(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వివిధ రాశుల వారి వ్యాపారం, ఉద్యోగం తో పాటు ఆర్థిక పరిస్థితులను జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తుంటారు. డిసెంబర్ 1వ తేదీన (మార్గశిర శుద్ద అష్టమి) గురువారం నాడు వివిధ రాశుల వారికి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
మేష రాశి (Aries) (అశ్వని, భరణి,కృత్తిక -1) : ఆర్థిక లావాదేవీల్లో క్లారిటీ మెయింటైన్ చేయాలి. ఆఫీస్ వర్క్‌ను ఆలస్యం చేయకండి. ఈరోజు మీరు వ్యాపారంలో లాభాలను పొందుతారు. లక్ష్య సాధనకు ప్రయత్నాలు పెరుగుతాయి. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అత్యాశ, ప్రలోభాలకు గురికావద్దు. పరిహారం: చిన్నారులకు స్వీట్లు అందించండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : వ్యాపారంలో లాభాలు, ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులు చిన్న మొత్తంలో పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక విషయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తారు. వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. పరిహారం: గురువు లేదా పెద్దలను గౌరవించండి. . (ప్రతీకాత్మక చిత్రం)
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : వర్క్‌ప్లేస్‌లో సక్సెస్ రేట్ బాగుంటుంది. దీంతో ఆర్థిక, కమర్షియల్ పనులు ఊపందుకుంటాయి. వర్క్ ప్లేస్‌లో సానుకూలత ఉంటుంది. అయితే ఉత్తమ పనితీరు కనబరచాల్సి ఉంటుంది. ఆర్థికంగా పొదుపు చేసే అవకాశాలు ఉంటాయి. పరిహారం: పర్స్‌లో వెండి నాణెం ఉంచుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటక రాశి (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : ఆఫీస్‌లో ముఖ్యమైన ప్రాజెక్టులపై ఉద్యోగులు యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. ఈరోజు మీరు ఊహించని లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు శుభ ఫలాలు అందుతాయి. మిమ్మల్ని ఇతరులు ప్రోత్సహిస్తారు. లాభాల విస్తరణపై దృష్టి సారిస్తారు. పరిహారం: శ్రీ యంత్రాన్ని పూజించి, మీవద్ద ఉంచుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహ రాశి (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) : కమర్షియల్ పనుల్లో స్వార్థంగా ఉండకండి. ఆఫీస్‌లో యాక్షన్ ప్లాన్స్ ఊపందుకుంటాయి. ఉద్యోగంలో మీకున్న అనుభవానికి తగిన ప్రయోజనం పొందుతారు. వ్యాపారాన్ని సులభంగా మేనేజ్ చేయండి. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారించండి. బిజినెస్‌లో విజయం సాధించే అవకాశం ఉన్నందున పెద్ద ప్లాన్ అమలు చేయండి. పరిహారం: పని ప్రదేశంలో గణేశుడిని పూజించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య రాశి (Virgo) య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : కమర్షియల్ రంగంలో ముందుచూపుతో సాగుతారు. ముందుగా టార్గెట్‌ను వేగంగా పూర్తి చేయాలి. కెరీర్ అవకాశాలు పెరుగుతాయి. మీ వ్యాపారంలో లాభాల శాతం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. వర్క్ బిజినెస్‌లో బెటర్‌గా పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. పరిహారం: పారుతున్న నీటిలో కొబ్బరికాయను వదిలేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఈ రోజు మీ పెట్టుబడిలో నష్టపోయే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ లేదా క్రిప్టోలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఆర్థిక విషయాలపై నియంత్రణ పెంచుకోండి. వర్క్ బిజినెస్‌లో అవగాహన పెంచుకోండి. పని విషయాలలో సహనంగా ఉండాలి. ఆఫీస్‌లో సహోద్యోగులు సహకారం అందింవచ్చు. పరిహారం: అనాథాశ్రమానికి ఆహారాన్ని దానం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
ధనస్సు రాశి (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) :ఆఫీసులో ముఖ్యమైన విషయాల్లో తొందరపడకండి. పెట్టుబడికి సంబంధించి సలహాదారులను సంప్రదించండి. వ్యాపారస్తులు వర్క్‌లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత ఖర్చులపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. క్రమశిక్షణతో పనిచేయాల్సి ఉంటుంది. పొదుపుపై దృష్టిసారించండి. పరిహారం: శ్రీకృష్ణునికి పంచదార మిఠాయిని సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : ఈ రోజు మీరు చేసే ప్రయత్నాల కారణంగా మీ వృద్ధికి అవకాశాలు వస్తాయి. వర్క్ బిజినెస్‌లో సంప్రదింపులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో దైర్యంతో పనులు చేస్తారు. ఫీల్డ్‌లో సానుకూల సమయాన్ని గరిష్టంగా వినియోగించుకోండి. ప్రొఫెషనల్ ఎఫర్ట్స్ కొనసాగించండి. వివిధ రకాల లాభదాయక వనరులు మీ దరికి వస్తాయి. పరిహారం: పెద్దల ఆశీస్సులు తీసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
కుంభ రాశి (Aquarius) (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) : ఈ రోజు వ్యాపారంలో విజయం సాధిస్తారు. బిజినెస్ అద్భుతమైన వృద్ధిని పొందుతుంది. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి ఉత్సాహంగా ఉంటారు. వర్క్‌ప్లేస్‌లో లాభం ఉంటుంది. సేవా రంగంలో మెరుగ్గా రాణిస్తారు. పరిహారం: శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు ఓపెన్ అవుతాయి. ఆఫీస్‌లో వ్యక్తులు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆఫీసులో ఉన్నతాధికారులు ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. ఆఫీస్‌లో సానుకూలత ఉంటుంది. సంపదలో పెరుగుదల ఉంటుంది. పరిహారం: కృష్ణుని ఆలయంలో ఫ్లూట్ సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం)