(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : ఓ రాశివారికి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. కొందరు పనిలో జాగ్రత్తగా ఉండాలి. సామర్థ్యానికి మించిన ప్రదర్శనలు అవసరం లేదు. నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఫిబ్రవరి 6వ తేదీ సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.
మేష రాశి (Aries) : ఈ రోజు వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. కెరీర్ బిజినెస్ ప్రయత్నాలలో అనుకూలత ఉంటుంది. పేపర్ వర్క్ మెరుగుపడుతుంది. సామర్థ్యానికి మించిన రిస్క్ తీసుకుంటారు, కానీ నష్టపోయే అవకాశం లేదు. ముఖ్యమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్లండి. పని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పరిహారం : ఆంజనేయుడికి కొబ్బరికాయను సమర్పించండి.
వృషభ రాశి (Taurus) : వర్క్‌లో ఊహించని పరిస్థితులు ఎదురుకావచ్చు. ఇండస్ట్రీలు వ్యాపారాన్ని కొనసాగిస్తాయి. ఆర్థిక రంగం సుఖంగా ఉంటుంది. బాధ్యులతో సమావేశం అవుతారు. కొత్త వ్యక్తులను కలవడంలో జాగ్రత్తగా ఉంటారు. ట్రేడింగ్‌లో కొనసాగింపు అవసరం. స్మార్ట్ వర్కింగ్ అలవాటు చేసుకోండి. పరిహారం : ఉదయించే సూర్యునికి నీటిని సమర్పించండి.
మిథున రాశి (Gemini) : వ్యాపారాలలో, వాణిజ్యపరమైన విషయాల్లో వేగంగా వ్యవహరిస్తారు. సామర్థ్యానికి మించి ప్రదర్శించే ప్రయత్నం ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. సహచరుల సపోర్ట్ లభిస్తుంది. మీరు గౌరవం పొందుతారు. ఆర్థికాభివృద్ధికి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పరిహారం : గణేశుడికి దూర్వా సమర్పించండి.
కర్కాటక రాశి (Cancer) : ఆర్థిక లావాదేవీలలో తొందరపాటు మానుకోండి. ఆఫీసులో ప్రత్యర్థుల చురుకుదనం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులను నియంత్రించండి. ముఖ్యమైన విషయాల్లో స్థిరత్వం పాటించండి. క్రమశిక్షణతో ముందుకు సాగండి. చురుకుగా పని జరుగుతుంది. సిస్టమ్‌పై దృష్టి సారించాలి. పరిహారం : నూనె రాసిన రోటీని కుక్కకు ఇవ్వండి.
కన్య రాశి (Virgo) : ఆర్థిక విషయాలు సాధారణం కంటే మెరుగ్గా ఉంటాయి. బిజినెస్‌కి వర్క్ అంకితం అవుతుంది. సెంటిమెంట్‌గా ఫీల్ అయి ముఖ్యమైన ప్రణాళికలను పంచుకోవడం మానుకోండి. వర్కింగ్ సిస్టమ్ బలోపేతం అవుతుంది. సంప్రదాయ వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు. ధైర్యం, శక్తితో ప్రస్తుతం ఉన్న పొజిషన్లో కొనసాగుతుంటారు. పరిహారం : సరస్వతీ దేవిని పూజించండి.
తుల రాశి (Libra) : ఆఫీస్‌లో సాఫీగా ముందుకు సాగుతారు. కెరీర్ బిజినెస్ మెరుగవుతుంది. వాణిజ్యపరమైన ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణం చేపట్టే అవకాశం పెరుగుతుంది. శుభవార్తలు అందుకుంటారు. సౌకర్యాలు పెరుగుతాయి. సృజనాత్మక విషయాలలో సమయం ఇస్తారు. వాణిజ్య ప్రయత్నాలలో క్రియాశీలతను కాపాడుకుంటారు. పరిహారం : తెల్లని వస్తువులను దానం చేయండి.
వృశ్చిక రాశి (Scorpio) : వ్యాపారంలో ముందుంటారు. ఆర్థిక ప్రగతితో ఉత్సాహంగా ఉంటారు. పోటీ భావం ఉంటుంది. వృత్తి నిపుణులు మరింత విజయం సాధిస్తారు. బిజినెస్‌కి వర్క్ అంకితం అవుతుంది. పూర్వీకుల కార్యక్రమాలతో ముందుకు సాగుతారు. ప్రతిభ కనబరుస్తారు. ఆర్థికంగా ఆదా చేస్తారు. పరిహారం : పేదవారికి ఎర్రటి పండ్లను దానం చేయండి.
ధనస్సు రాశి (Sagittarius) : వ్యాపారంలో ముందుంటారు. విధాన నియమాలను పాటిస్తారు. ఆధునిక ప్రయత్నాలు ఊపందుకుంటాయి. చుట్టూరా లాభం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఓర్పు ప్రదర్శిస్తారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటారు. ప్రయత్నాలు ఊపందుకుంటాయి. కెరీర్ మెరుగ్గా ఉంటుంది. పరిహారం : పేదవారికి అన్నదానం చేయండి.
మకర రాశి (Capricorn) : విధాన నియమాలపై అవగాహన కలిగి ఉంటారు. వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తారు. కెరీర్ బిజినెస్‌లో నమ్మకం ఉంటుంది. సిస్టమ్‌పై దృష్టి సారిస్తారు. వృత్తి నిపుణులకు వాతావరణం సాధారణంగా ఉంటుంది. పోటీకి దూరంగా ఉంటారు. ఆఫర్లు అందుతాయి. లావాదేవీలలో రుణాలు తీసుకోవడం మానుకోండి. రాయడంలో తప్పులు చేయవద్దు. ఒప్పందాలలో స్పష్టంగా ఉండండి. పరిహారం : శివునికి నీటిని సమర్పించండి.
మీన రాశి (Pisces) : ఈ రోజు మీరు ఆఫీస్‌లో ప్రభావవంతంగా ఉంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఓర్పు ప్రదర్శిస్తారు. సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. లాభాల అవకాశాలు పెరుగుతాయి. పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. వృత్తిపరమైన సమతుల్యత ఉంటుంది. ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తారు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు. పరిహారం : హనుమాన్ చాలీసా పఠించండి.