(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు మార్చి 14 (ఫాల్గుణ బహుళ సప్తమి) మంగళవారం నాటి ధన జ్యోతిష్యం ఫలితాలను అంచనా వేశారు. నేడు మనీ ఆస్ట్రాలజీ ఎవరికి ఎలా ఉంటుందో చూద్దాం.
కన్య రాశి (Virgo) : రోజు అనుకూలంగా ఉంటుంది, నిలిచిపోయిన ముఖ్యమైన పనులు ఈరోజు సులభంగా పూర్తవుతాయి. మ్యూచువల్ ట్రస్ట్, సహాయంతో ఫ్యామిలీ రిలేషన్స్ బలంగా ఉంటాయి. ఆదాయం బాగుంటుంది, ధనలాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. షార్ట్ టర్మ్ సక్సెస్ కోసం తగని కార్యకలాపాలపై శ్రద్ధ చూపవద్దు.
పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి.