(Bhoomika Kalam : భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology ధన జ్యోతిషం : కొంతమందికి ఆర్థికంగా కలిసొస్తుంది. మరికొందరికి ఉద్యోగాల్లో కలిసొస్తుంది. ఇంకొందరికి వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఇలా నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్య నిపుణులు ధన జ్యోతిష్యాన్ని అంచనా వేశారు. జనవరి 22 (ఆదివారం) నాడు ఆయా రాశుల వారికి మనీ ఆస్ట్రాలజీ లేదా ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
మిథున రాశి (Gemini) : వ్యాపార సంబంధిత పబ్లిక్ డీలింగ్, కాంటాక్ట్ సోర్సెస్‌ను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. పెద్ద ఆర్డర్ పొందవచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్‌లో మీరు చాలా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే వ్యక్తులు తమ సీనియర్లతో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. పరిహారం : యోగా, ప్రాణాయామం సాధన చేయండి.
కర్కాటక రాశి (Cancer) : వ్యాపార పనులు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. ప్రస్తుతం మీ పద్ధతిలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ టెన్షన్స్ ఆఫీస్ వర్క్‌పై ప్రభావం చూపేలా, డామినేట్ చేసేలా ఉండకుండా జాగ్రత్తపడండి. మార్కెటింగ్‌కు సంబంధించిన పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పరిహారం : శివ చాలీసా పఠించండి.
సింహ రాశి (Leo) : మార్కెటింగ్ సంబంధిత పని లేదా ఏదైనా అధికారిక ప్రయాణాన్ని వాయిదా వేయండి. బిజినెస్ మెషినరీ, మోటార్ పార్ట్స్‌కు సంబంధించిన వ్యాపారంలో అద్భుతమైన ఆర్డర్లు ఉంటాయి. ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల మీకు హాని కలుగుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పరిహారం : సూర్య భగవానునిడికి నీరు సమర్పించండి.
తుల రాశి (Libra) : మీరు కొంతకాలంగా వ్యాపారంలో చాలా కష్టపడుతున్నారు, ఈ రోజు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సీనియర్ కుటుంబ సభ్యుల సహకారం, సలహా.. మీ పనిలో సహాయం చేస్తుంది. అయితే కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుత కార్యకలాపాలపై మాత్రమే దృష్టి పెట్టండి. పరిహారం : హనుమాన్ చాలీసా పఠించండి.
వృశ్చిక రాశి (Scorpio) : వ్యాపారంలో నిర్లక్ష్యం వహించకూడదు. నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. పార్ట్నర్షిప్ బిజినెస్‌లో పారదర్శకత పాటించండి. రిలేషన్లో ఒక అపార్థం,.. చీలికకు కారణమవుతుంది. మీ వ్యాపారంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయకండి, ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. పరిహారం : హనుమాన్ చాలీసా పఠించండి.
మీన రాశి (Pisces) : వర్క్ ప్లేస్‌లో ఉద్యోగస్తులకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ ఆధిపత్యం అలాగే ఉంటుంది. మార్కెటింగ్, మీడియాకు సంబంధించిన పనులకు దూరంగా ఉండండి. ప్రస్తుతం లాభదాయకమైన అవకాశాలు కొట్టుమిట్టాడుతున్నాయి, ఈ సానుకూల పరిస్థితులను సరిగ్గా ఉపయోగించుకోండి. పరిహారం : యోగా ప్రాణాయామం సాధన చేయండి.