(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిష్యం : అపరిచితులకు దూరంగా ఉండటం మేలు
నక్షత్రం, గ్రహాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు నవంబర్ 22వ తేది (కార్తీక బహుళ త్రయోదశి) మంగళవారం నాటి ధన జ్యోతిష్య ఫలితాలను అంచనా వేశారు. వాటి ప్రకారం ఓ రాశి వారికి మంచి లాభాలుంటే మరో రాశి వారికి నష్టాలున్నాయి. ఆ వివరాలేమిటో చదివేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
మేషం (అశ్వని, భరణి,కృత్తిక -1) : ఈ రోజు మీ పనిలో అంతా మిమ్మల్ని ప్రశంసిస్తారు. ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. పనిని ఆలస్యం చేయడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి రావచ్చు. కాబట్టి ఎప్పటి పనులను అప్పుడే పూర్తి చేయండి. మీ కుటుంబం సపోర్ట్పొందుతారు. పరిహారం: చేపలకు తిండి పెట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) :మీ ప్రణాళికను సరిగ్గా అమలు చేయడం ద్వారా మీ వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి. మంచి పెట్టుబడి అవకాశం కూడా లభిస్తుంది. అపరిచితుల నుండి దూరంగా ఉండండి. పుకార్లు నమ్మకండి. మీ ఆఫీస్‌లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీకు అవసరమైన పనులను ఆలస్యం చేయవద్దు. పరిహారం: వికలాంగులకు సేవ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) : వ్యాపారంలో పాజిటివ్ గ్రోత్ ఉంటుంది. వ్యాపార స్థలంలో పనిభారం పెరుగుతుంది. కమర్షియల్ పనుల్లో అజాగ్రత్త పనికి రాదు. మీ ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. మీరు మీ స్టార్టప్‌ల కోసం చేసే ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. పరిహారం: నల్ల కుక్కకు నూనెతో చేసిన జాంగ్రీ తినిపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఆఫీస్‌లో ఈ రోజు మీకు విజయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని సౌకర్యాలు పెరుగుతాయి. విశ్వాసంతో వ్యవహరిస్తారు. రూమర్ల జోలికి వెళ్లవద్దు. ఈరోజు మీకు లాభం పెరుగుతుంది. వ్యాపారంలో పెద్ద లక్ష్యాలను సాధిస్తారు. పరిహారం: లక్ష్మీదేవికి తామరపువ్వు సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : వ్యాపార సంబంధిత విషయాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఈ రోజు మీ వ్యాపారాభివృద్ధికి తగినట్లుగా మీరు ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది . మీ కెరీర్లో విజయం సాధిస్తారు. పరిహారం: పొద్దున్నే నిద్ర లేచి సూర్యుడికి నీరు సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : ఉద్యోగాలు చేస్తున్న వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనిలో క్రియేటివ్‌గా వర్క్ చేస్తారు. లాభాల శాతం బాగానే ఉంటుంది. మీ ఫ్రీలాన్సింగ్ వర్క్‌లో లాభం పొందే అవకాశం ఉంది. మీ కెరీర్లో అవసరమైన లక్ష్యాలు సాధిస్తారు. పరిహారం: చిన్న అమ్మాయిలకు పాయసం తినిపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : మీరు మీ ఉద్యోగంలో ఆకర్షణీయమైన ఆఫర్లను పొందుతారు. మీ జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు. ఆఫీస్‌లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. పట్టుదలతో పని చేస్తారు. భవిష్యత్తు కోసం చేసే ప్రణాళికలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పరిహారం: దుర్గా మాతకు ఎరుపు చున్రీని సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : ఈ రోజు మీరు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణం చేయవలసి రావచ్చు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. కుటుంబం నుంచి మీకు పూర్తి సపోర్ట్ లభిస్తుంది. పరిహారం: హనుమంతునికి కొబ్బరికాయను సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : ఈ రోజు మీ వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మీ వ్యాపారం కోసం మీరు సెట్ చేసిన లక్ష్యాలపై దృష్టి పెట్టండి. వ్యాపారంలో ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు. మీ వ్యాపారానికి సంబంధించి అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహా తీసుకోండి. వృత్తి వ్యాపారాలలో ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. పరిహారం: గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. (ప్రతీకాత్మక చిత్రం)