(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology | ఓ రాశివారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. మరొకరు రుణాలు తీసుకోవడం, ఇవ్వడం మానుకోవాలి. కొన్ని రాశుల వారికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. అక్టోబర్ 8వ తేదీ (ఆశ్వీయుజ శుద్ద చతుర్దశి) శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
మేషం (అశ్వని, భరణి, కృత్తిక-1) : కార్యాలయంలో పురోగతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయవలసి ఉంటుంది. ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. వ్యాపారంలో వాణిజ్యపరమైన పనులకు సపోర్ట్ లభిస్తుంది. యాక్టివ్గా ఉంటారు. వాతావరణం సానుకూలంగా ఉంటుంది. అందరి సపోర్ట్ మీకు ఉంటుంది. పెద్దగా ఆలోచించండి. ఆటంకాలు తొలగిపోతాయి. పరిహారం: సరస్వతికి తెల్లని పువ్వుల గుత్తిని సమర్పించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) :కార్యాలయంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వ్యక్తిగత పనితీరుపై దృష్టి పెట్టండి. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అందరి నుంచి సపోర్ట్ లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో పోటీని కొనసాగిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వృత్తిపరమైన లక్ష్యాలు నెరవేరుతాయి. బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహిస్తారు. వ్యాపారం మరింత బలపడుతుంది. పరిహారం: శ్రీరాముడి ఆలయానికి జెండా అందజేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : రుణాలు తీసుకోవడం, ఇవ్వడం మానుకోండి లేదంటే నష్టపోతారు. పని ప్రదేశంలో మతోన్మాదానికి దూరంగా ఉండండి. వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకోండి. పాత కేసులు బయటపడవచ్చు. పెట్టుబడి విషయాల్లో ఆసక్తి చూపుతారు. వ్యాపార కార్యకలాపాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తారు. వ్యాపార విస్తరణపై దృష్టి సారిస్తారు. పరిహారం: హునుమంతుని ఆలయంలో నేతితో దీపం పెట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)వృత్తిపరమైన విజయాలు మెరుగుపడతాయి. వృత్తి వ్యాపారాలలో శుభం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు పరిష్కారమవుతాయి. సరైన దిశలో పయనిస్తారు. ధైర్యం పెరుగుతుంది. లక్ష్య సాధనకు ప్రయత్నించండి. కొత్త పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. పరిశ్రమల వ్యాపారం మెరుగుపడుతుంది. పరిహారం: శివుడికి నీటిని సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : డబ్బు వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. పొదుపు ఉంటుంది. వృత్తి వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సంపద పెరుగుతుంది. వ్యాపారం మెరుగ్గా ఉంటుంది. పని పరిస్థితిలో సానుకూలత పెరుగుతుంది. ముందుకు సాగడానికి సంకోచించకండి. లాభాల శాతం బాగానే ఉంటుంది. అనుకూలత పెరుగుతుంది. పరిహారం: భైరవుడి ఆలయానికి కొబ్బరికాయ దానం చేయాలి.(ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : వృత్తి వ్యాపారాలలో తడబాటు తగ్గుతుంది. మీరు కోరుకున్న విజయాన్ని పొందుతారు. వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. వస్తువులు, ఆలోచనల మార్పిడి పెరుగుతుంది. వృత్తి నిపుణులు ప్రయాణం చేయవచ్చు. పనిలో అజాగ్రత్త మానుకోండి. పరిహారం: ఆవులకు పచ్చ గడ్డిని పెట్టాలి.(ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఆఫీసు పనిలో సీరియస్గా ఉండండి, సన్నిహితులు, సహోద్యోగులు సహాయపడతారు. పెట్టుబడి పెట్టడంలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఉండాలి. వృత్తి వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యుల సపోర్ట్ పొందుతారు. చురుకుగా పని చేస్తారు. పూర్వీకుల వ్యాపారంలో ప్రభావవంతంగా ఉంటారు. పరిహారం: పసుపు రంగులోని ఆహారపదార్థాలను దానం చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) :జీవితంలోని ముఖ్యమైన పనులను వేగంగా నిర్వహిస్తారు. మీరు విశ్వాసాన్ని పొందుతారు. ఆర్థిక బలం అలాగే ఉంటుంది. మంచి ఆఫర్లు వస్తాయి. వివిధ కేసులను పరిష్కరిస్తారు. వృత్తి వ్యాపారాలపై దృష్టి సారిస్తారు. లాభాల శాతం మెరుగ్గా ఉంటుంది. పరిహారం: శ్రీకృష్ణుడి ఆలయానికి ఫ్లూట్ అందజేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : పెట్టుబడి పేరుతో మోసాలకు గురికావడం మానుకోండి. అపరిచిత వ్యక్తులను చాలా త్వరగా నమ్మవద్దు, ఇంటర్వ్యూలో జాగ్రత్తగా ఉండండి. అవసరమైన ఒప్పందాలు, అగ్రిమెంట్లలో ఓపిక పెరుగుతుంది. భ్రమలో పడకండి. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. వ్యవస్థపై నమ్మకం ఉంచండి. సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. పరిహారం: హనుమాన్ ఛాలీసీ పఠించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) :వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విజయాలు పెరుగుతాయి. అధికారులు సంతోషిస్తారు. పెద్ద పెద్ద పరిశ్రమలు వ్యాపారంతో ముడిపడి ఉంటాయని భావిస్తారు. నాయకత్వ భావన ఉంటుంది. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఆర్థిక ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. పనిలో స్పష్టత ఉంటుంది. పరిహారం: శివుడికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ప్రతీకాత్మక చిత్రం)
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) :వ్యవస్థీకృత గందరగోళం కొనసాగే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాల్లో సుఖంగా ఉంటారు. ఆర్థిక విషయాలు మిశ్రమంగా ఉంటాయి. అప్పులను నివారించండి. పరిశోధనలో పాలుపంచుకోండి. పనిలో సహనం పెరుగుతుంది. కెరీర్ వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యాన్ని నివారించండి. పరిహారం: శ్రీకృష్ణుడి ఆలయానికి ఫ్లూట్ అందజేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆర్థికాభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. వివిధ రంగాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తారు. వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకుంటారు. మీరు కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు. తోటివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పోటీలో ప్రభావవంతంగా ఉంటారు. వాణిజ్య విషయాలపై ఆసక్తి ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో వేగం పుంజుకుంటుంది. పరిహారం: ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)