతి కలుగుతుంది. అందుచేత మీరు నెగెటివ్ ఎనర్జీకి దూరంగా ఉండటం ఉత్తమం. మీ రిలేటివ్స్‌తో మీకు ఈ రోజు అపార్థాలు వస్తాయి. మీ సొంత నిర్ణయం ఇతరులకు చెప్పడానికి ఇబ్బందులు పడతారు. ఫలితంగా మీకు మెంటల్ స్ట్రెస్ ఏర్పడుతుంది. అదృష్ట రంగు: తెలుపు అదృష్ట సంఖ్య: 10 పరిహారం: చీమల కోసం చక్కెర వేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) :ఈ రోజు మీ ప్రయాణం కాంతిపథంలో ఉంటుంది. మూస పద్ధతిలో కాకుండా మీకు మీరు సొంతంగా ఓ మార్గాన్ని కనుగొని అందులో కొనసాగుతారు. మీరు ఎప్పటి నుంచో కొన్ని విషయాల్లో స్పష్టత లేదని పక్కనబెట్టిన నిర్ణయాలను ఈ రోజు తీసుకుంటారు. వాటిలో మీకు స్పష్టత వస్తుంది. అదృష్ట రంగు: బంగారు రంగు అదృష్ట సంఖ్య: 10 పరిహారం: సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం పెట్టండి (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : :మీరు చేసిన పూర్వ పనుల గురించి మీరు సమీక్షించుకోవాలి. మీ ప్రవర్తన, పని పట్ల అంకిత భావం ప్రదర్శించడం ద్వారా మీకు భవిష్యత్తులో విజయం వస్తుంది. మీకు ఈ రోజు సంతోషం కలుగుతుంది. మీరు అనుకున్నట్లుగా అన్ని పనులు జరుగుతాయి. ఫలితంగా మీకు టెన్షన్ ఉండబోదు. అదృష్ట రంగు: స్కై బ్లూ అదృష్ట సంఖ్య: 3 పరిహారం: ఎరుపు రంగు ఆవుకు బెల్లం తినిపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : మీకు ఈ రోజు మొత్తంగా పాజిటివ్‌గా ఉంటుంది. అత్యంత శుభప్రదమైన ఈ రోజున మీరు నూతన పనులు ప్రారంభించడంతో పాటు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని అందుకోసం మీరు కష్టపడి పని చేస్తారు. అదృష్ట రంగు: పసుపు అదృష్ట సంఖ్య: 1 పరిహారం: సరస్వతి దేవికి తెల్లటి పూలతో చేసిన మాల సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) :ఈ రోజు మీకు నూతన ఉత్సాహం, ప్రేరణ కలుగుతుంది. మీ శక్తిని చూసి మీకు మీరే సంతోషపడతారు. ఈ రోజు నూతన పనులు ప్రారంభించడం ఉత్తమం. నూతన పనులు ప్రారంభిస్తారు కూడా. పాజిటివిటీ వలన మీ జీవితానికి నూతన దిశ లభిస్తుంది. అదృష్ట రంగు: బ్లూ అదృష్ట సంఖ్య: 5 పరిహారం: రాముడి గుడికి జెండా సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఈ రోజు మిమ్మల్ని విజయం వరిస్తుంది. సమాజంలో మీకు పరపతి పెరుగుతుంది. మిమ్మల్ని ఆదర్శ ప్రాయుడిగా భావిస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచించే క్రమంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చక్కబెట్టుకోవడం మంచిది. అదృష్ట రంగు: తెలుపు అదృష్ట సంఖ్య: 7 పరిహారం: ఆంజయనేయుడి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి. (ప్రతీకాత్మక చిత్రం)