(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : Money Astrology (ధన జ్యోతిష్యం) : గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు వివిధ రాశుల ఆర్థిక వ్యవహారాలను అంచనా వేస్తుంటారు. మార్చి 8 (ఫాల్గుణ బహుళ పాడ్యమి) బుధవారం నాడు అన్ని రాశులకు ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
కన్య రాశి (Virgo) : వ్యాపారంలో పని పట్ల సహోద్యోగుల పూర్తి అంకితభావం ఉంటుంది, మీ ఆధిపత్యం కూడా అలాగే ఉంటుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఒడిదుడుకుల్లో స్తబ్ధత ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు మారడానికి సంబంధించి ఏదైనా అవకాశం లభిస్తే, వెంటనే దాన్ని అంగీకరించాలి.
పరిహారం: ప్రవహిస్తున్న నీటిలో కొబ్బరికాయ వేయండి.
వృశ్చిక రాశి (Scorpio) : వర్క్ ప్లేస్‌లో పనులు కొంత నిదానంగా సాగుతాయి. పేమెంట్స్ వసూలు చేయడం, మార్కెటింగ్ పనులు చేస్తూ రోజంతా గడపండి. దీనివల్ల ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. ఉద్యోగస్తులు కొన్ని మార్పులకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.
పరిహారం: శ్రీయంత్రానికి పూజ చేసి, దాన్ని మీ దగ్గర ఉంచుకోండి.
కుంభ రాశి (Aquarius) : పార్ట్నర్షిప్ వర్క్స్‌లో లాభదాయకమైన పరిస్థితి ఉంది. అందుకే ఏ పనిలోనైనా మీ భాగస్వామి సహాయం తీసుకోండి, అది ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెటింగ్‌కు సంబంధించిన పనులను మీరు నిర్వహించడం సముచితంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీస్ పాలసీల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి.
పరిహారం: చిన్నారులకు స్వీట్లు ఇవ్వండి.
మీన రాశి (Pisces) : ఈ రోజు మీ పూర్తి దృష్టిని మార్కెటింగ్, వర్క్ ప్రమోషన్‌పై పెట్టండి. కచ్చితమైన వ్యూహంతో పని చేయడం వల్ల మీ విజయావకాశాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను తీవ్రంగా పరిగణించండి. ఉద్యోగంలో చిన్నచిన్న సమస్యలు ఎదురవుతాయి, అయితే మీరు అవగాహనతో దానికి పరిష్కారాన్ని కనుగొంటారు.
పరిహారం: కృష్ణుడి గుడికి వేణువును సమర్పించండి.