(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష్య, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిష్యం :గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వివిధ రాశుల వారికి ఎదురయ్యే ఆర్థిక పరిస్థితులను జ్యోతిష్య నిపుణులు ముందుగానే అంచనా వేస్తుంటారు. నవంబర్ 17వ తేదీ (కార్తీక బహుళ నవమి) గురువారం నాడు వివిధ రాశుల వారికి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) : ఈ రోజు మీరు ఉద్యోగంలో, మీ పనిలో సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. ఉద్యోగస్తుల ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీ లక్ష్యాలకు సంబంధించి మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో, అవన్నీ ఈరోజు మీరు సాధిస్తారు. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడి మెరుగ్గా ఉంటుంది. పరిహారం: హనుమంతుడికి సింధూరం సమర్పించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మిథునం (మృగశిర 3,4, అర్ర, పునర్వసు 1,2,3) : ఈ రోజు అనవసరంగా ఖర్చు చేయకండి, లేకుంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాల్సి రావచ్చు. పెట్టుబడి పెట్టడానికి ముందు నిపుణుల సలహా తీసుకోండి, లేకపోతే మీరు నష్టపోవచ్చు. ఈరోజు వృత్తిపరమైన విషయాలపై మీ దృష్టి పెరుగుతుంది. పరిహారం: కుంకుమ తిలకం దిద్దుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రోజు బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో లాభాలు పొందుతారు. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలను పొందుతారు. మేనేజ్మెంట్ రంగంలో అడ్మినిస్ట్రేషన్ మెరుగ్గా ఉంటుంది. ఆఫీస్‌లో సీనియర్ల మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ బిజినెస్ ప్లాన్స్ విజయవంతమవుతాయి. పరిహారం: శని ఆలయాన్ని సందర్శించండి. (ప్రతీకాత్మక చిత్రం)
కన్య (ఉత్తర 2,3,4, హన్త, చిత్త 1,2) : ఈ రాశికి చెందిన ఉద్యోగులు లాభం పొందుతారు, బోనస్ లేదా అదనపు ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారుల సామర్థ్యం పెరుగుతుంది, కొత్త ఆర్డర్లు అందుకోవచ్చు. ఏ పనినీ రేపటికి వాయిదా వేయకండి. వ్యాపారంలో సానుకూలతను కొనసాగించాలి. ఈరోజు మీ వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పరిహారం: గణేష్ మంత్రాన్ని జపించండి. (ప్రతీకాత్మక చిత్రం)
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) : ఈ రోజు ఉద్యోగంలో ఊహించని ఫలితాలు పొందుతారు. మీ ప్రణాళికపై దృష్టి పెట్టండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, లేకుంటే మీరు చాలా నష్టపోవచ్చు. ఆఫీస్‌లోని పరిస్థితులకు అనుగుణంగా మీరు నిర్ణయాఉ తీసుకోవాలి. మీ వ్యక్తిగత ఖర్చులను కూడా నియంత్రించాలి. పరిహారం: నల్ల కుక్కకు సేవ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) : మీ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయండి, పెండింగ్‌లో ఉంచడం మానుకోండి. ఈరోజు కొత్త వ్యాపారంలో భాగస్వామ్యం బలంగా ఉంటుంది. ఆఫీస్‌లో టీమ్ స్పిరిట్ ప్రబలంగా ఉంటుంది. ఈరోజు మీ ఆఫీస్‌లో పని, కార్యకలాపాలు పెరుగుతాయి. పరిహారం: గోశాలకు ఆర్థిక సహాయం చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) : ఆఫీస్‌లో ప్రొఫెషనల్ రిలేషన్స్‌ను గౌరవించండి. ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయండి. ఆర్థిక విషయాల్లో స్పష్టంగా ఉండండి. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. ఆఫీస్‌లో క్రమశిక్షణను కొనసాగించండి. వ్యాపారంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: లక్ష్మీదేవికి ఖీర్ నేవేద్యంగా పెట్టండి. (ప్రతీకాత్మక చిత్రం)
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : ఈ రోజు పెండింగ్‌లో ఉన్న అత్యవసర పనులు సులభంగా పూర్తవుతాయి. పరస్పర నమ్మకంతో కుటుంబ సంబంధాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది, ధనలాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. షార్ట్‌టర్మ్ సక్సెస్ కోసం తప్పుడు విషయాలపై శ్రద్ధ చూపవద్దు. పరిహారం: లక్ష్మీదేవిని పూజించండి. (ప్రతీకాత్మక చిత్రం)
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) : వ్యాపారంలో విజయం సాధించడానికి మీరు కొంచెం కష్టపడాలి. త్వరలో విజయం సాధిస్తారు. మీ వ్యాపారంలో ప్రజల సహకార స్ఫూర్తి పెరుగుతుంది. ఈరోజు మీ వ్యాపారంలో మీరు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభను కనబరిచే అవకాశాలు లభిస్తాయి. పరిహారం: అనాథాశ్రమాలకు ఫ్యాన్లు అందించండి. (ప్రతీకాత్మక చిత్రం)