(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology - దన జ్యోతిష్యం | నక్షత్రాల గమనం ఆధారంగా ఆయా రాశుల వారి వ్యాపారం, వృత్తి, ఉద్యోగం డబ్బుకు సంబంధించిన విషయాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. అక్టోబర్ 10వ తేదీ (ఆశ్వీయుజ శుద్ద పాడ్యమి) సోమవారం నాడు వివిధ రాశుల వారికి ధన జ్యోతిష్యం లేదా మనీ ఆస్ట్రాలజీ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం)
మేషం (అశ్వని, భరణి, కృత్తిక-1) : ఈ రోజు మీరు నిర్మాణ పనులను ప్రోత్సహిస్తారు. వ్యాపారంలో కదలిక ఉంటుంది. ప్రతి ఒక్కరినీ మీ వెంట తీసుకెళ్తారు. చర్చల తర్వాత ఒప్పందాలు జరుగుతాయి. పరిశ్రమలు, వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు రాణిస్తారు. లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసంతో చేరుకుంటారు. వ్యాపారంలో ఉన్న వారికి ఈ రోజు ముఖ్యమైన కాంట్రాక్టులు వస్తాయి. పరిహారం: పరమ శివుడి చాలీసా పఠించండి (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) :ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తంగా ఉంటారు. వివిధ విషయాల్లో నిర్లక్ష్యం వహించకూడదు. పేపర్ వర్క్‌లో జాగ్రత్త వహించాలి. వ్యాపారం సాధారణంగానే ఉంటుంది. ఆలోచన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. ప్రిపరేషన్‌తో ముందుకు కొనసాగుతారు. పరిహారం: సరస్వతీ దేవిని పూజించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : పని వాతావరణం మెరుగుపడుతుంది. అవసరమైన పనుల్లో వేగం పెంచుతారు. వృత్తి విద్యలో చేరుతారు. అవసరమైన సమాచారాన్ని గ్రహిస్తారు. వ్యాపారంలో పెద్ద పని అనేది మంచి లాభానికి సంకేతం. పోటీతత్వం పెరుగుతుంది. అవకాశాలు అలానే ఉంటాయి. పరిహారం: తెలుపు రంగు వస్తువులను దానం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)వాణిజ్య పనిలో భావోద్వేగాన్ని, అజాగ్రత్తను వదిలేయండి. వివిధ విషయాల్లో పని సుఖంగా ఉంటుంది. స్వార్థం, అహాన్ని వదిలేయండి. ప్రశాంతంగా ఉండి నియమాలు పాటిస్తారు. వ్యాపారంలో కెరీర్ యాక్టివ్‌గా ఉంటుంది. లాభం సగటుగా ఉంటుంది. ఉన్నత శ్రేణి అధికార వర్గ సహకారం ఉంటుంది. పరిహారం: పేదవాడికి ఎరుపు పండ్లను దానం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : పని ప్రదేశంలో మీ నమ్మకాన్ని కాపాడుకుంటారు. ఎలాంటి పుకార్లకు లొంగకూడదు. లాభం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్ద లక్ష్యాలను సాధిస్తారు. వృత్తిపరమైన క్రియాశీలతను కొనసాగిస్తారు. ప్రజా పనుల్లో నిమగ్నమవుతారు. వ్యాపారంలో అలానే అంచున కొనసాగుతారు. మీ అభిప్రాయాన్ని తెలిపేందుకు సంకోచించకూడదు. పరిహారం: నిస్సహాయులకు అన్నదానం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : వ్యాపారంలో ఉన్న వారికి శుభప్రదమైన వార్త అందుతుంది. సంపద పెరుగుతుంది. మంచి పనులు మీకు అనుకూలంగా జరుగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. విలువైన వస్తువులను అందుకుంటారు. ప్రతి ఒక్కరూ మీకు సాయం అందిస్తారు. ప్రేమానుబంధాలు బలంగా ఉంటాయి. ప్రజాదరణ, విశ్వసనీయత, ప్రభావం పెరుగుతుంది. వ్యక్తిగత విజయాలు పెరుగుతాయి. పరిహారం: భోళా శంకరుడికి నీళ్లు సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : వ్యాపారంలో అందరినీ కలుపుకుని పని ముందుకు సాగుతుంది. భాగస్వాములు అలా భాగస్వాములుగానే ఉంటారు. పనిలో ఊపు వస్తుంది. లాభం ఆశించిన దాని కంటే ఉత్తమంగా ఉంటుంది. కొత్త పద్ధతులను స్వీకరిస్తారు. ఆవిష్కరణలు విజయవంతమవుతాయి. శక్తి పెరుగుతుంది. లక్ష్యంపై గురి పెడతారు. వృత్తిపరమైన పనిలో వేగం పెరుగుతుంది. మంచి పనితీరు కొనసాగుతున్న భావన మీలో కలుగుతుంది. పరిహారం: ఆంజనేయుడికి హారతి ఇవ్వండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) :విధాన నియమాలపైన దృష్టి పెడతారు. లీగల్ మ్యాటర్స్‌లో ఓపిక కనబరుస్తారు. దినచర్యను చక్కదిద్దుతారు. రిస్క్ తీసుకోకూడదు. వివాదాలకు దూరంగా ఉండాలి. పనులు అలానే పెండింగ్‌లో పడవచ్చు. లావాదేవీల్లో అలసత్వం వద్దు. సంయమనంతో ఉండాలి. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : భూ సంబంధిత చర్చలు పూర్తై ఒప్పందాలుగా మారుతాయి. పెట్టుబడి పెట్టే ముందు అవసరమైన సలహా తీసుకోండి. వాణిజ్యపరమైన పనిలో కొనసాగుతారు. లాభాలు పెరుగుతాయి. లక్ష్యాలను చేరుకుంటారు. అన్ని వైపుల నుంచి మీకు విజయ సంకేతాలు అందుతాయి. దినచర్య బాగానే ఉంటుంది. పోటీ పరీక్షల్లో మీరు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారు. పరిహారం: ఆవుకు రొట్టె పెట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) :ఈ రోజు మీరు పని ప్రదేశంలో ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తారు. శ్రద్ధగా పని చేసుకుంటారు. భవిష్యత్తు కోసం వేసుకునే ప్రణాళికలు ఫలిస్తాయి. వాణిజ్య విషయాలు చక్కబడతాయి. అన్ని వైపుల నుంచి మద్దతు కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి నుంచి సహకారం లభిస్తుందన్న భావన మీలో కలుగుతుంది. వ్యాపారం క్రియాశీలకంగా ఉంటుంది. పరిహారం: పేదవాడికి ఎరుపు పండ్లను దానం చేయండి. .(ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) :ఈ రోజు మీరు ఆఫీసులో అనుభవం కలిగిన వ్యక్తుల సలహ, సహకారం తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో మెరుగ్గా ఉంటారు. వర్కింగ్ ఆప్టిమైజేషన్ పెరుగుతుంది. క్రమశిక్షణ, నిర్వహణ తీరు మెరుగవుతుంది. జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. పని వేగం పెరుగుతుంది. ఆకర్షణీయమైన అవకాశాలు మీ వద్దకు వస్తాయి. పరిహారం: దుర్గాదేవీకి స్వీట్లు సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : కెరీర్ సంబంధిత విషయాల్లో నిర్ణయం తీసుకునే ముందు ఉన్నతాధికారుల సలహా తీసుకోండి. ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి, ఇస్తే అవి తిరిగి రాకపోవచ్చు. పెట్టుబడి పేరుతో మీరు మోసపోయే అవకాశం ఉంది. భూమి, భవనాల విషయాల్లో మీకు ఆసక్తి కలుగుతుంది. ముఖ్యమైన పని అనుకున్న సమయానికి పూర్తవుతుంది. పరిహారం: సుందరకాండ పఠించండి. (ప్రతీకాత్మక చిత్రం)