(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం) : జ్యోతిష్య నిపుణులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాలను విశ్లేషిస్తుంటారు. మార్చి 24 (శ్రీ శోభకృత్ నామ సంవత్సరం చైత్ర శుద్ధ తదియ) శుక్రవారం నాడు ఏయే రాశి వారికి ధన జ్యోతిష్యం పరంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.
మిథున రాశి (Gemini) :సౌకర్యాలపై చేసే ఖర్చులు పెరుగుతాయి, దాని కారణంగా అప్పు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తెలియని వ్యక్తులను కలుస్తారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆఫీస్లో సీనియర్ల నుంచి లాభాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పరిహారం: ఆవుకు రొట్టెలు తినిపించండి.